బైరాగి తాత్త్విక స్వరం ‘నూతిలో గొంతుకలు’

తెలుగు సాహిత్య చరిత్రలో 1925కి ఒక తెలియని ప్రత్యేకత వుంది. అది ఏమిటంటే, ఆ సంవత్సరం లోనే తెలుగు సాహిత్యానికి మార్గదర్శకులుగా ముగ్గురు అభ్యుదయమూర్తులు ప్రభవించారు. వారు ` దాశరధీ క్రిష్ణమాచార్య, ఆరుద్ర, ఆలూరి భైరాగి, ఈ ముగ్గురు సామ్యావాదాన్ని ఊపిరిగా చేసుకుని తమ రచనలతో జన చైతన్య స్వరంగా నిలిచారు.

మానవ మనసు జీవితం అనే ఆటలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనం చేసే ప్రతి నిర్ణయం, అనుభవించే ప్రతి భావన మనసు ద్వారా ప్రభావితం అవుతుంది. నిజానికి, మనం అనుకుంటున్నాం మనం స్వేచ్ఛగా ఉన్నామన్నది, కానీ అసలు, మనం మన మనసు కట్టుబడినవారే. మనం మనసు లోయలో లేదా ఒక వలయంలోనే  ఉన్నట్లే, అది మన ఆలోచనలు, అభిరుచులు, ఆశయాలను నేరుగా ప్రభావితం చేస్తుంది. మనసు మన ప్రవర్తన, ఆలోచనలు, కష్టాలను నియంత్రిస్తుందిబీ అందువల్ల మనిషి జీవితంలో సత్యానికి చేరుకోవడానికి ముందు, తన మనసును గుర్తించి, దానిని అర్థముగా వినియోగించడం అత్యంత అవసరం.

వీరిలో ఆలూరి భైరాగిది ఒక ప్రత్యేక మార్గం. వీరి పై ఎమ్‌.ఎన్‌. రాయ్‌ ప్రభావం అధీకంగా వుంది. మొదట్లో వీరు మొదట్లో అస్తిత్వవాదానికి మొగ్గు చూపించినా ఆ తర్వాత సామ్యవాద భావాలతో తన రచనలను కొనసాగించారు. వీరి రచనలలో తాత్వికత భావన అధీకంగా మనకు కనిపిస్తుంది. ప్రతి రచనలోనూ మనిషి చుట్టూ ఉన్న అలజడుల జాడలను ఆవిష్కరించారు. అందులో భాగంగా ‘‘నూతిలో గొంతుకలు’’ కవితా గ్రంధం ఒక ప్రత్యేకత మనిషి బతుకు సిలబస్‌గా మనిషి అంతరంగ మధనాన్ని చూడటం జరుగుతుంది. ఈ నూతిలో గొంతుకలు ‘‘నూయ్యి’’ ‘‘గొంతుక’’ అనే రెండూ ప్రతీకల నడుమ ఆవిర్భవించిన ఒక సంశయ కావ్యం. ఇందులో మనిషి సంక్షోభం మాత్రమే కాదు సామాజీక, రాజకీయ, అర్ధిక అవసరాల మధ్య సతమతమౌతున్న జన స్రవంతి నీలి నీడలను తన కవిత్వం మూల సూత్రంగా తెలియజేసారు. అలాగే మనిషి జీవితంలో శూన్యతకు పలు కారాణాలు ఉన్న విధంగానే నూతిలో నీళ్లు లేకపోవడానికి అణగారిన, బతుకు దిగజారిన, అసహాయతతో అలమటించే అభాగ్యుల ఆర్తనాధాలకు ఆ భావి సంకేతంగా నిలుస్తుంది.

ఇక్కడ సమాజ జీవిన వేదననూ మన కళ్ల ముందు ఈ దీర్ఘ కవిత ద్వారా మనకు అవగతమౌతుంది. మనిషి జీవితంలోని అంతర్గతంగా దాగిన సమస్యలకు తనకు తానే దగ్థమౌతాడు. తప్ప ఇతరల ముందు తన సమస్య విప్పి చెప్పుకోలేడు. ఒక సంశయం. మనసులో ఎండిన కన్నీటి చారిక. అదే విధంగా నూతిలో పడ్డవారి కేకలు ఎవరికీ వినిపించవూ, కనిపించవూ… అలాగే తనకూ తానుగా బయటపడటానికి ఎలాంటి ఆసరా కనిపంచదు. భైరాగి దృష్టి‘‘ సామాజిక నిర్భంధాల నడుమ కొట్టుమిట్టడుతున్న సామాన్యుడి జీవితాన్ని రాజకీయ ఖైదీలతో సరిపోల్చడం ఒక విశేషమైన పోలికగా మనకు కనిపిస్తుంది.

