కురుస్తూనే ఉంది
ఎడతెగని వాన
జీవితాలను ముంచెత్తుతూ
అంతటా అతలాకుతలం చేస్తూ
ఆకాశం గట్టిగా గర్జిస్తుంటే
భూమి ఉలికులికి పడుతోంది
గదిలోని ఆమెలాగే
చినుకుల సూదులతో
పదునుగా గుచ్చిగుచ్చి చంపుతుంటే
నేల తడిసి తల్లడిల్లుతోంది
అతడి మాటలకు ఆమెలాగే
ఎంతకూ తెరిపివ్వదే
కన్నీటివరదైన ఆమెలాగే
బయటా వానే
ఆమె హృదయంలోనూ వానే
తుఫానులు పుడమిని
అడపాదడపా మాత్రమే వేధిస్తుంటాయి
ఆమెకు మాత్రం అవి
గుండెల్లో తిష్టవేసి కూర్చున్నాయి
పేరుకి
ఆ తుఫాన్ గులాబ్ ట
ఇక్కడీమె
రేకులన్నీ రాల్చుకున్న గులాబీ
Adbhutamaina vyakti karana
గులాబ్ ని దేన్ని ప్రతీకగా తీసుకున్నారో అర్ధమయ్యినపుడు ఉలిక్కిపడ్డాను. బాగుంది
Amazing description!