వ్యవసాయం చేసి
పశుపక్ష్యాదులకు తిండి పెట్టిన చేతులవి
ఎండిన తమ పేగులను విరిచి
దేశానికి తిండి పెట్టిన గుండెలవి
అవి
ఈ భూమండలంపై కదిలే చెట్లు
వర్షించే మేఘాలు
వెన్నెల పారే నదులు
సూర్యకిరణాలను ప్రసరిస్తూ
ఎవుసం చేసే నాగళ్ళు
ఆదివాసీ చేతులు
విల్లు బాణాల చరిత్ర పుస్తకాలు
కాగడాలతో వర్తమానాన్ని రచిస్తున్న కలాలు
భవిష్యత్తును పాడుతున్న కొండనాలుకలు
ఆదివాసీ చేతులు
సాయుధులైన కొండకోనల రక్త మాంసాలు.
బావుంది