A poet’s will: శ్రీ రవి రంగనాథన్

కవిత్వం జీవితంలో ఓ భాగం మాత్రమే. అదే జీవితం కాదు. కొంతమంది కవిత్వాన్ని కేవలం ఇష్టంగానో, లేక ఓ కాలక్షేప వ్యాపకంగానో రాసుకుంటారు. కానీ కవి సరదాగా రాసుకున్నా వారి కవిత్వం సీరియస్ పంథా తీసుకుని పాఠకులనీ, అభిమానులను తయారుచేసుకుంటుంది. అలాంటి కోవకు చెందిన కవే ఈరోజు మనం చదవబోయే కవి శ్రీ రవి రంగనాథన్.

వీరు కవీ, రచయితా, విమర్శకులు. బ్యాంకు ఉద్యోగిగా పదవీ విరమణ చేసి ప్రస్తుతం చెన్నైలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఇంతవరకూ ఆంగ్లంలొ మూడు సంకలనాలు వెలువరించారు.

  1. Lyrics of Life
  2. Blade of green grass
  3. Cloudless Climes

“మైకూ” అనే ఓ విలక్షణమైన కవితా ప్రక్రియలో తన కవితలను విరివిగా రాస్తుంటారు. ప్రకృతీ, జీవితంలోని వివిధ సున్నిత కోణాలు వీరి కవితా వస్తువులు. దేశంలోని వివిధ పత్రికల్లో తెలుగు మరియు తమిళ భాషల్లో వీరి కవిత్వం ప్రచురితం. ద్విభాషా కవిగా పలు పురస్కారాలు అందుకున్న ఘనత వీరిది. “Literati Cosmos” వారి సాహిత్య గౌరవ పురస్కారం, “Philosophique Poetica” వారు ప్రతీ ఎడాది ఇచ్చే “Master of Creative Impulse” పురస్కారం, “PoiesisOnline” వారి ప్రతిష్టాత్మక “Poiesis award for excellence” పురస్కారాలు మచ్చుకు కొన్ని మాత్రమే. అంతర్జాతీయ అంతర్జాల సాహితీ సంచిక “Metaverse” లోనూ “Literary Vibes” లోనూ వీరి ఆంగ్ల కవితలు విధిగా ప్రచురితమవుతుంటాయి.

రవి రంగనాథ్ గారితో ఇంటర్వ్యూలోని కొంతభాగం:కవిత్వం మీలో తీసుకొచ్చిన మార్పు?
కవిత్వం నా అంతరాంతరాలలో దాగిఉన్న మహత్తరమైన, లోకోత్తరమైన భావననలను ప్రభావంతంగా ప్రతిభావంతంగా వచనాత్మక వాక్యాలనుంచి దూరంగా కవితాత్మకంగా, సదృశ్యంగా వ్యక్తపరిచే విధంగా నన్ను మార్చింది. అది ఒక హఠాత్తుగా స్ఫురించిన ఆలోచన కావొచ్చు లేదా మనసులో దాగిన ఇష్టమైన స్మృతి కావొచ్చు. ఒక్కోసారి నాలోని భావోద్రేక ప్రకంపనలు తెరలుతెరలుగా వెలువడుతుంటాయి. అప్పుడే నాలోని కవి కలమెత్తుతాడు. I fully agree with Robert Frost who said ”Poetry is when an emotion has found its thought and the thought has found words”. “భావోద్రేకం ఒక ఆలోచనకు రూపం కల్పిస్తుంది. ఆ రూపం పదాలను వెతుక్కుంటుంంది. అప్పుడే కవిత్వం ప్రాణం పోసుకుంటుంది.” అన్న రాబర్ట్ ఫ్రాస్ట్ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను.

సాహిత్యంలోని మిగతా ప్రక్రియలకంటే కవిత్వం రాయటం సులభం అంటారా?
నిజానికి కవిత్వమే కష్టమైన ప్రక్రియ. కవిత్వంలో ఊహాజనితమైన మరియు అనుగుణ్యమైన పదాల వాడుక జరగాలి. కవిత్వానికి మిగతా ప్రక్రియలకీ ప్రధాన తేడా పదాల పొదుపు. అదే కవికి కష్టతరమైన పని. నాటకాలు, నాటిక, నవల, వ్యాసం వీటన్నికంటె కవిత్వంలో పదాల ఎంపిక విషయంలోనూ, నిడివిలోనూ సమస్యలుంటాయి. వాక్యనిర్మాణ విషయంలో కవి అత్యంత జాగరూకుడై ఉండాలి. కవితా నిర్మాణ పధ్ధతులూ, శైలీ, రూపం వీటి విషయాలలో కవికున్న కష్టం మరెవ్వరికీ లేదని నా అభిప్రాయం.

ద్విభాషా కవిగా మీరు ఏ భాషలో సౌలభ్యంగా ఫీలవుతుంటారు.అనువాదాల విషయంలో మీ అనుభవం?
నాకు రెండు భాషలు రెండు కళ్లలాంటివి. తమిళం నా మాతృభాష కాబట్టి అందులో ఎక్కువ సౌలభ్యత అంటే త్వరగా రాసే అవకాశం ఉంది. అదే ఆంగ్లంలొ ఒకటికి రెండు సార్లు సరిచూసుకుని, కవిత్వంలో నేను చెప్పదల్చుకున్నది విస్పష్టంగా చెప్పానా లేదా అన్నది స్థిరపరచుకుని మరీ రాస్తుంటాను.

