2 అక్టోబర్, 2024
ప్రియమైన అధ్యక్షులు జోసెఫ్ బైడెన్ & ఉపాధ్యక్షులు కమలా హ్యారిస్,
మేము 99 మంది అమెరికన్ వైద్య నిపుణులు, సర్జన్స్, నర్స్ ప్రాక్టిషనర్స్, నర్సెస్, మిడ్ వైవ్స్ అందరం కలిసి కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాము. మేమంతా 7 అక్టోబర్, 2023 నుంచి గాజా స్ట్రిప్‌లో స్వచ్చందంగా యుద్ధ బాధితులకి, క్షతగాత్రులకు సేవలందించిన వాళ్ళం. అప్పటి నుంచీ గాజా ఆసుపత్రుల్లో, క్లినిక్స్‌లో 254 వారాల పాటు మేము నిరవధికంగా సేవలు అందించాము. గాజా స్ట్రిప్‌లో మేము అనేక స్వచ్ఛంద సంస్థలతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)తో కలిసి పని చేశాం. మాలో చాలా మంది కేవలం వైద్య వృత్తిలో నిపుణులైన సర్జన్స్ మాత్రమే కాకుండా వైద్య రంగంలో, ప్రజారోగ్యం లాంటి ఇతర శాఖలలో పని చేసిన అనుభవజ్ఞులున్నా రు. దుర్మార్గంగా రష్యా ఆక్రమించిన ఉక్రైన్ యుద్ధ ప్రాంతాల్లో కూడా మా సేవలు అందించాము. మాలో కొద్ది మంది మాజీ సైనికులం, ప్రస్తుతం సైన్యంలో పని చేస్తున్న వాళ్ళం కూడా ఉన్నాము.
మాలో కొద్దిమంది ప్రభుత్వమే సైన్యం నుంచి పంపించిన రిసర్విస్టులున్నారు. మాలో చాలా మందిమి భిన్న మతాల, విశ్వాసాల, జాతులకి చెందిన వాళ్ళము. మాలో ఎవరమూ కూడా అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌లో పాలస్తీనియన్ యుద్ధ సంస్థలు, వ్యక్తులు జరిపిన క్రూరమైన చర్యలను, దాడిని సమర్థించలేదు.
మీకు తెలియంది కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ రాజ్యాంగం ప్రకారం ఇలా సూత్రీకరించింది. “ప్రజలందరి ఆరోగ్యం అన్నది శాంతి భధ్రతలకు పునాది లాంటిది. అయితే దీన్ని సాధించడం అనేది ప్రతి ఒక్క దేశం, వ్యక్తుల సంపూర్ణ పరస్పర సహకారం మీదనే ఆధారపడి ఉంటుంది.” ఈ స్ఫూర్తితోనే మేము మీకు ఈ బహిరంగ లేఖ రాయడానికి పూనుకున్నాము.
మేమంతా కూడా అక్టోబర్ 7 నుంచి గాజా స్ట్రిప్‌లో వైద్య రంగం నుంచి అనుమతించబడ్డ తటస్థ పరిశీలకులం మాత్రమే. కానీ ఈ గాజా స్ట్రిప్‌లో పని చేస్తున్న క్రమంలో అక్కడ మేం చూసిన అమానుషమైన, క్రూరమైన విషయాలను అమెరికన్ ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాము. ఇది చదివాక అమెరికన్ ప్రభుత్వం ఇజ్రాయిల్ పాలస్తీనా పైన చేస్తున్న దమనకాండకు, దురాక్రమణకు తన మద్దతుని, సహకారాన్ని ఉపహరించుకుంటుందని మా ఆశ. మేమంతా గాజాలో ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల్లో మరణించిన ప్రజల.. ముఖ్యంగా స్రీలు, పిల్లల మరణాల సంఖ్యని అక్కడ స్థానికంగా పని చేస్తున్న వారిగా మీకు ఈ లేఖలో చెప్పాలనుకుంటున్నాం. మేం అక్కడ పని