నాకు మమ్మీ అండ్ డాడీలో ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటే ఇద్దరు సమానంగా ఇష్టమే అని చెప్పుతాను. కానీ మమ్మీ కంటే నేను మా డాడీ కంపని ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తాను.
ఒక రోజు డాడీ ఆఫీషు నుండి సాయంత్రం 8 గంటలకి ఇంటికి వచ్చిండు.
డాడీ ఫ్రెష్ ఐన తర్వాత నేను మా అన్న శ్రీరామ్ మరియు డాడీ డిన్నర్ కి రెడీ అయినాము. మమ్మీ తర్వాత తింటాను అన్నది.
నేను డైనింగ్ టేబులుపై వాటర్, ప్లేట్స్ ని పెడుతుంటే శ్రీరామ్ రైస్ పెడుతున్నాడు ప్లేట్స్ లో. ఆ రోజు మమ్మీ ఎగ్ పులుసు కూర వండింది.
డాడీ కర్రీ వేస్తున్నాడు.
తన ప్లేటులో. కూడా ఒక ఎగ్ ని వేసుకోబోతుంటే – శ్రీరామ్ వెంటనే “ఓ డాడీ ! ఆ ఎగ్ వేసుకోకు. అది మమ్మీ ఎగ్. నువ్వు వేరే వేసుకో” అన్నాడు.
“మమ్మీ ఎగ్ ఆ?” సర్ప్ర్సైజ్ గా నేను వెంటనే అటు వైపు చూసాను.
“హా… అది మమ్మీ ఎగ్ నే” శ్రీరామ్.
అది పూర్తి ఎగ్ కాదు. బాయిల్ చేసేటప్పుడు సరిగ్గా ఉడుకక కొంత పాడై దానిలో కొంచెం భాగం బాయిల్ చేసే వాటర్ లోనే కలిసిపోయి మిగిలిన ఎగ్ అది.
ఇంతలో మమ్మీ వచ్చి – “ఈ మధ్య ఏమవుతుందో తెలుస్తలేదు. ఆ గిన్నె ని మార్చాలో లేకుంటే ఈ ఎండాకాలములో ఎగ్స్ అట్లనే ఉంటాయో తెలుస్తాలేదు కానీ ప్రతి సారి నాలుగు ఎగ్స్ కి ఏదో ఒకటి అట్లనే అవుతుంది. అది నేను తింటాలే. నువ్వు వేరే వేసుకో” అన్నది.
డాడీ ఆ ఎగ్ ని వదిలి ఇంకోటి గంటెలోకి తీసుకుంటున్నాడు.
నేను వెంటనే “ఓ డాడీ ! ఆపు. అదే వేసుకో నువ్వు. మమ్మీ నే ఎందుకు వేసుకోవాలి ? ఆ పాడైన ఎగ్ పైన ఏమైనా మమ్మి పేరు రాసి పెట్టి ఉందా ? నువ్వు అదే వేసుకో” పట్టుపట్టినట్లుగానే అన్నాను
“హే ! డాడీ మంచిది వేసుకొనివ్వు. నేను వేసుకుంటా దానిని.” మమ్మీ, మళ్ళీ డాడీ ని మంచి ఎగ్ నే వేసుకునేలా మాట్లాడింది.
దానితో నేను ఏం చేయాలో అర్థం కాక – డాడీ రిస్ట్ దగ్గర చేతిని పట్టుకొని ఆపి
“ఐతే ఈ సారి ఆ పాడైన ఎగ్ ని నేను వేసుకుంటాను” అని డాడీ చేతిలోని గంటె ని తిప్పుకొని నా ప్లేటులో వేసుకున్నాను.
అందరం భోజనం చేసినము.
రెగ్యులర్ కంటే కొంత గంభీరంగా గడిసింది ఆ పూట మా డిన్నర్ టైం.
రెగ్యులర్ గా డిన్నర్ అయినాక ఇంటి బయటకు వచ్చి కొద్ది సేపు నడిచే మేము ఆ పూట కూడా నడిచాము.
కానీ ఎవరికి వారిమే. ఏదో తెలియని డిస్కంఫర్ట్ మా మధ్య. వాకింగ్ కంప్లీట్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోయినాము.
*
ఆ తర్వాత మమ్మీ ఎగ్ పులుసు చేసినపుడు ఏదో ఒక ఎగ్ పాడైనా ప్రతిసారి నా చొరవతో –
రెండో సారి మా శ్రీరామ్ , మూడో సారి డాడీ మరియు నాలుగో సారి మమ్మీ ఆ పాడైన రాటెన్ ఎగ్ ని వేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా అనేక తమాషాలు , ఫన్నీ థింగ్స్ జరిగాయి.