అనువాదాలు అవసరమే. ఉదాహరణకు నా కవితలని నేనే తమిళం నుంచీ ఆంగ్లంలోకి ఇట్నుంచీ అటూ చేస్తుంటాను. అలాగే మిగతా అనువాదాల సాహిత్యం చదవటం నాకెంతగానో ఉపయోగపడింది. ఇప్పుడు ప్రాచీన తమిళ సాహిత్యాన్ని చదువుతున్నప్పుడు నా సాహిత్యంపై దాని ప్రభావం చాలానే ఉంది. కానీ ఇంకా అనువాదాలు జరగాలి. లబ్ధప్రతిష్టులైన సాహితీకారులు మన సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబించించే సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువదిస్తే వర్ధమాన రచయితలకు, కవులకూ మేలు చేసినవారవుతరని నా ప్రగాఢ విశ్వాస్వం.

Connecting with Clouds

– Ravi Ranganathan

I am a habitual cloud chaser
Lying on green grass, shaded by trees above
Enjoying my own ennui in a capricious way
River ahead reflects my subject wondrously
Wandering clouds meander in no defined patterns
I wonder are they chasing me…

I am not asking rain clouds to carry a message
Not mapping their beautiful route to bliss;
Wafted by breeze, lifted by solar cells
I watch the milky cadence dance
Watch with fascination, watch in trance
I wonder are they carrying me…

Faked by drift, Choked by tears
Their hearts broken, they are to pieces shred
Succumbing to earthly fears
When they drop dead, they shed
Last few traces of their heavenly spread
I wonder are they missing me…

మేఘాలలో మేఘానినై…
(అనుసృజన : వాసుదేవ్)

మేఘాలను వేటాడటం నా కలవాటే
చెట్లనీడలో, పచ్చని గడ్డిపై వెల్లకిలా పడుకుని మరీ
నా చపలచిత్తంతో, బధ్ధకంగా వాటిని ఆనందిస్తుంటాను
నా ముందున్న నది నన్ను చోద్యంగా ప్రతిబింబిస్తుంది
చెదురుమదురుగా మేఘాలు తిరుగుతూనే ఉన్నాయి
నన్ను అవి వెంటాడుతున్నాయా అని అనుమానం

***

నీటి మేఘాలని నేనేమీ సందేశం ఇమ్మని అడగలేదే
వాటి రస్తాని కూడా నేనేమీ నిర్దేశించలేదే
గాలితెమ్మెరతోనో, దినకరుడి కిరణాలతోనో
కొట్టుకొచ్చిన మబ్బులని అచ్చెరువొంది మరీ చూస్తుంటాను
పాలముద్దల్లాంటి వాటి లయబధ్ధ నాట్యాన్ని
తన్మయంగా చూస్తుంటాను, అబ్బురపడి మరీ వీక్షిస్తుంటాను
ఐనా అవి నన్ను మోస్తున్నాయా అని ఆశ్చర్యమే

***

తొందరపాటు వురవడికో, ఉక్కిరిబిక్కిరి చేసే కన్నీళ్ళకో
గుండె పగిలిన ఆ మేఘాలు ముక్కములయ్యాయి
భూమి క్షుత్తుకి లొంగిపోయిన మబ్బులన్నీ
వానచుక్కలుగా నన్ను చేరుతూనే ఉన్నాయి
చివరిచుక్కలు భళ్ళుమని నేలని తాకినప్పుడు
స్వర్గం నుంచి దివ్యత్వాన్నిక్కడికి చేరుస్తుంటాయి
అవి నన్ను కోల్పోతున్నాయా అని విస్మయమే

Tread Gently

– Ravi Ranganathan

Misty mornings are happy happenings.
Dews plead
‘Touch me not’
Their somnolence
cannot be disgorged…
I tread gently
lest they be dislodged…
The sky with starry airs
like an embroidered canopy
diffuses its ethereal moonscape…
Flowers fuse profusely
in their fulsome fragrance;
pollen grains synthesise
a sweet swollen syndrome…
Nature in splendid attire…
What a seamless scene…
Have never ever gauged
such awesome sheen,
I tread gently,
dare not dislodge…

విశాఖలో పుట్టి అక్కడే డాక్టరేట్ వరకూ చదివి ఆపై విదేశాల్లో వివిధ యూనివర్శిటీల్లో పనిచేసి ఇప్పుడు బెంగ్లూరు లో స్థిరపడి ఇక్కడ ఫ్రీలాన్సర్ గా పనిచేస్తున్నారు. రోజంతా పాఠం చెప్పటం... రాత్రైతే ఏదో రాసుకోవటం లాంటివి చేస్తుంటానంటారు. కవిత్వం అంటే ఇష్టం. కవిత్వం గురించిన చర్చలు కూడా ఇష్టమే.

3 thoughts on “A poet’s will: శ్రీ రవి రంగనాథన్

  1. Ravi Ranganathan is a wonderful poet who touches heart with his amazing poems.

Leave a Reply