శాంటా.. యుద్ధ వాహనంలో రా

మూలం :  మోమిత ఆలం

శాంటా.. వాళ్లను క్షమించు

నీవు రాకముందే
వాళ్ళు చచ్చిపోయారు
ఇక గంటలు కొట్టకు
వీలైతే
నీ బ్యాగులో ఓ ప్రకటన వేసుకురా
యుద్ధ విరమణ తీసుకురా
శవాలు కూడా వినగలవు

ఇప్పుడు
స్లెడ్జి బండి కింద
వాపసెలా పోగలవు
అసలు దారి పొడుగునా
పుర్రెలు ,శిథిలాలే కదా

అయ్యో.. మొండాలు ఏవని అడగకు
అవయవాల గుట్టల మధ్యన
మొండాలు ఎక్కడని వెతుకుతాము
ఈ దారుణ మారణకాండలో
కొందరు తల్లులైతే
బిడ్డల పేర్లు రాయడమే
మర్చిపోయారు సుమా .

శాంటా.. శాంటా.. వాళ్ళని క్షమించు
వాళ్లు అతిపిన్న వయసులోనే చచ్చిపోయారు
వాళ్ల సాక్సులన్నీ
సమాధి లోనే పూడ్చేశారు

మీ నేరాలకు మెమెంటోలు
స్మశానంలోనే దొరుకుతాయి

ఇప్పుడిక
స్లెడ్జ్ బండి మీద రావద్దు సుమా.
బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి
యుద్ధ వాహనంలో రా

మమ్మల్ని క్షమించు
ప్రపంచమిప్పుడొక యుద్ధభూమి.

జననం: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల. విశ్రాంత ఆంగ్లోపన్యాసకుడు. కవితా సంకలనాలు: పాట సంద్రమై(2008), కాలిబాట(2014), నదిలాంటి మనిషి(2018). కథా సంకలనాలు: అమ్మను చూడాలె(2006), ఆఖరి కుందేలు(2011), దోసెడు పల్లీలు(2017). నాటకం: నేను గౌరీ(2017).

Leave a Reply