పిలుపు యుద్ధవార్తలు నిద్రపోనివ్వడం లేదా?రా! యుద్ధాలు ఉండని ప్రపంచానికైఅవిశ్రాంతంగా శ్రమిద్దాం!ఇరాక్ భూభాగంపైన వున్న శవాలగుట్టలన్నీనీ బంధువులవేనా?రా! సామ్రాజ్యవాదాన్ని కసిగా హతమార్చుదాం!నువ్వు పేట్రియాట్లనీ…
Author: ఎంఎస్ఆర్
జననం: కరీంనగర్ జిల్లా గోదావరి లోయ ప్రాంతం. అసలు పేరు ఎం. శ్రీనివాసరావు. ఎంఎస్ఆర్, కరుణాకర్, ప్రభాకర్ అనే కలం పేర్లతో రచనలు చేశాడు. ఇంజనీరింగ్ చదివేటపుడు విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమానికి చేరువయ్యాడు. హైదరాబాద్ లోని వాసవీ ఇంజనీరింగ్ కాలేజీలో బి.ఇ ఎలక్ట్రానిక్స్ రెండో సంవత్సరంలో విప్లవోద్యమంలోకి పూర్తికాలం కార్యకర్తగా వెళ్లాడు. పటాన్ చెరు పారిశ్రామిక వాడల్లో విప్లవకారుడిగా కార్మికోద్యమ నిర్మాణం చేశాడు. 3 సెప్టెంబర్, 1992న పోలీసులు పట్టుకొని కాల్చిచంపారు. తాను డైరీలో రాసుకున్న కవితలు, సినిమా రివ్యూలు, జ్ఞాపకాలను విరసం 'కాగడాగా వెలిగిన క్షణం' పేరుతో పుస్తకం ప్రచురించింది.