మేడే

మొదలైన పారిశ్రామికీకరణ
వెట్టికి ఊతమిచ్చింది
ఏలిక వత్తాసు పలికింది

గొంతులు పెగిలాయి
ప్రశ్నలు మొదలయ్యాయి
సంఘటిత శక్తి కి అంకురార్పణ

హే మార్కెట్లో చిందిన రక్తం
ప్రపంచ వ్యాప్తంగా పిడికిళ్లను బిగింపచేసాయి
ఎనిమిది గంటల పని కి ఆ రక్తం తొలి అడుగు

కార్మిక చట్టాల ఏర్పాటు
మనిషి శ్రమకు వెసులుబాటు
కాలగమనంలో మళ్ళీ ఫాసిజం బుసలు
అటకెక్కిన చట్టాలు
నూతనంగా నాలుగు లేబర్ కోడ్ ల కూత

కొలువు భద్రత లేదు
ఆరోగ్యం జాడ లేదు
పనిగంటలు పెట్టుబడి చేతుల్లో
దోపిడీ కి అలవాటుపడిన పైసా
డెబ్భై గంటల పని వారం మత్తు సూదిలా ఎక్కిస్తుంది!

మానసిక వికాసం లేదు
పాజిటివ్ ఆటిట్యూడ్ పేరిట భావావేశాల ఖైదు
ప్రశ్న గొంతు నులిమి రాజ్యం పీఠం పై వికటాట్టహాసం!

మతం ను మెదల్లోకి జొప్పించి
మనిషి శ్రమ ను దోస్తున్న పెట్టుబడి పై
మరో సమరం ఆవశ్యకత నేడు
ట్రేడ్ యూనియన్ ల గళాలు ప్రజల తోడ్పాటు వుంటేనే బలంగా!
మేడే వర్ధిల్లాలి!!

పుట్టింది సూర్యాపేట. పెరిగింది నాగార్జున సాగర్. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్. విద్యార్థి దశలో ఎస్. ఎఫ్. ఐ. లో పని చేశారు. సామాజిక ఆర్థిక సమస్యలను కవితా వస్తువులు గా తీసుకుని  కవిత్వం రాస్తున్నారు.  వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

One thought on “మేడే

Leave a Reply