చేస్తున్నప్పుడు వివిధ సోర్సెస్ ద్వారా లభించిన అనేక వాస్తవిక అనుభవాలు, సంఘటనల ఆధారంగా, అలాగే మా స్వంత అనుభవాలను ఆధారం చేసుకుని ఈ లేఖను రాయడం జరిగినది. అలాగే ప్రజలు బహిరంగంగా చెప్పిన వాటిని ప్రత్యక్షంగా రికార్డు చేసిన సమాచారాన్న, అక్కడి స్థానిక మీడియా నుంచి కూడా సేకరించిన వాస్తవ సంఘటనల సారాంశాన్ని, అకడమిక్ వనరుల రికార్డుల నుంచి కూడా ఇజ్రాయల్ చేసిన గాజా ఆక్రమణ విషయాలలో అతి ముఖ్యమైన నోట్స్‌ను ఈ లేఖలో పొందుపరిచాము. ఈ సమాచారం కూడా అనుబంధాలుగా ఈ లేఖతో జతపరుస్తున్నాము. ఈ రెండూ gazahealthcareletters.org వెబ్‌సైటులో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ వెబ్‌సైటులో కెనెడియన్ & బ్రిటిష్ వైద్య రంగ కార్యకర్తలు ఆయా ప్రభుత్వాలకు ఇజ్రాయిల్ దాడుల మీద.. గాజా ప్రజలు అనుభవిస్తున్న అత్యంత అమానుషమైన దారుణమైన హింసను., మరణాలను గురించి రాసిన లేఖలు కూడా ఉన్నాయి. అక్టోబర్ నుంచీ గాజాలో ఇజ్రాయిల్ సృష్టించిన నరమేధంలో జరిగిన హత్యలను ఒక పరిశీలనాత్మక సాక్ష్యంగా అనుబంధ పత్రాలతో సహా మేం మా ఈ లేఖలో పొందుపరచాము. దీనిలో గాజా మారణకాండలో జరిగిన మరణాల సంఖ్య అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వం అనుకున్న దాని కంటే కూడా చాలా ఎక్కువ రెట్లు ఉన్నదని నిర్ధారించాము. ఈ యుద్ధంలో మరణాల సంఖ్య 1,18,908 కంటే ఎక్కువ. అంటే దాదాపు గాజా మొత్తం జనాభాలో 5.4% అన్న మాట.మీకు మా విన్నపం ఏంటంటే మన అమెరికా ప్రభుత్వం పాలస్తీనా, ఇజ్రాయిల్ ప్రజలను మరింత ఘోరమైన విపత్తులోకి తొయ్యకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇజ్రాయిల్ కాల్పుల విరమణ ఆపే దిశగా అమెరికా ఇజ్రాయిల్‌కి ఆయుధ సరఫరా నిలిపివేయాలి. అలాగే ఇజ్రాయిల్ పాలస్తీనా ఆయుధ సంస్థలకు అంతర్జాతీయ శాంతి భధ్రత ప్రయోజనాల దృష్ట్యా., అంతర్జాతీయ ఆయుధ నిషేధ నియమాలకు అమెరికా మద్దత్తు ఇవ్వాలి. అమెరికన్ చట్టాలను, అంతర్జాతీయ మానవతా చట్టాలను గౌరవిస్తూ అమెరికా ప్రభుత్వం ఈ విషయంలో అనుకూలంగా స్పందిస్తుంది అని మేము ఆశిస్తున్నాము. అలాగే అమెరికా మానవతా దృక్పథంతో స్పందించడమే సరి అయిందిగా మేం ప్రగాడంగా నమ్ముతున్నాము.
***
“నేను ఇంత పెద్ద ఎత్తున, ఇంత భయంకరమైన గాయాలను నా వైద్య జీవితంలోనే ఎప్పుడూ చూడలేదు. బాంబులు మా ఆడవాళ్ల, పసిపిల్లల శరీరాలను వేల సంఖ్యలో ఛిద్రం చేస్తున్నాయి. నిర్దాక్షిణ్యంగా కోసేస్తున్నాయి. వారికి చికిత్స చేయడానికి మా దగ్గర చాలినన్ని వైద్య సదుపాయాలు లేవు. వాళ్ళ ఖండిత దేహాలతో ఈ క్రూరాతి క్రూరమైన జాతి హత్యాకాండ జ్ఞాపకార్థం ఒక పెద్ద స్మారక ఫలకంగా కట్టచ్చు.”
