నేనిప్పుడు మాట్లాడుతుంది దావూద్ ఇబ్రహీం గురించి కాదు అబూసలేం ఊసు అసలే కాదు వాళ్లంటోళ్ల శరీరాల కింద మెత్తటి పరుపులై నలుగుతున్న…
Author: పుట్ల హేమలత
పుట్టింది ఏలూరు. నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్, డీ.కే.డబ్ల్యు కళాశాలలో విద్యాభ్యాసం. ఆంధ్ర విశ్వ విద్యాలయం/ పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయాల్లో M.A, Ph.D, TCH (Teacher's Training), Diploma in Computer Application. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లో అధ్యాపకురాలు. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ గా పని చేశారు. 'అంతర్జాలంలో ని తెలుగు సాహిత్యం' అనే అంశం పై పరిశోధన చేశారు. వివిధ సాహిత్య అంశాలపై జాతీయ సెమినార్లలో 30 కి పైగా పత్ర సమర్పణలు చేశారు. తెలుగు మహిళా వెబ్ మాస పత్రిక 'విహంగ' 2011 జనవరిలో ప్రారంభించారు. 9 ఫిబ్రవరి, 2019న తుదిశ్వాస విడిచారు. ఆమె తేవాలనుకున్న ' వేకువ రాగంస( కవితా సంపుటి) , 'నీలికస ( వ్యాస సంపుటి)ఆమె తదనంతరం ఆమె భర్త ఎండ్లూరి సుధాకర్, కూతురు మానస ఎండ్లూరి ప్రచురించారు.