నెత్తురుతడిసిన విత్తనం

నేను
నెత్తురు లో తడిసిన నేలపై మొలిచిన విత్తనాన్ని
మీరెన్ని కత్తులతో
తెగ నరికిన
తెగిపడ్డ ప్రతికొమ్మ
మొక్కై మొలుస్థాను
మీరెన్ని సునామీలైన సృష్టించండి
మీరెన్ని తుఫానులైన సృష్టించండి
మీరెన్ని కృత్రిమ భూకంపాలైన సృష్టించండి
అదరక బెదరక
నిటారుగానే మొలుస్తాను
కొమ్మ కొమ్మకో వేల రెమ్మలు
రెమ్మ రెమ్మ కో వేలపూలు
పువ్వు పువ్వు కో ఫలాన్ని అందిస్తాను
పువ్వు పువ్వు కో ఫలాన్ని అందిస్తాను
నేను
నెత్తురుతో తడిసిన నేలపై
మొలిచిన విత్తనాన్ని
నేను
నెత్తురుతో తడిసిన నేలపై
మలిచినా విత్తనాన్ని

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలం గుంటూరుపల్లి. కవి, రచయిత, అధ్యాపకుడు. రచనలు: అవ్వ జెప్పిన తొవ్వ (దీర్ఘ కవిత), పాదముద్రలు, వెన్నెల వర్షం( పాటల సీడీ), గురి (దీర్ఘ కవిత ). వరంగల్ సీకేఎం కాలేజీలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.

Leave a Reply