ఒకే రక్తం నీలో నాలో
నా లోకువ రక్తం ‘కళ్ళం’ లో కళ్ల చూడటం నీకు అలవాటే
ఒకే భూమి నీదీ నాది
కానీ కబ్జాకి వేస్తావు పునాది
మా వైపు ప్రవహించే నదికి
అంటరాని ఆనకట్ట కడతావు
అనాదిగా అదే గాలి వీచినా
మాకెందుకో నీతో ఉంటే ఊపిరి ఆడదు
ఒకే దేవుడి బిడ్డలమైనా
మాకెపుడు దేవుడు కన్నా ముందు
తాళం దర్శనం తాళ మేస్తుంది
బూజు పట్టిన శాస్త్రాలతో
గుండెల్ని గాయాలు చేసే అస్త్రాలు
వేస్తూనే ఉంటావు
కులం వ్యాకులమై నిత్యం
గుండె నెగడు మండు తూనే ఉంటుంది
కాలం ఎల్లకాలం ఇలాగే ఉండిపోదు
అక్షరాలు ఆయుధాలై పదునెక్కుతాయి
గోవు కూడా గాండ్రిస్తుంది