ఎవరికి రక్షణ వున్నదీ
ఈ కీచక పాలనలో…
ఎవరికి ఆలన వున్నదీ
ఈ వంచక రాజ్యం లో…
మానాల్ దోయుడు
మామూల్ ఇక్కడ..
పానాల్ దీయుడు
ఓ ఫ్యాషన్ యీడా..
చుట్టాలయ్యి చట్టాలెల్ల
చెట్టా పట్టాలేసుకు తిర్గి
హంతకులంతా ఒకటైరే
ముఠాలుగట్టి గద్దెలెక్కిరే
||ఎవరికి||
కళ్ళక్కమ్మి కామంపొరలు
కుమ్ములాటలకు కాల్దువ్వి
మన్వోతుల మించినదొమ్మై
ఇజ్జత్నీడ బరిబాతల జేసిరి
ఆలికి అమ్మకు ఫరకే మరచి
బాలల బామ్మల సోయే ఇడ్సి
చిత్తకార్తి కుక్కలుగ చెలరేగిరే
సావు కాలమిగ దాపురించెనే
||ఎవరికి||
రైళ్లళ్ళై నా బస్సుల్లయినా
బడులల్లయిన గుడుల్లైనా
శిశువైనా డాక్టర్టీచర్లెవ రైనా
నోళ్లు తెరిచెనే బలి పీఠాల్
హెల్ప్ హెల్పంటూ కేకలొద్దిక
శరీరమంతా ఈటెలుఅయ్యీ
ఘడియఘడియ రెప్పవాల్చక
యుద్ధ భూమిగా తీర్చి దిద్దుకో
||ఎవరికి||
చెదరకు చెల్లీ కుంగకు తల్లీ
డేంజరు నెరిగి నిప్పై రేగి క
సూపులు కత్తులు జెయ్యాలే
ఇగ బరిసెల్ బాకులు ఎత్తాలే
విముక్తిదారుల్ ఎదురుగున్నవి
బెదురునిడిసి వెదురువనానివై
నిటారు గెదుగూ నింగే హద్దులే
ఖానూన్ భ్రమల ఖననం గాకూ
||ఎవరికి||
జనతనపోరై గుప్పున లేస్తెనే
పట్టిన జలగలు పరారు ఐతై
నక్కల గాసే దొంగల సర్కార్
మక్కెలు ఇరిగి నీలిగి సస్తది