నేల పాట

ఇంక వాళ్ళు అతని ఛాతీని వెతికారు
కానీ వాళ్ళకు అతని హృదయం మాత్రమే దొరికింది
వాళ్ళపుడు అతని హృదయాన్ని వెతికారు
అందులో వాళ్ళకు ప్రజలు మాత్రమే కనిపించారు
అప్పుడు వాళ్ళతని కంఠంలో వెతికారు
వాళ్ళకందులో అతని దుఃఖమే కనిపించింది
వాళ్ళతని దుఃఖంలో వెతికారు
అందులో వాళ్ళకు అతనున్న జైలు మాత్రమే కనిపించింది
వాళ్ళు అతని బందిఖానాను వెతికారు
కానీ అక్కడ వాళ్ళని వాళ్ళే సంకెళ్ళలో చూసుకున్నారు

(Mahmoud Darwish: The earth poem, 1979)

Leave a Reply