ఈ ‘నూతిలో గొంతుకలు’ నీడలు నేటికి వర్తమాన సమాజంలో ప్రతిబింబిస్తాయి. దాని కోణం పలు రూపాలలో కనిపిస్తుంది. ఇది లోపభూయిష్టమైన వ్యవస్థల వలన కారణం కావచ్చు. మనిషిలో అనేక సామాజీక బలహీనతలు మనిషి మధ్య చోటు చేసుకుంటున్న వ్యత్యాసాలు కూడా ఇందుకో తోడ్పడుతాయి. ‘‘ఈ కావ్యంలో మనకు  మనస్సులోని అంర్ముఖ వేదనలను, మౌనాన్నీ, ముడుచుకున్న భావోద్వేగాల్ని ఒక చీకటి నీడల సముదాయంగా చిత్రిస్తుంది.  ఈ కవిత ద్వారా మనం మానవ మనోవిజ్ఞానానికి చెందిన  గాఢమైన అంశాలను అధ్యయనం చేయవచ్చు ` ముఖ్యంగా ఒంటరితనం, నిరాశ, చీకటి భావాలకు’’ ప్రతీకాత్మంగా మానవ జీవిత దృశ్యం భైరాగి కనిపిస్తుంది.  చీకటిలో కొట్టుమిట్టడుతున్న  సామాన్యుడి దైన్య స్థితి  మానవ జీవితాన్ని ఏ విధంగా కబళిస్తుందో తెలియజేసే విషయాన్ని నిర్థిష్టంగా, స్పష్టంగా తెలియజేసారు.

ఈ కవిత తమస్సుతో ప్రారంభమౌతుంది. చీకటి ముసిరిన మనిషి జీవిత నేపధ్యాన్ని మాత్రమే కాదు. మానసిక జాడ్యాలను, వైరీ భావనలు మనకు భైరగీ కవితలోని అంతర్గతం అర్ధమౌతుంది. మనిషి అన్వేషణ నిరంతరం ఏదో ఒక అవసరంతో ముడిపడివుంటుంది. అందులో వెలుతురు మాత్రమే కాదు చీకటినీడలు దాగి వుంటాయి. ఈ ప్రయత్నంలో అతనినీ ముసురుకొనే నైరాశ్యానికి ప్రతీకలుగా కీచురాళ్లు, దట్టమైన చీకటి మొ॥ వాటిని వస్తువులను ఈ కవితలో చొప్పించడం జరిగింది.

ఈ నూతిలో గొంతుకలు కవిత్వం చదవడం ద్వారా మనలోని మనస్థాత్వాలను,మనిషిలో దాగిన అనేకనేక సమస్యల ప్రతిబింబాలు మన అనుభవంలోకి వస్తాయి. ఇందులో నూటికి నూరు శాతం మనం చేదు అనుభవాలను మాత్రమే రుచి చూడటం జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే స్వానుభావాలు మనిషి మనసును నుండి తొంగిచూస్తాయి.

భైరాగి కవిత్వంలోని వేదాంత ధోరణి, మానసిక వ్యధలు కవిత లోతుల్లోకెళ్లి పరిశీలించినప్పుడూ మనిషిలోని సంఘర్షణ ఎలా మనిషిని కుంగదీస్తుందో మనం చూడటం జరుగుతుంది. ఈ కవిత్వం ద్వారా అనేక ప్రశ్నలు సంధీస్తాడు. ఆ ప్రశ్నల సమాధానం అన్వేషణ కోసం సమాజం గడప ముందు నిలబేడతాడు. ప్రతి వాక్యంలోను హృదమవిధారక శోకం ఉన్నప్పటికి  జీవితసారం నుండి ఉద్భవించిన కవిత అంతరాత్మ, ఇది కవి అంతరాత్మ . ఇది కేవలం వాక్యాల కనికట్టు ఎంతమాత్రం కాదు. ఎంతో అవగాహనతో తెలియజేసిన జీవత సారాంశం. జీవన వేదం. అంతమాత్రాన కేవలం నైరాశ్యంలో మాత్రమే ఉంటాడని ఎంత మాత్రం చెప్పలేము.

ఒక విధంగా చెప్పాలంటే చీకటి నుండి వెలుగులోకి…. వెలుగు నుండి చీకటిలోకి ప్రయాణం ఎంత సహజమో… అదే విధంగా ఇది కేవలం ఒక ప్రాంతానికి, ఒక దృక్పధానికి సంబంధించిన వస్తువు ఎంత మాత్రం కాదు. దీనికి ఎలాంటి ఎల్లలూ లేవు. జ్వలించిన ఆత్మ నుండి వెలువడిన విస్త్రతమైన ఆలోచనల అంతరంగ మధనం. ఇది కేవలం ఒక సమయానికి, సందర్భానికి సంబంధించిన ఆత్మనివేదన కాదు. తరతరాలుగా ఈ ఆత్మఘోషను ప్రతి మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రశ్నలకు ప్రతిరూపం ఈ కావ్యం.