లాస్ట్ టైమ్ మమ్మీ వేసుకున్న రోజు డిన్నర్ అయినంకా డైనింగ్ టేబుల్ పైనే కూర్చుండి నేను నవ్వుతూ మాట్లాడాను.
అందరూ కూడా నా స్పీచ్ కోసం ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు.
“సో… ఈ రోజుతో ఏదైనా ఎగ్ పాడైనా ఇంకేది పాడైనా ఎవరు వీలైతే వాళ్ళు లేదా అందరము ఈక్వల్ గా తీసుకోవాలి తప్ప మమ్మీ’స్ ఎగ్ అంటూ మమ్మీ కోసం సెపరేట్ గా రిజర్వ్ చేసి ఉండవు. ఈ రోజు నుండి మన ఇంట్లో “మమ్మీ’స్ ఎగ్” పేరుని మార్చాలి. అది కేవలం పాడైన ఎగ్ .దట్ ఈజ్ ఏ “రాటెన్ ఎగ్”. అంతే. అలానే పిలువాలి మనం.”
“హేల్ హిట్లర్! సాన్వితా శాక్య భారతి!” నిల్చోని శ్రీరామ్ చప్పట్లు.
“అగ్రీడ్ అగ్రీడ్” మమ్మీ అండ్ డాడీ.
ఆ విషయాన్ని నేను ఒక చిన్న రెజల్యూషన్ గా నేను చదువుతున్న బెన్ హర్ పుస్తకం చివరి నోట్స్ పేజీలో రాసి అందరి సంతకాలు తీసుకున్నాను.
*
రెగ్యులర్ గా డిన్నర్ అయినాక ఇంటి బయటకు వచ్చి కొద్ది సేపు నడిచే మేము ఆ పూట కూడా నడిచాము.
నేను మా డాడీ చేతులు పట్టుకొని నడుస్తున్నాను. శ్రీరామ్ మమ్మీ భుజాలపై చేతులు వేసి నడుస్తున్నాడు.
మా అందరిలో ఏదో సాధించినా సంపాదించిన హాప్పి ఫీలింగ్ ఉంది. మాకు మేమే మరింత క్లోజ్ గా కొత్తగా అన్పించినాము.
మామూలుగా పది నిమిషాలల్లోనే ఇంటి లోపలికి వెళ్లిపోయే మేము ఆ రోజు – వెన్నీల వెలుతురులో కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ దగ్గరి ఇసుక కుప్పలో కూర్చుండి కనీసం రెండు గంటల పైగా చాలా విషయాలు మాట్లాడుకుంటూనే ఉన్నాము.
పారిజాతం పూల వాసన కమ్మగా వస్తుంది. మధ్య మధ్యలో నేను ఆ చెట్టు దగ్గరగా వెళ్ళి వాసన పీల్చుకొని బ్యాక్ వస్తున్నాను.
తన బాడీ అంత నింపుకున్న పసుపు పూల చెట్టు ఒక్కో పూవుని రాల్చుతూ ఉన్నప్పటికీ దాని బ్యూటీ ఏ మాత్రం తగ్గట్లేదు.
బాదం చెట్ల ఆకుల సందు నుండి మాకు చందమామ కనిపిస్తూ దాక్కుంటున్నాడు ఆ నీడలని మాపై పడవేస్తూ.
తోట రాజయ్య తాత పొలం చుట్టూ ఉన్న టేకు చెట్ల ఆకుల సప్పుడు మంచి వెస్ట్రన్ మ్యూజిక్ లా వినవస్తుంది.
వాళ్ళు మాట్లాడుతుండగానే నేను లేచి కొంచెము దూరంగా వచ్చి ఖాళీగా విశాలంగా ఉన్న మా రోడ్ మధ్యలో నిల్చున్నాను.
నా రెండు చేతులు చాపి ఆకాశం వైపు చూస్తే ఎక్షీడింగ్ ప్లెజర్.
“అంత పెద్ద నేవీ బ్లూ కాన్వాస్ పై ఎన్ని బొమ్మలు గీసుకోవచ్చునో!” అని పట్టరాని ఆశ్చర్యం, ఆనందం, బిగ్ హోప్ నా మనసు నిండా.
Wow
Amazing feeling while I am reading it
She wrote it as a professional author
మమ్మీ’స్ ఎగ్ ను రాటెన్ ఎగ్ గా మార్చిన నీ మనస్సు కాన్వాస్ పెద్ద బ్లూ కాన్వాస్ కన్న ఎంతో పెద్దది…
చిన్నా వయసులో చాలా పెద్దగా ఆలోచన చేశావ్ శాన్వీ, ప్రతి ఇంట్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే వుంటాయి… అందరూ శాన్వీ నీ స్ఫూర్తిగా తీసుకోవాలి.
చాలా బావుంది….