పుర్రెనిండా పరాయితనం దాచుకొని ఎన్నాళ్ళు నన్ను కౌగిలించుకున్నా ఎప్పటికీ నేను నీకు గులాబీనే చేతికివ్వాలనే అనుకుంటాను పువ్వు కింద ముళ్లు నా…
Author: నబి కరీం ఖాన్
పుట్టిన ఊరు ఒంగోలు. అసలు పేరు కరిముల్లా ఖాన్. కలం పేరు నబి కరీంఖాన్. కార్మికుడు, సామాజిక కార్యకర్త, కవి. పదో తరగతి వరకు చదువుకున్నారు. కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టారు. CPMలో కొంత కాలం క్రితం వరకు సభ్యునిగా ఉండి పార్టీ ప్రజా సంఘాలైన యువజన, మైనారిటీ ప్రజా సంఘాలలో పనిచేశారు. అనారోగ్యంతో మరణించిన తన పెద్దన్నయ్య నబిఖాన్ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించేందుకు, తన క్షరాలలొ అన్న బతికే వుండాలని ఆకాంక్షతో వారి పేరును కలం పేరుగా పెట్టుకున్నారు. రచనలు: నిషిద్దాక్షరాలు(కవితా సంకలనం. రఫీ అనే మిత్రుడితో కలిసి 2003లో), వేకువకోసం (దీర్ఘ కవిత. 2007లో), ధోకా (దీర్ఘ కవిత. అముద్రితం). ఐదు కథలు రాశారు. అవి కథామినార్, మాతృక, ప్రియదత్త, ఆకాశవాణిలో ప్రసారం, ప్రచురితమయ్యాయి. 'గుజరాత్ గాయం' సంకలనం(2002) నుండి 'ముఖామి'(2017) వరకు అనేక ముస్లింవాద కవితా సంకలనాలలో నబి కరీంఖాన్ కవిత్వం ప్రచురితమైంది.