మనుషుల్లారా ఇది వినండి…

మా దగ్గర …!
మీ పురుషాంగాల బలుపును
చల్లార్చే జననాంగం
అంటే!
మీ జన్మస్థానం మీ కోసమే
పవిత్రంగా మీరు కోరుకుంటున్నట్టు రహస్యంగానే
మీ సనాతనా ధర్మంలో దాచేవుంచుతున్నాం

మీ రాక్షస రాసక్రీడ గెలవడానికి
మానం ఉండి, ఆడదైతే అదే మైదానం కదూ!

మడి,గిడి ఇంట్లోనే
ఒంట్లో వేడికి ఏ ఆటంకాలుండవుగా
ఏదో బయటివాళ్ళను నమ్మించడానికేగానీ
కులం మతం జాతి ఇవన్నీ మీకెందుకు !!?
ఎవడి తల్లో అయితే ఏంటీ
ఎవడి కూతురో చెల్లో అయితే మాత్రం మీకేటంటా !!?
ఆడుకోండి !
ఎవరికిష్టం వచ్చిన ఆట వాళ్ళు ఆడుకోండీ

ఆట పూర్తయ్యాక
ఒక్క విషయం మరచిపోకండి
గట్టిగా దేశమంతా పిక్కటిల్లేలా
ఏక్ ఆవాజ్ జరా జోర్ సే దో…

భారత్ మాతా కీ జై …

ముచర్ల గ్రామం, ఖమ్మం జిల్లా. 2014 నుంచి కవిత్వం రాస్తున్నారు. 'ఇప్పుడేది రహస్యం కాదు' కవితా సంపుటి ప్రచురించారు. 2019 విమల శాంతి పురస్కారం, 2019 ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం అందుకున్నారు.

Leave a Reply