– డా. ఫిరోజ్ శిధ్వ, ట్రామ & క్రిటికల్ కేర్ సర్జన్, సైనిక విభాగ జనరల్ సర్జన్.
ఒక చిన్న ఐదేళ్ల పిల్లవాడి దేహం మధ్యలో ఒక ఫూట్ బాల అంత రంధ్రం ఏర్పడింది. బాంబు వల్ల. ఆ రంధ్రం లోనుంచు ఆ పసివాడి ఆవయవాలన్నీబయటకు పడిపోయాయి. అంతే కాదు కపాలం పగిలి మెదడు బయటకు వచ్చేసింది. కాళ్ళూ ,చేతులూ తెగిపోయిన పిల్లల్లా బాధ చెప్పనలవి కాదు.
“కొద్దిమంది మినహాయిస్తే దాదాపు చాలా మంది గాజాలో తీవ్రంగా గాయపడ్డారు, అనారోగ్యాల పాలయ్యారు లేదా రెంటికీ గురి అయ్యారు. వాళ్ళల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పని చేసే వైద్య సహాయకులు, ఇజ్రాయిల్ చెరబట్టిన గాజా పౌరులు, స్రీలు, పురుషులు, పిల్లలు ఉన్నారు. గాజాలో పని చేస్తూ ఉన్నప్పుడు అక్కడి మా బాధిత రోగులలో, ఆరోగ్య సేవా కార్యకర్తలలో తీవ్రమైన పోషకాహార లోపం ఉండడం మేము ఎక్కువగా గమనించాము. మాలో చాలా మందికి ఆహారం అందుబాటులోనే ఉన్నా కానీ, మాతో పాటుగా మా పోషక విలువలున్న మా స్వంత ఆహారం అక్కడికి తీసుకు వెళ్ళినా కానీ ఎందుకో మేము చాలా మంది చాలా వేగంగా బరువు తగ్గిపోనారంభించాము. మా దగ్గర ప్రాణాంతకమైన పోషకాహార లోపంతో బక్కగా, బలహీనంగా మారిపోయిన పిల్లల ఫోటోలు చాలా ఉన్నాయి. వాళ్ళ గురించి మీతో పంచుకోవాలని ఆతృతగా ఉంది. వాస్తవానికి హాస్పిటల్ లోపల బయటా ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలందరూ దగ్గుతో పాటుగా నీళ్ళ విరోచనాలతో బాధ పడుతున్నారు. దాదాపు ప్రతి గదిలో కూడా హెపటైటిస్-ఏ ఇన్ఫెక్షన్‌తో కూడిన జాండిస్ ఉండింది. గాజాలోని మా ఆరోగ్య కార్యకర్తలకు కూడా జాండిస్ సోకింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సరైన సానిటేషన్ అంటే శుభ్రతకి సంబంధించిన సౌకర్యాలు ఉదాహరణకి.. స్పిరిట్, సబ్బు లాంటివి లేక సర్జరీ తరువాత వేసే కుట్లు బాగా ఇన్ఫెక్ట్ అయిపోయేవి. దీనికి అశుభ్రత ఒక్కటే కాదు మాలో తీవ్రమైన పోషకాహార లోపం ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండి సర్జరీ కుట్లు, గాట్లు పూర్తిగా మానేవి కావు. దాంతో పాటు సర్జికల్ పరికరాలు, అందరికీ సరిపడా మందులు ముఖ్యంగా ఇన్ఫెక్షన్‌న్ని తగ్గించే యాంటీబయోటిక్స్ సప్లయ్ తగినంత స్థాయిలో ఉండేవి కావు.
స్రీలలో పోషకాహార లోపం వలన, గర్భస్రావాలు, తక్కువ బరువున్న శిశు జననాలు, ప్రసవానంతరం బాలింతలకు శిశువికి సరిపడా పాలు రాకపోవడం అనే స్థితి వలన ,ఇది ఎంతోమంది శిశు మరణాలకి దారి తీసింది. దాంతో పాటు తాగు నీరూ కూడా దొరకని పరిస్థితిని గాజాలో కల్పించారు. తల్లి పాలతో పాటు నీళ్ళు దొరకని దారుణమైన పరిస్థితుల్లో శిశువులు మరణించడం ఎంత అన్యాయం? పిల్లలకి గతి లేని పరిస్థితుల్లో పాలు రాని తల్లులు కలుషితమైన నీరు తాగించడం మేము చూసాము. ప్రపంచమంతా దీన్ని చూస్తూ కూడా చనిపోతున్న అమాయకమైన పిల్లల్ని, నిస్సహాయమైన మహిళలను పట్టించుకోక పోవడాన్ని మేము క్షమించ లేక పోతున్నాము.
