ఆ… రూపం… కనీ కనిపించని ఆకారం… నీ భుజం మీద చెయ్యివేసి నిమురుతున్నట్లు. ఎక్కడి నుంచో … సన్నగా వినిపిస్తున్న పాట……
Author: మణి వడ్లమాని
కథా రచయిత్రి. 2010లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. చదవడమంటే ఇష్టం. కథలు రాయాలనే అభిలాషతో రాసిన తొలి కథ “కృష్ణం వందే జగద్గురుం” కౌముదిలో ప్రచురిచతమైంది. ఇప్పటి దాకా రాసిన కథల సంఖ్య దాదాపుగా డెబ్బై ఐదు. తొలి కథ కౌముది అంతర్జాల మాసపత్రికలో ప్రచురితమైంది. నవ్య, ఆంధ్రభూమి, స్వాతి, తెలుగు వెలుగు, విపుల, రచన, జాగృతి వంటి వార, మాస పత్రికలలోనూ, ఆంధ్రప్రభ, సాక్షి, నమస్తే తెలంగాణ, మన తెలంగాణ, ప్రజాశక్తి, వెలుగు వంటి దినపత్రికల్లోనూ, విశాలాంధ్ర వారి దీపావళి సంచికలోనూ కథలు ప్రచురితమయ్యాయి. చతుర మాస పత్రికలో తొలి నవల “జీవితం ఓ ప్రవాహం” ప్రచురణ అయింది. రెండవ నవల 'కాశీపట్నం చూడరబాబూ' జాగృతి వారపత్రికలో సీరియల్ గా వచ్చి , పుస్తకంగా వెలువడింది. మూడవ నవల ‘ప్రయాణం’ ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురిచతమయింది.