రేణుకా అయోల తెచ్చిన రెండో దీర్ఘ కవిత పృధ- ఒక అన్వేషణ . దీనికి మూలం ఎస్.ఎల్ భైరప్ప, అనువాదం…
Author: కొండేపూడి నిర్మల
పుట్టింది హైదరాబాద్అ. బాల్యం , విద్యాభ్యాసం విజయవాడలో గడిచాయి. 1977 లో విజయవాడ మేరీ స్టెల్లా కాలేజీలో బి.ఎ. డిగ్రీ చదివారు. వృత్తిరీత్యా విలేకరి. ప్రవృత్తిరీత్యా సృజనాత్మక రచయిత్రి. ఒక వాదానికి బలమయిన ప్రతినిధిగా వస్తు వైవిధ్యంలోనూ, భావ గాంభీర్యంలోనూ ఒక ప్రత్యేక ముద్ర కోసం కృషి చేశారు. 1978 లో ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదక శాఖలో కెరీర్ ప్రారంభించి దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ప్రచురణ , ప్రసార, అంతర్జాల మాధ్యమాల్లో సబ్ ఎడిటర్ , ప్రోగ్రామ్ ప్రెజెంటర్ , కంటెంట్ ఎడిటర్ స్థాయిలో పనిచేశారు. రచనలు: సందిగ్ధ సంధ్య (1988), నడిచేగాయాలు(1990), బాధా శప్తనది(1994), మల్టీనేషనల్ ముద్దు(2001), కథాసంపుటాలు: శత్రుస్పర్శ (1998), ఎచటికి పోతావీ రాత్రి(2019). 2000 లో అభివృద్ధి రంగంలో అడుగుపెట్టి ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ లో జండర్, అండ్ కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ గా పని చేశారు. అన౦తరం అర్బన్ డెవలప్ మెంట్ , వెలుగు ప్రాజెక్టులకు న్యూస్ లెటర్ ఎడిటర్ గా, కొంతకాలం అధికార భాషా సంఘంలో వ్యవసాయ , పాలనా అంశాలకు సంబంధి౦చిన నిఘంటువు రూపకల్పనలో పాత్ర వహించారు. ప్రస్తుతం జండర్ సమాచార రంగాల్లో శిక్షకురాలుగా , పాఠ్యా౦శాల రచయితగా , అనువాదకురాలుగా వున్నారు. గ్రీన్ థాట్ పేరుతో thematic poetry వీడియోలు రూపకల్పన చేస్తున్నారు. కవుల కవిత్వంతో ఫోటోషాప్ , గ్రాఫిక్ బొమ్మలు visul poetry అనే వినూత్న ప్రక్రియ చేపట్టి కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు.
కొడుకులకి ఆస్తులు కూతుళ్లకి హారతి పళ్ళేలూ…
ఏ విషయం అయినా సరే ప్రతి పదేళ్లకోసారి కొత్తగా అర్ధం చేసుకోవాల్సిన అవసరం వుందేమో, అప్పుడే అంతకుముందు తెలియని ఇంకో కోణం…
నీ పాస్ వర్డ్ ఏమిటి?
అరమరికలు తెలిసిన నువ్వు మరని కనిపెట్టావు కదాఅది నిన్ను అమా౦తం మింగేసిందిముందొచ్చిన కరచాలనం కంటేవెనకొచ్చిన స్మయిలీలు ముద్దొస్తాయినేల వాలిన నీడలు గోడెక్కి…
ఛీ
హత్యాచార౦ వార్త విన్నప్పుడల్లా పుట్టని నా భూమి వారసుల తల్లి పేగు తెగిపోయినట్టనిపిస్తుంది నాగరికత వెన్నెముక ఉన్నపళాన వొరిగిపోయినట్టనిపిస్తుంది చీకటి ముసిరిన…