ఒక వైపు మానవ ప్రవృత్తులను సానబడుతూనే మరోవైపు ప్రాకృతిక శక్తుల కరాళనృత్యానికి ప్రతీకలను ఈ కవితలలో ప్రతిబింబిస్తాయి. ఈ జీవిత చదరంగంలో మనిషి అనే పావుకు నిరంతరం పోరాటం తప్పదని. అధకశాతం తాను గొంతు విప్పలేడని తెలిసినా, దేనికోసమో తపించడం జరుగుతుంది.  ఇక్కడ కాలంతో నిమిత్తం లేదు. ఎవరికైనా ఎదురుపడే సమస్యలు రేండూ మాత్రమే. జీవితం ప్రసవవేదనని, మనిషి చివరి ఘట్టంలో ఎదురయ్యే మరణ యాతనని అభివ్యక్తికరిస్తాడు.‘‘ చీకటి ముసిరిన, చిగురించిన ఆశలతో’ కలతలను  అభివర్ణిస్తాడు. ఈ కవితలో ఒక చోట ‘‘ అనంత సాగరంలో విలయం, జంరaం,చిల్లిపడవ, కాళ రాత్రి, జీవిత యాత్ర’’ అన్న భావాన్ని అపర్షి ృత సమస్యాగతమైన మానవ సంక్షోభాన్ని, జీవన సమరాన్ని అభివ్యక్తికరించి, మన హృదయని కలవరపరిచే జీవిత దృశ్యాలు మన కంటికి కనిపిస్తాయి.

ఈ కవితల్లో భైరాగి ‘నిర్జీవ నిరంధం పసగల రుచిలేని విషం అంటాడు’ దీని అంతరార్ధం ఏమటంటే ` ‘మనసు ఏమీ అనుభవించకపోవడాన్ని ఇక్కడ ఒక నిస్తేజతను’ కవి తెలియజేసాడు. మానసిక శాస్త్ర సిద్ధాంతం ప్రకారం ఈ స్థితిని ‘అనహడోనియా’ అంటారు. ఈ పరిస్థితులకి లోనయినవారు ఎలాంటి ఆనందాన్ని ఆస్వాధించలేరు. తమ ప్రపంచంలో తాము దగ్థమౌతుంటారు. ఇది డిప్రేషన్‌కు హేతువుగా గుర్తించవచ్చు. కాలంతోపాటు మనిషి ప్రయాణిస్తాడు కానీ అందులో మునిగి తేలుతుంటాడే తప్ప ఎలాంటి ఆనందాన్ని రుచి చూడలేని విరాగిగా మిగిలిపోతాడు.

బైరాగి ఈ సంగతి గుర్తుపెట్టుకోని ఒక చోట ఇలా అంటాడు ‘‘విరిగిన  వెన్నెముకచందం’ అంటాడు. దీనిలో ఆత్మనిరాకరణ మాత్రమే కనిపిస్తుంది. ఇందులో అభిమానం కానీ, ఆశయం కానీ ఉండవూ. అందువల్ల మనిషి జీవితానికి అర్ధం ఎంత మాత్రం చేకూరదు.  ఒక విధంగా చెప్పాలంటే మనిషి నిస్తేజంగా ఉండిపోవడం వలన ఇది అనుభూతులకు తావులేని జీవితం. ఇందులో మనకు కేవలం ‘ఆత్మవిముఖత’ మాత్రమే కన్పిస్తుంది. అందులోని అంతర్యాన్ని తన కవిత వస్తువుగా భైరాగీ తన కవిత్వంలో ఒక కొత్త వస్తువుగా నూతిలో గొంతుకలను ఆవిష్కరించాడు. మానవ జీవితంలోని వేదనలను, రోదనలకు అక్షర భాష్యం. బుద్ధుడు మనిషి జీవితంలోని వేదనలను ఇల్లు వదిలి వెళ్లాడు ఆనందమార్గం అన్వేషించాలని. భైరాగి మనిషి జీవిత పార్శ్వంలో దాగిన నగ్నసత్యాలకు సమాధానం కోసం ఈ కావ్యం ద్వారా అన్వేషించాడు.

నూతిలోగొంతుకల విలాపం అనుక్షణం ఏదో ఒక దిక్కున వినిపిస్తునే ఉంటుంది. అది కేవలం కవి అంతర్ నేత్రం మాత్రమే గమనించిన జీవిత సత్యం.

Leave a Reply