గెరిల్లా కూడా కవిలాగే
రాలే ఎండుటాకుల సవ్వడి
విరిగే చెట్ల రెమ్మల చప్పుడు
నది ప్రవాహపు గలగలలు
కానలలో రేగిన కారగ్గి వాసన
కాలి మిగిలిన బూడిద కుప్ప
ఏది ఆ తీక్షణ దృష్టిని దాటిపోదు.
గెరిల్లా కూడా కవిలాగే
చెట్లలో కలగలిసిపోతాడు.
పొదల్లో, రాళ్ళలో అస్పష్టంగానే
కానీ, చక్కగా అమరిపోతాడు.
గతిశాస్త్రానికి చక్కని సంకేతమైన
అతడు అనేక రూపాల అధిపతి
గెరిల్లా ఒక కవిలాగే
ప్రకృతి లయకారుడై సాగిపోతాడు
ఆకుపచ్చని రంగులో అమిరిపోయి
లోనావరించిన నిశ్శబ్దం, బయటికి
వ్యక్తమయ్యే అమాయకత్వంతో
చేతిలోని హుందాయైన ఉక్కు ములికితో
శత్రువును వలలేసుకుంటాడు.
గెరిల్లా కూడా కవిలాగే
ఆకు పచ్చ, గోధుమ వర్ణం
అలల వెల్లువై సాగిపోతాడు.
పొదలో విరిసిన అగ్నిపూలను
తురాయిలా ధరించి మురిసిపోతాడు
నేల మీద వరదెత్తే సమూహమై
స్థావరం వైపు ఆగకుండా సాగుతాడు.
దీర్ఘకాలిక యుద్ధం పై అచంచల విశ్వాసి
అతడొక అంతులేని ఉద్యమోదృత శక్తి
ప్రజా ఇతిహాసం, ప్రజా యుద్ధం విశ్వాసం
-ప్రొఫెసర్ జోస్మరియో సెజాన్
రచనా కాలం: 1968
అనువాదం: హసన్ నసీర్
ఉక్కు ములికి తో శత్రువు కి వల లేసుకుంటాడు