కాళ్ళ కింది నేల
మరు భూమిని తలపించడం లేదు
సూర్యుడు కూడా ఇటు రావడానికి తటపటాయిస్తున్నాడు
భూమి కాళ్ళు తడబడుతున్నాయి
వైరి వర్గాల మధ్య భూమి.
ఈ దురాఘాతాల నడుమ
శిశువు జన్మి౦చడానికి
భయ పడి
నిన్ను అసహ్యించుకొని
జన్మించడానికి తిరస్కరిస్తే?
భయ కంపితమైన నీ చర్యలతో
తల్లి శరీరం కుచించుకొని పోవడాన్ని
గర్భస్థ శిశువుగా గమనించే వుంటాడు
వికృత నీ రూపాన్ని పోలి
భూమి పైకి రావడానికి వాయిదా కోరుతున్నాడు
మరో రూపాన్ని కల గంటున్నాడు
చీడపీడల్ని దరి చేరనివ్వని
క్రిమి సంహారక మందులను త్యజిస్తూ
మరో ప్రకృతిని
మరో భూమిని స్వప్నిస్తున్నాడు.
నువ్వు గత చరిత్రలతో బ్రష్టు పట్టించ లేని
సృష్టిని కల కంటున్నాడు
నీ ఇతిహాసాలు మళ్ళీ ప్రాణం పోసుకోలేవు !
నిన్నటి రోజు లేని
రేపటి ఈస్థటిక్స్ ఆశావహ జీవనమే నిలుస్తుంది.
రండి, మనం ఎట్లాగో ఇక్కడి నుండి నిషక్రమిస్తాం !
ఆలోగా ఈ నేలను
భవిషత్ తరాల కోసం
రంగు,రంగుల పూల వనాలను నాటుదాం !
Sensible poem.
Thanks
కవిత బాగుంది.
ThankQ