టిమోతి లీయు
అనువాదం : గీతాంజలి
చూడు ప్రియా! మనం కలిసి అద్భుతంగా, ఎంతో ఇష్టంగా అలంకరించుకున్న మంచం ఎన్ని రోజులు అలా నిరర్థకంగా ఉండిపోవాలి?
నన్ను అక్కడే ఆపి ఉంచుతావా ఇక ఎప్పటికీ?
***
ఇంకా నీ గరుకు గడ్డం మీది చర్మం నన్ను అలా తడుముతున్నట్టే ఉంది
సాయంత్రం నుంచి, తెల్లారే దాకా చెల్లాచెదరైన మేఘాలలోని నీటి అణువులు, నేను గడ్డం గీసుకునే వేళ, షేవింగ్ నురగ ద్వీపాల్లా
మెల్లమెల్లగా కింది వైపున్న కాలువలో ప్రవహిస్తూ ఉన్నాయి.
నీ మెడవెనక ముద్దు పెట్టుకునే వేళ, ఎక్కడ నుండో మరి,
నీళ్ల మీద గులాబీ రంగు రక్తపు నీటిచుక్కలు పడుతూ ఉన్నాయి.
చూడు! మన ఇద్దరి ముఖాలు మందుల కేబినెట్ లోపలి అద్దంలో ఫ్రేమ్ కట్టినట్లు వొదిగి ఉన్నాయి.
***
శీతాకాలపు వణికించే చలిలో, బ్లేడు లాంటి
నీ చెయ్యి మసక బారిన ఆవిరిలోంచి
ఒక చిన్న ద్వారాన్ని తయారు చేస్తుంది.
అప్పుడు మనిద్దరమూ విరిగిన సీసపు ముక్కల వెనకాల నుంచి ఎలా కనిపిస్తామంటే,
సరిగ్గా వెళ్ళిపోతున్న కారుకి కడసారి చేతులు ఊపుతూ వీడ్కోలు చెప్పే
ఇద్దరు అబ్బాయిల్లాగా అన్నమాట!
***
అయితే ఇదంతా
ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నా కూడా, ఇప్పటిదాకా ఎవరూ పట్టించుకోని విషయంగా, ఎవరి దృష్టికి రాని విషయంగా ఉండిపోయింది. ***
సింక్ నిండా ఖాళీ కాఫీ కప్పులు కుప్పపడి ఉన్నాయి.
పక్కింటి పిల్లలు శరత్ ఋతువులో రాలిన ఎండుటాకుల కుప్పల్లో మెడ దాకా మునిగి ఆనందంగా, కేరింతలతో ఆడుకుంటున్నారు.
వంటింటి క్యాలెండర్ మీద అచ్చై ఉన్న నెలలు, అచ్చం గడ్డకట్టి, కుప్పలుగా పడి ఉన్న ఈగల్లాగా మెల్లిగా తరిగి పోతూ ఉన్నాయి!
కమ్ముకుంటున్న ఫ్లూ జ్వరం నెల ఆఖరిలో ఉంది!
దీని తర్వాత మాంత్రిక గుర్తులు నిండిన ఒక రైలు మనం విడివిడిగా గడిపిన రాత్రుళ్లలోకి మెల్లిగా చొచ్చుకు వచ్చేస్త