జీవితమా పరుగెత్తకే
ఇంకా ఈ లోకం బాకీలు తీర్చాల్సుంది
కొన్ని బాధలను ఆర్చాల్సుంది
కొన్ని బాధ్యతలు నెరవేర్చాల్సుంది
నీ పరుగు వేగంలో
కొన్ని పడిపోయాయి మరెన్నో చేజారాయి
పడినవాళ్ల నిలబెట్టాలి
ధుఃఖితులను నవ్వించాలి
కొన్ని నవ్వులింకా పండనేలేదు
జరూరు పనులింకా అవనేలేదు
ఈ మనస్సింకిన ఆశలను
పాతిపెట్టడం మిగిలే ఉంది.
కొన్ని బంధాలు ముడివడుతూ విడిపోయాయి
కొన్నికలిసికలుస్తూ కరిగిపోయినయ్
తెగి, చేజారిన బంధాల్జేసిన
గాయాలను మందేసి మాన్పాల్సుందికా
నీవు సాగు ముందుకు
నేననుసరించి అడుగేస్తుంటా
అయినా నిను గెలువ తరమా
ఈ ఊపిరిమీదకున్నవారికి
అర్ధంచేయించే పనేఅవలే
జీవితమా… పరుగెత్తకే
ఇంకెన్నో బాకీలు తీర్చాల్సుంది.
– గుల్జార్
స్వేచ్ఛానువాదం : జిట్టా బాల్ రెడ్డి