జోహార్ అనిశెట్టి రజిత!

భావ సారూప్యం ఉన్న కొందరు మిత్రులం కలిసి 1 మే, 2019లో కొలిమి వెబ్ పత్రిక మొదలు పెట్టినం. ఏ ప్రచార ఆర్భాటాలు లేని కొత్త ఒరవడితో ఆరేళ్లు పూర్తయింది. ఈ ప్రయాణంలో మొదటి నుంచీ అనిశెట్టి రజిత గారు కొలిమి సంపాదక బృందంలో ఉన్నారు. మా కొత్త తరంతో అనేక విషయాలు పంచుకున్నారు. నిర్మొహమాటంగా మాట్లాడేవారు. పత్రిక నిర్వహణలో అనేక సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఉత్పత్తి కుల, వర్గాల సాహితీ సృజన సమాజానికి ఎంత అత్యవసరమో గుర్తుచేసేవారు. ఒకే విషయాన్ని భిన్న కోణాల్లో ఎట్లా అర్థం చేసుకోవాలో చెప్పేవారు.  ఒకవైపు రచన. మరోవైపు ప్రరవే బాధ్యతలు. అనారోగ్యాన్ని అధిగమిస్తూనే కొలిమితో ఉన్నారు. కోవిడ్ తర్వాత తీవ్రమైన అనారోగ్యం వల్ల పత్రిక కోసం సమయం కేటాయించడం వీలుకాలేదు.  ఆరోగ్యం కుదుటపడ్డాక మళ్లీ వచ్చేదుండె. ఇంతలోనే ఈ విషాదం. తెలంగాణ మట్టి బిడ్డ అనిశెట్టి రజిత గారికి కొలిమి సంపాదకవర్గం నివాళి అర్పిస్తోంది.

One thought on “జోహార్ అనిశెట్టి రజిత!

Leave a Reply