మే డే

బంధనలో బతుకలేక
పిడికిలి వేసిన దెబ్బకు
తగిలించిన తాళాలకు పగుళ్ళు
పఠేలుమని పగిలిపోతున్న కటకటాలు
కళ్ళొత్తుకునే కాలం తీరి
కళ్ల వెంట నెత్తుర్లు కారినప్పుడు
కసిగా ముడిబడ్డది ఫాలం
పిడి కత్తులకై పరువెత్తినవి చేతులు
గుండెలపై సమ్మెట పోటులు పడితే
రాలిపడ్డ నెత్తురు చుక్కలు
విరిగిపడ్డ హృదయపు చెక్కలు
విన్పిస్తూ విహరిస్తున్నవి
కథనంలో కత్తుల మ్రోతలు
బ్రతుకు పైన విశ్వాసంతో కూలి దండు దండయాత్ర
న్యాయంపై నెత్తుటి మరకలు
తెగిపారిన నెత్తురులో యెగరేసిన యెఱ్ఱజెండ.
———-

(సృజన – మే, 1970)

Leave a Reply