చిట్ట చివరి ప్రయాణం

హఠాత్తుగా
ఎండిన చెట్టు కి
ఎగిరే తెల్లటి పూలు

ఉన్నట్టుండి
కుంట లో విసిరిన రాయి
రెక్కలొచ్చి ఎగిరిన పక్షి

ఆరు బయట
బకెట్ నిండా
నీళ్లు చూసి
పైకి పోసుకోవడానికి
నీటిలో మునిగిన
చంద్రుడు

నేలను
గుల్ల చేసి చేసి
విశ్రాంతి తీసుకునే
వాన పాము పై
వాలిన చినుకు

ఇట్లాంటివి రాసి
చాలా చించి పారేశాక
ఈ పాదాలు పుట్టాయి
కారు,విమానం, రైలు ఎక్కి
ప్రయాణం చేసే
నీ
చిట్ట చివరి ప్రయాణం
ఏ వాహనం మీద ?

పుట్టింది నెల్లూరు జిల్లా, ఓజిలి, రాచపాలెం. కాకినాడలోని పిఠాపురం రాజా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖాధిపతి. 'నీటిపూలవాన', 'గోరువంకల గానం' అనే రెండు పిల్లల కవితా సంకలనాలు వేశారు. ఎక్సరే, తానా, రంజని, కుందుర్తి వంటి పురస్కారాలు పొంది ఉన్నారు. రాధేయ కవితా పురస్కార నిర్వాహకులలో ఒకరు.

Leave a Reply