అది కోర్టు పరిభాష కాదు
నాగా జాతి కాలం నుండి
నరాలను తెంచే హింసాత్మకమైన భాష
బాధితుల నాలుక మీద
త్రిశూలాలను గుచ్చిన
జంధ్యప్పోగుల భాష
చెమట చుక్కల నలుపుదేహంలో
గంజినీరు పారే కాలువలపై
కొరడాలతో దాడిచేసే క్రూరమైన భాష
అది రాజ్యాంగ భాష కాదు
ఆదివాసీ ప్రాంతాలలో
మారణహోమానికి పనికొచ్చే కార్పోరేట్ భాష.