కార్పొరెట్ పెట్టుబడి కరెన్సీ కోసం
స్వదేశీ జాగరణ్ మంచమెక్కింది
ఎన్నికలొస్తే తప్పా మేల్కొనని కపటనిద్ర
బార్లా తెరచిన Make in India తలుపులు
ఆదివాసీ నెత్తురులో తడిసిన ఖనిజ సంపదను
సరిహద్దులు దాటిస్తున్న దేశీ దళారీ
మన కంట్లో మన వేళ్లకు ఇనప గోళ్లెక్కించి తపొడుస్తున్న గండబేరుండం
విశ్వాసం కోల్పోయిన పార్లమెంట్ ఓట్ల పెట్టలు
ఆదానీ, జిందాల్ గల్ల పెట్టెలో పొదిగాయి
భూమి శిరస్సుపై వేలాడుతున్న గ్లోబల్ కత్తి
విస్తరిస్తున్న మార్కెట్ వామనుడు
నెత్తురు చెమటగా మార్చుకొంటూ
కాళ్లకింద భూమి కోసం విల్లంబులయి
యుద్ధ వీరులుగా నిలుస్తున్న వాళ్లకు
ఓ రెండక్షరాల బాణాలు చేసి ఇద్దాం
డాలర్ పరాధీన మార్కెట్ తిరస్కరించి
కొత్త మానవీయ అభివృద్ధి నమూనాకు
బీడు నేలల్లో విత్తనాలు సాలువోద్దం
భూమి శిరస్సు పై వేలాడుతున్న గ్లోబల్ కత్తి
Maa Satyam
Bellary
కొలిమి లో
(16- 8- 2020)
కవి మిత్రులు కుమారస్వామి కోడం రాసిన ‘ మేక్ ఇన్ ఇండియా’ చదివా.
ఈ సందర్భంలో కవిత్వం పట్ల డాక్టర్ సినారె అన్న వాక్యాలు స్పురణకు వస్తున్నాయి.
” కవిత్వం అసలు విషయాన్ని దాస్తుంది. విమర్శ దాన్ని వివరించి చెబుతుంది.”
నిజమే!
ఈ యువ కవి కుమార స్వామి గారు
ప్రగతిశీల మైన తాత్విక చింతనతో ప్రపంచ పెట్టుబడి దారులకు, స్వదేశీ పెట్టుబడిదారులకు దళారీ అయినా హిందుత్వ తీవ్రవాద నేత ప్రస్తుత భారత దేశ చివరి ప్రధానిగా ఉంటున్న నరేంద్రమోడీ గారి నినాదం అయినా
‘మేక్ ఇన్ ఇండియా’ మూల అర్థాన్ని తార్కికంగా నిశితంగా పరిశీలించి,
‘లుట్ మార్’ కార్పొరేట్ దోపిడిని స్వభావాన్ని ప్రతీకాత్మకంగా కవితా ఇతివృత్తంగా స్వీకరించి తన అనుభూతులను సృజనాత్మకతను జోడించి తనదైన శైలితో ఇలా అంటున్నారు.
” నెత్తురు చెమటగా మార్చుకుంటూ కాళ్ళ కింద భూమి కోసం
విల్లంబులయి యుద్ధ వీరులుగా నిలుస్తున్న వాళ్లకు ఓ రెండక్షరాల బాణాలు చేసి ఇద్దాం”. పద ప్రయోగం, కవితా వస్తువు లోని నిర్మాణ స్వరూపం తో కూడిన వర్ణన.
స్వదేశంలో ఉన్న అటవీ సంపద నాటి బ్రిటిష్ పాలన నుండి నేటి ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రధాని మోడీ నుండి తరలిపోతున్న సహజ సంపద పట్ల మండి పడుతూ సరళ గంభీరమైన స్వరముతో
ఇలా అంటున్నాడు.
” భూమి శిరస్సుపై వేలాడుతున్న
గ్లోబల్ కత్తి విస్తరిస్తున్న మార్కెట్ వామనుడు” తన ఆవేదనను ఆక్రోశాన్ని తెలియజేశాడు.
చివరగా ముగింపులో ఎంతో ఆశావాదంతో
” కొత్త మానవీయ అభివృద్ధి నమూనాకు బీడు నేలల్లో విత్తనాలు సాలు వోద్దాం”అద్భుతమైన పదప్రయోగం.
వర్గ రహిత సమసమాజ స్థాపనకు రాజీలేని పోరాటమే మార్గమని అంతర్లీనంగా తెలియజేస్తూ నవ తరాన్ని పోరాటంలోకి ఆహ్వానిస్తున్నారు.
ఈ సందర్భంలో వారికి ఉద్యమాభి వందనాలు తెలియజేస్తున్నాం.
My mobile
6281150682
మీ విశ్లేషణ కు ధన్యవాదాలు సర్….
Thank you sir
వాస్తవ పరిస్థితిని ముందుంచినారు అన్న……👏👏👏🍁🌹🌺