పురా గాధ

ఎవరికి ఎవరూ ఏమీ కానీ తనం లో
నువ్వు నేను కలిశాము
గడ్డిపరక లాంటి నా మీద
మంచు బిందువులా వాలావు
జీవితపు కొండ వాలు నుండి జారుతున్న నన్ను
దోసిలి తో పట్టి గుండెల్లో పెట్టుకున్నావ్
ఇద్దరు అపరిచితులు
పరిచితులై ప్రయాణం మొదలెట్టాక
సమస్తము మనలోనే
మనమే సమస్తము

భైరాగి పాట విన్నాము
జీవితపు ఆట చూసాము
మేఘం కురవడం
గాలి వీయడం
చెకుముకి మంట
కాసిన పంట
దేహాల వెచ్చదనం
అవును
అప్పటి నుండి
మనం కలిసే ఉన్నాము
చెట్ల వెంట
వెన్నెల తోడు
నీలి ఆకాశం కింద
ఏ ఆచ్చాదన లేకుండా
తిరిగింది మనమే కదా
మన కోసం గాల్లో
ఎగిరిన పూల పడవలు
గాలి మోసుకొచ్చిన పాటలు
లోయల్లో దాగిన రహస్యాలు
శబ్దాలు నిశ్శబ్దాల మోహ కలయిక
పాయలు పాయలుగా అల్లుకున్న మనం
అప్పుడెప్పుడో మొదలై సాగుతున్న గాధ
ప్రకృతి ఉత్సవం
కన్నుతెరిచిన శిశువు
ఇక వలయం
వలయం
శూన్యం వైపు పయనం

పుట్టింది నెల్లూరు జిల్లా, ఓజిలి, రాచపాలెం. కాకినాడలోని పిఠాపురం రాజా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖాధిపతి. 'నీటిపూలవాన', 'గోరువంకల గానం' అనే రెండు పిల్లల కవితా సంకలనాలు వేశారు. ఎక్సరే, తానా, రంజని, కుందుర్తి వంటి పురస్కారాలు పొంది ఉన్నారు. రాధేయ కవితా పురస్కార నిర్వాహకులలో ఒకరు.

18 thoughts on “పురా గాధ

  1. హృదయం అంతరాలలో పుట్టిన కవితా శిశువు సృష్ఠి ఈ కవిత.

  2. మంచి కవిత

  3. శీర్షిక వైవిధ్యం
    అద్భుత సాహిత్యం

  4. మంచి కవిత.. అభినందనలు.. మిత్రమా

  5. చాలా బాగుంది గురువు గారు

  6. నిజ హృదయం తో జీవిత సహచరి కి
    రాసిన కవిత లా ఉంది.
    గోపాల్ నీ కవితల్లో అమ్మ, nanna, అవ్వ, ఇపుడు సహచరి పై గొప్ప కవితలు..
    వీటిని కలిపి ఒకే కుటుంబ బంధం పై పిల్లలకు
    హితం చెప్పొచ్చు

  7. భావుకత, ఆర్థ్రత ల సమ్మిళతం

  8. చాలా అద్భుతమైన కవిత sir
    చాలా బాగా రాశారు
    చాలా చాలా బాగుంది

  9. చాలా బాగా రాసారు సార్ కవిత

  10. చాలా బాగుంది గురువు గారు

  11. సార్… మీ ఈ కవితా శిశువు జననం…… మా రస హృదయాలకు మధురం….

  12. మంచి కవిత .అభినందనలు గోపాల్ గారు

  13. అంతా బాగుంది.. శూన్యం వైపు పయనం.. ఎందుకో నచ్చలా..

Leave a Reply