‘సంతకం’ సాహిత్య వేదిక కవయిత్రి, చిత్రకారిణి కొండేపూడి నిర్మల, రచయిత్రి డా. అమృత లతల సంయుక్త సారథ్యంలో సాహితీ సదస్సు జరిగింది.…
Author: డా. ఉమ్మడిశెట్టి రాధేయ
స్వస్థలం: కడపజిల్లా ముద్దనూరు మండలం, యమవరం గ్రామం. కవి, విమర్శకుడు. తెలుగు సాహిత్యంలోె ఎం.ఏ., పీ హెచ్ డీ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తూ 2013 లో పదవీ విరమణ చేశారు. రచనలు: 'మరోప్రపంచం కోసం'(1978), 'దివ్యదృష్టి', 'జ్వలనమ్', 'తుఫాను ముందటి ప్రశాంతి', 'ఈ కన్నీటికి తడిలేదు', 'క్షతగాత్రం', 'మగ్గం బతుకు', 'అవిశ్రాంతం' సంపుటాలు వచ్చాయి. విమర్శకుడిగా 8 పుస్తకాలు. 'కవిత్వం ఓ సామాజిక స్వప్నం'(మొదటి సంపుటి), 'కవిత్వం ఓ సామాజిక సంస్కారం'(రెండవ సంపుటి), 'కవిత్వం ఓ సామాజిక సత్యం'(మూడవ సంపుటి), 'కవిత్వం ఓ సామాజిక చైతన్యం'(నాల్గవ సంపుటి. )అవగాహన-1 , మూడుపదులు ముప్పై కావ్యాలు, వివేచన- 2 త్వరలో రానున్నాయి. ''మగ్గం బతుకు'' దీర్ఘ కావ్యం ఆంగ్ల, హిందీ భాషల్లో కి అనువాదమైంది.