“ప్రతీ రోజు నేను గాయాలతో చిత్ర హింసలు పడ్డ దేహాలు చివరికి నిస్సహాయంగా ప్రాణాలు పోవడాన్ని చూస్తూనే ఉన్నాను. నిజానికి వాళ్ళంతా ఎంతో ఆరోగ్యంగానే పుట్టారు. కానీ ఆ పసి పిల్లల తల్లులంతా తీవ్రమైన పోషకాహారంతో ఉండడం వలన పిల్లలకి సరిగ్గా పాలు ఇవ్వలేకపోవడం, శుభ్రమైన తాగునీరు, ఆహారం దొరక్కపోవడం, వారు పస్తులతో చావడానికి దారి తీసింది.”
– ఆశా తామ : చిన్న పిల్లల వైద్య నిపుణురాలు–నర్స్.
“భయంకరమైన ఈ అంటువ్యాధులు రోజు రోజుకి గాజాలో పెరిగిపోతున్నాయన్న విషయాన్ని మీరు గమనించాలి. ఇజ్రాయిల్ ప్రభుత్వం చేస్తున్న మరో దారుణం ఏమిటంటే.. ఈ నిస్సహాయమైన, బలహీనమైన స్రీలని, పిల్లలని తిండి, తాగడానికి నీళ్ళు, కనీసం టాయిలెట్స్ లేని స్థలాలకి ., నిర్దాక్షిణ్యంగా వాళ్ళ చావుకు వాళ్ళని బలవంతంగా తరలించడం. ఇది చాలా దిగ్భ్రాంతిని కలిగించే వాస్తవం. ఇది ఖచ్చితంగా ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌తో నీళ్ళ విరోచనాలు, న్యూమోనియాలాంటి ఊపిరితిత్తుల వ్యాధులకి లోనై చనిపోవడానికి దారి తీస్తున్నది. బాంబులు వదిలే రసాయనాల వల్ల పసిపిల్లలు తీవ్రమైన చర్మ వ్యాధులతో, పుండ్లతో, దురదలు, నొప్పులతో చికిత్స కూడా దొరక్క నరక యాతన అనుభవిస్తున్నారు. అదే కాదు పోలియో వైరస్ మళ్ళీ చెలరేగింది. దానికి కారణం యుద్దం మొదలై సంవత్సరం గడుస్తున్నది.. పిల్లలకి వాక్సినేషన్ ఇవ్వడం ఆగిపోయింది. అలాగే శుభ్రతకు సంబంధించిన పరికరాలు, వనరుల సరఫరా అన్నీ స్థంబించాయి. ఆహారం దొరకక పోషకాహారలోపం పెరిగి వ్యాధి నిరోధకశక్తి క్షీణించడం కూడా త్వరగా వ్యాధులు ప్రభలడానికి , లేదా తగ్గక పోవడానికి కల కారణం. మేం భయపడుతున్నది ఎందుకంటే.. ఇప్పటికే వ్యాధి దానికి తోడు పోషకాహార లోపం వలన చాలా మంది పిల్లలు మరణించారు. త్వరలో రాబోయే వర్షా కాలంలో గాజాలో మరింత మంది చిన్న పిల్లలు మరణించే అవకాశం ఉంది.
“గాజాలో మొదటి సారి నేను చిన్న పిల్ల మెదడుని చేతిలో పట్టుకున్నాను. ఆ తరువాత చాలా మందివి.”
– డా. మార్క్ పేరి మట్టర్, ఆర్థోపెడిక్ & హ్యాండ్ సర్జన్.
“సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా చూడండి యుద్ధం జరిగే సమయంలో అమాయకమైన పిల్లలని గాయపరచకుండా చూసుకుంటారు. పిల్లలని యుద్ధ పరిధిలోకి రాకుండా చూసుకుంటారు. కానీ గాజాలో కావాలని, చంపే ఉద్దేశ్యంతోనే యుద్ధాన్ని చిన్నపిల్లల మీదే నేరుగా ఎక్కు పెట్టారని ఈ లేఖ మీద సంతకం పెట్టిన ప్రతీ ఒక్కరూ గమనించారు. ప్రత్యేకంగా ఎమర్జెన్సీ, ఇంటెన్సివ్ కేర్, సర్జికల్ సెట్స్‌లో పని చేసిన వాళ్ళం అంతా కూడా కౌమార్య వయసులోని చిన్నపిల్లల్ని, ఎవరైతే తల మీద, ఛాతీమీద కాల్చబడ్డారో వాళ్ళకి రోజూ చికిత్స చేసేవాళ్ళం. గాజాలో రోజూ జరుగుతున్న యుద్దాన్ని గమనిస్తే చిన్నపిల్లల మీద నేరుగా బాంబుల దాడి జరగడం, లేదా తుపాకులు పేలడం అనేది, అసంఖ్యాకంగా మరణించడం అనేది యాదృచ్ఛికం కాదు. ఇజ్రాయిల్ సైన్యానికి, పౌరులకి ఇది తెలియకుండా ఏమీ జరగడం లేదు అని అర్థం అవుతున్నది.
ప్రెసిడెంట్ బైడెన్ & వైస్ ప్రెసిడెంట్ హ్యారిస్.. మేము గాజా నుంచి తిరిగొచ్చాక కూడా మిమ్మల్ని ఆ భయానకమైన పీడకలలు వేధించడాన్ని మీరు గమనించాలి. చిన్న పిల్లల స్వప్నాలన్నీ మన దేశపు మారణాయుధాలతో ఛిద్రమవుతున్నాయి. వాళ్ళ దేహాలు తెగిపోయి అంగవికలురు అయిపోయారు. దు:ఖం ఆపుకోలేని ఆ పిల్లల తల్లులు వాళ్ళని రక్షించమని మిమ్మల్ని వేడుకుంటున్నారు. ఆ తల్లుల ఆర్తనాదాలు, రోదనలు మీకు వినిపిస్తున్నాయనే అనుకుంటున్నాము. కనీసం మన అంతరాత్మలు మనల్ని వాళ్ళ దుఃఖాల్ని మరిచిపోనివ్వవు. అసలు ఎందుకు మీరు వందల సంఖ్యలో పిల్లల్ని చంపుతున్న ఇజ్రాయల్‌కి కావలసిన మారణాయుధాలను సరఫరా చేస్తున్నారో మా ఊహాకి కూడా అందటం లేదు. ఏ లెక్కలకి అందనిది ఈ దారుణం.
“నా కళ్ళతో నేను చాలా మంది పసిపిల్లలు తల్లి గర్భాల్లోనే చనిపోయి పుట్టటం చూశాను. ప్రసవానంతర సమస్యలైన రక్త స్రావాలతో., రక్త హీనతకి గురై ఎక్కించడానికి రక్తం దొరక్క తల్లులు మరణించడం చూశాను. ఇదంతా గాజాలో ఆసుపత్రులు బాగా పని చేసి ఉంటే జరిగి ఉండేవి కాదు. పని చేయకుండా ఇజ్రాయిల్ సైన్యం వాటిని ధ్వంసం చేసింది.”
