పరేడ్

వాళ్ళను
బట్టలూడదీయండి
ఒళ్ళెరుగని అరుపుల్తో,కేకల్తో
లోకమంతా విస్తుపోయేలా
పరేడ్ లు చేయండి.
పెచ్చరిల్లే విద్వేషాల్తో,
ఒళ్ళు బలిసిన కామంతో
వాళ్ళను బలిదీసుకోండి

ఇదంతా
మాంసం నుండి మాంసంవరకే

యుద్ధమింకా
మిగిలేఉంది

విధ్వంసాల మధ్య
నిశ్చలమైన వెలిగే
వాల్లు ఆత్మలనేమి చేయలేరు.

నిస్సహాయ మహిళలు చుట్టూ
చిత్త కార్తి కుక్కల్లా చెలరేగే
ఏం ఉన్మాదపు గుంపూ
వాల్లు ఆత్మల తాకలేదు

కాంగ్లా కోటముందు
దిగంబరత్వాన్ని
ధిక్కార సూచకంగా నిలబెట్టిన
మహా మాతృ మూర్తులు సైతం
వాల్లు ఆత్మల లొంగదీయలేదు

హింసయన్నది
శరీరంనుంచి శరీరానికే గాని
అజేయమానవుని
అనాదిరూపమైన
ఆత్మదిగాదు

తల్లి తరలి వొచ్చే
అలలనెవ్వరు ఆపలేరు.

ఈరోజు
మీరు సంతోష పడవొచ్చు
మేం దుఃఖం పడవొచ్చు
రేపటి విజయం మాత్రం
మాదే..మాదే..మాదే.

మూలం : జంగ్ సాంగ్,
కుకీ కవయిత్రి

జననం: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల. విశ్రాంత ఆంగ్లోపన్యాసకుడు. కవితా సంకలనాలు: పాట సంద్రమై(2008), కాలిబాట(2014), నదిలాంటి మనిషి(2018). కథా సంకలనాలు: అమ్మను చూడాలె(2006), ఆఖరి కుందేలు(2011), దోసెడు పల్లీలు(2017). నాటకం: నేను గౌరీ(2017).

Leave a Reply