నేల మీద నిలబడే మాట్లాడతాను. బాటల్లో డొంకల్లో చేల గాలి పీలుస్తూ కదులుతాను. అవసరమైన ఆవేశంలోనో ఆశా స్థితి లోనో, కలల్లోనో పైకెగిరినా, ఆకాశంలో చక్కర్లు కొట్టినా తిరిగి నేలనే ఆశ్రయిస్తాను. కాళ్ళు నేలకు తన్ని పెట్టినాకే ఉయ్యాల మీదికి వురుకుతాను. మట్టి మీదే కాదు దేనిమీదా ఒట్టేసే అలవాటు లేదు. మట్టి గుప్పిట్లో ఊపిరి తీయటం ఇష్టం.
ఇదేమీ ఆదర్శం కాదు. ఘన కార్యమూ కాదు. ఇందులో సౌకర్యం ఉంది. It feels like the mother’s lap. It soothes you. పడుకున్నా, కూర్చున్నా, నడిచినా, పరుగెత్తినా నేల అసరాతోనే. నేల ఒంటి మీద చేతులు ఆనించకుండా లేచి నిలబడలేం. నేల చెవిలో చెవి బెట్టకుండా, నేల చేతుల్లో చేయి వేయకుండా, నేల కిటికీల్లో ఈతకొట్టకుండా, నేల నాడి వినకుండా, నేల కళ్ళ పచ్చ దనాన్ని తాగకుండా, నేల గుండె డోలును గ్రీట్ చేయకుండా పొద్దుపోదు.
నేలకు చెముడు లేదు. నేల నోరులేనిది కాదు. నేల కమ్యూనికేట్ చేస్తుంది. నేల దర్శకత్వం వహిస్తుంది. నేల మనమీద స్వారీ చేస్తుంది. శాసిస్తుంది. దీవిస్తుంది. దారి చూపుతుంది. సాగనంపుతుంది. అందుకే నేల మీద ఆన. నేల మీద నిలబడే మాట్లాడతా.
నిజాలకు పర్యాయపదం నేల. నేల మీద నిలబడటమంటే నిజాల మీద నిలబడటమే. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, తాత్విక, సాహిత్య ఆవరణల్లో ఎక్కడ ఏ కసరత్తులు చేసినా ఎన్ని పల్టీలు కొట్టినా నేల మీద నిలబడే. నేల కన్ను ఎక్కు పెట్టిన గన్నులాగే. నేల చూపు సారించిన వాక్యంలాగే. నేల పెదవులు తడిపే పదం లాగే.
Superb
నేల మీద నిలబడడమంటే నిజాల మీద నిలబడడమే!
చాలా బాగుంది సర్.

నిజం సర్