కడుపులోని ఆకలిచెట్టుకు
రాలిన ఎండుటాకులెన్నో
మెతుకువేసిన బాటెంట
ఎంతనడిచినా దూరం తరగడం లేదు
ఉన్నోడి
పిల్లులకు, కుక్కలకు మాస్కులు,మర్యాదలు
ఏమీలేని దానయ్యల, వలస బతుకుల ప్రాణాలు మాత్రం ఫ్రీ… ఫ్రీ
ఓడిన ప్రతిసారీ
కూడదీసుకుని బతకడం మనకలవాటే
ఇంట్లోనే మనతోపాటు మునగదీసుకుని పడుకున్న చావురేఖను ఏంచెయ్యాలో
సమజైత లేదు
జర బద్రం
ఆకలి పాడెనెక్కి, నెత్తురోడుతున్న నడకతో
ఊరి మూటను మోసుకుంటూ
సమాధులతో మాటకలుపుతూ
తోటి మనుషుల, విషప్పురుగుల
బారిన పడ్తూలేస్తూ వాళ్ళింకా నడుస్తూనే వున్నారు