మూడు మానసికతలు

మూడు మానసికతలు
పాలస్తీనా అజ్ఞాత కవి
ఇంగ్లిష్‌ : అసర్‌ జైదీ

పాలస్తీనా
మా స్నేహితుల నుంచి
మా స్నేహితుల వంటి వాసన రాదు
వాళ్ల నుంచి ఆసుపత్రి వాసన వస్తుంది
మా ఆసుపత్రుల నుంచి
మా ఆసుపత్రుల వాసన రాదు
వాటినుంచి శ్మశానాల వాసన వస్తుంది
మా శ్మశానాల నుంచి
మా శ్మశానాల వాసన రాదు
వాటినుంచి మా స్నేహితుల నుంచి వచ్చే వాసన వస్తుంది

*

నిషిద్ధ గాజా
-సలీమా

ఈ ఎన్నికల దీపావళి వేళ
హైదరాబాదులో ఒక మూల
యుఇఎఫ్‌ఎల్‌ అధికారపీఠం కింద
చీకట్లో పదిమంది సాహసించి మాట్లాడినందుకు
నేరస్తులయ్యారు
పాలస్తీనా గురించి గనుక దేశద్రోహులయ్యారు
అందులో ఒక యువతి ముస్లిం అయినందుకు
ఫండమెంటలిస్టు అయింది
వెరసి అందరూ టెర్రరిస్టులయ్యారు
ఈ దేశంలో ఏ దేశప్రజల
పోరాటాలతో గొంతు కలిపినా అది
రాజద్రోహమే అవుతుంది

*

మానవతా విరామం
-మౌమితా ఆలం

1… 2…. 3
దేహం ఛిద్రమైన నీ కొడుకు
కాళ్లు చేతులు శుభ్రం చెయ్‌
నీ భర్త ముక్కలైన
శిరసు భాగాలను ఏరుకో
రా తొందరగా
నీకు అరగంట మాత్రమే ఉంది

3…. 2…. 1
అయిపోయింది
పరుగెత్తు… పరుగెత్తు….. పరుగెత్తు
దుఖించడానికి సమయం లేదు

పరుగెత్తు….
మేం నీకు అరగంట సమయం ఇచ్చాం
మేం చెడ్డ
మానవతావాదులం

*

(తెలుగు : ఫెలో ట్రావెలర్‌
11.11.23)

2 thoughts on “మూడు మానసికతలు

  1. ఫెలో ట్రావెలర్ గారికి నమస్సులు

Leave a Reply