నిశిద్ధాంక్షల నడుమ చిక్కుకుపోయిన చిత్రంలా వాళ్లంతా
మళ్ళీ నా చూపులకు చిక్కుకున్నారు
యుద్ధంలో గాయపడిన పావురాల్లా
సాయంకోసం నావైపే చూస్తున్నట్టున్నారు
కాని నేనేం చేయగలను…
నాలుగు వేడి వాడి పదాలను సూటిగా ఎక్కుపెట్టగలను అంతే…
నాలుగు నినాదాలను రాసి పిడికిళ్ళకు అందివ్వగలను…
నిద్రాణంలో ఉన్న లోకాన్ని జాగృత పరచగలను…
మా కలాలకు ఎన్ని మాటల తూటాల గాయాలో తెలుసా
ఇంకా నెత్తురోడుతూనే ఉన్నాయి…
తప్పొప్పుల మధ్య ఉరికంబం అంచున సన్నని తాడుకు వేలాడుతూ ఉన్నాయి…
చప్పుడు చేయని సాక్ష్యాలతో దోషిగా చేసి విధించిన శిక్కలెన్నో మాకు…
అయినా నాతోటి కలాలకు ఇంకా అంత్యక్రియలు పూర్తవనేలేదు… నేను ఇప్పుడు రాలేను…
పచ్చి నిజం చెప్పనా…
తీవ్రవాదం పురుడుపోసుకున్న చోటనే
తిరుగుబాటు కూడా పుడుతుంది…
దెబ్బతిన్న చోటనే అంకుశం పంజా విసురుతుంది…
శరణం ఎప్పుడూ మరణమే
యుద్దం ఇప్పుడు అనివార్యం
గాయాల దేహాలే గేయాలు రాయాలి
తెగించి నిలబడి చరిత్రగా మారాలి…
సరేలే ఏడవకండి
నేను కొన్ని రహస్యక్షరాలను రాసి పంపిస్తున్నాను
సందేశాన్ని చదివి మీ చిత్రాన్ని సరిదిద్దుకోండి
తెగిపడ్డ చోటులోనే తెగించి పోరాడండి…
ఈ సారి ఎదురపడే చిత్రం
వినీలాకాశంలో కెంజాయ వర్ణంలో విప్లవకేతనమై
రెపరెపలాడాలి
మరెందరికో స్ఫూర్తి అందించాలి…
కవిత సాగిన పంథా చక్కగా ఉంది. స్పూర్తి గీతమే….
మీలో ఉన్న భావాన్ని అంచనా వేయడం సాధ్యం కాని పని.ఇది కవిత కాదు లావా భావాల లావా ఉప్పొంగి మా మీద పడి మమ్మల్ని శిలలు గా మార్చేసింది
బాగుంది.abhinamdanalu
చాలా బావుందమ్మా … కొన్ని భావనలు గొప్పగా ఉన్నాయి . నడక చాలా బావుంది ..అభినందనలు తల్లీ
అభినందనలు మేడమ్.. మీ కవిత అద్భుతం..మీ కవిలన్నీ చదివాను ….చాలా బాగుంటాయి
మీ భావనలు బలంగా కనిపిస్తాయి, గాయాల దేహలే గేయాలు రాయాలి.. తెగించి నిలబడి చరిత్రగా మారాలి… స్పూర్తివంతంగ ఉంది కవిత.. మీకు అభినందనలు మేడమ్