అంకుల్ శామ్
అవనిని నాశనం చేశావు
అంతరిక్షాన్ని క్షిపణులతో నింపావు
అంతరంగాన్ని గాయపరిచావు
ఆషాఢ భూతిలా
ప్రజాస్వామ్య విలువల నామాలు పెట్టుకున్నావు
సాగరాల్ని ఆయిల్ తెట్టుతో నింపావు
నగరాల్ని శిథిల వనాల్ని చేశావు
ఆకలితో నీటి కరువుతో జనాల్ని చంపావు
నీ లాభ వికృతి విస్తరించి సమరాన్ని మొదలెట్టావు
పర్షియన్ పరాక్రమం ముందు తడబడ్డావు
నేతలు పోతే వ్యవస్థ మారదు
ప్రకృతిని హత్య చేస్తే నీకు క్షమాపణ దొరకదు
దేశాల ఆత్మ గౌరవం హరిస్తే
ఆర్త జన హృది సహించదు
రాజులు నియంతలు కంపెనీలు
స్థావరాలు ఆపలేవు నీ పతనం
నీ పిచ్చి చేష్టలు ఆపకుంటే
చే నిద్ర లేచి వస్తాడు
హోచిమిన్ భూతం నీ భరతం పడుతుంది
ఏ శాంతి ప్రవక్త నిన్ను ఆశీర్వదించడు
దేశాలు నిను ద్వేషిస్తాయి
నీ సంపద మదం, నీ కరెన్సీ పాలన
పంచ భూతాల్లో కలిసిపోతాయి
నీ ‘విశ్వ విజేత’ కామన ఓ పేలిపోయే డ్రీమ్