పిల్లలు లేని ఇల్లు

ఓ గాజా దుష్ట శిశువులారా
నిరంతరం మీరు నా కిటికీ కింద చేరి
తిక్క అరుపులు అరుస్తూ
నన్ను అల్లరిపెట్టేవాళ్ళు
మీరు ప్రతి ఉదయాన్నీ ఒక సందడిగా
గందరగోళంగా మార్చేవాళ్లు
మీరు నా బాల్కనీలో ఉన్న కుండీని పగులగొట్టి
అందులో ఉన్న ఒకేఒక్క పువ్వును దొంగిలించేవాళ్లు

తిరిగి రండి
మీ ఇష్టం వచ్చినట్లు గోలచేయండి
అన్ని పూల కుండీలు పగులగొట్టండి
అన్ని పువ్వులనూ దొంగిలించండి
తిరిగి రండి…

పాలస్తీనియన్ కవి

Leave a Reply