– డా.తాలియ పాచియాననాకిస్ – స్రీ వ్యాధి నిపుణురాలు (గైనకాలజిస్ట్)
మా దగ్గరికి వచ్చే గర్భిణీ స్రీలు, పిల్లలకి పాలిచ్చే తల్లులు పోషకాహార లోపంతో బాగా బలహీనంగా ఉండేవారు. మా దగ్గర ప్రసవించే స్రీలు ప్రసవానంతరం మరణించే వాళ్లు. పిల్లలు తల్లి గర్భంలోనే చనిపోయి పుట్టేవాళ్ళు. వైద్య వ్యవస్థలు, ఆరోగ్య సంస్థలు సమగ్రంగా పని చేసే చోట.. అదీ అభివృద్ధి చెందుతున్న దేశంలో ఇటువంటి మరణాలు సంభవించవు. ప్రసవం కోసం చేసే సిజేరియన్ ఆపరేషన్‌లో అయ్యే గాట్లు, కుట్లు ఇన్ఫెక్ట్ అయిపోవడం వల్ల తగ్గకపోయేవి. వెజైనల్, సిజేరియన్ పద్ధతిలో జరిగే ప్రసవాలు అన్నీ అనస్తీషియా ఇవ్వకుండానే జరిగేవి. ఆ స్రీలు అనుభవించే భయంకరమైన నొప్పి తగ్గడానికి టైలినాల్ టాబ్లెట్ ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే అదొక్కటే ఇక్కడి హాస్పిటల్లోని ఫార్మసీలలో దొరికేది. వేరే ఏ పెయిన్ కిల్లర్ ఉండేది కాదు. మేము చాలా మందిమి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్‌లో ప్రమాదకరమైన దీర్ఘకాలిక వ్యాధులైన, డయాబెటీస్, హైపర్టెన్షన్(బీ.పీ), హృదయ సంబంధిత వ్యాధులు, కిడ్నీ ఫేల్యూర్ వ్యాధులతో బాధపడే రోగులతో కిక్కిరిసి ఉండడం చూసాము. బాంబు దాడుల్లో గాయాలతో క్షతగాత్రులైన రోగులతో పాటుగా ICU విభాగాల్లో టైప్ -1 డయాబెటిస్ రొగులు రోజూవారి ఇన్సులిన్ ఇంజెక్షన్ దొరక్క క్రిటికల్ స్థితిలో ఉన్నారు. మందులు లేక పోవడం, వాటిని రిఫ్రిజిరేటర్స్‌లో భద్రపరచడానికి సరిపడా ఫ్రిడ్జ్‌లు లేకపోవడం, కొన్ని ఉన్నా విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల షుగర్ రోగ పీడితులు ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. ఇజ్రాయిల్ దాదాపు పాలస్తీనాలో ఉన్న సగానికి సగం ఆరోగ్య వ్యవస్థలని, హాస్పిటల్స్‌ని, లాబ్స్‌ని ధ్వంసం చేయడమే కాదు దాదాపు వెయ్యి మంది వివిధ వైద్య విభాగాల్లో వైద్య సేవలు అందించే ఆరోగ్య కార్యకర్తలని, వైద్య నిపుణులని హత్య చేసింది. ప్రతీ ఇరవై మందిలో ఒకళ్లని చంపేసిందన్నమాట. అదే సమయంలో పోషకాహార లోపం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, పెద్ద ఎత్తున పౌరులపై సైన్యం చేసే హింస, కనీస సౌకర్యాలు లేని స్థలాలకి బలవంతపు వలసలు, ప్రాణాంతకమైన దీర్ఘకాలిక వ్యాధులు, అంటువ్యాధులు, రసాయన ఆయుధాల ఉపయోగం వల్ల చెలరేగిన అంటు వ్యాధులు, కాళ్ళు, చేతులు విరిగిన క్షతగాత్రుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూ ఉన్నది. వీళ్లందరికి తక్షణ వైద్యసేవలు అందించాల్సిన వైద్య విభాగాల సంఖ్య.. ముఖ్యంగా ICU, ఎమర్జెన్సీ సేవా విభాగాల అవసరం చాలా పెరుగుతూ పోతున్నది.
మేము పని చేస్తున్న ఆసుపత్రులలో కనీస సౌకర్యాలయిన సర్జికల్ పరికరాల దగ్గరినుంచి సబ్బుల వరకు విపరీతమైన కొరత ఉంది. అంతే కాదు ఈ ఆసుపత్రులకి విద్యుత్తు సరఫరా, ఇంటర్నెట్, మంచి నీరు, ఇతర రోజువారీ పనుల కోసం అవసరమయ్యే నీటి సరఫరా.. అన్నిటికీ మించి తినే ఆహారం అన్నీ కూడా తగ్గించి వేయడమో., ఆపి వేయడమో జరుగుతున్నాయి. ఒకళ్ళు పట్టే బెడ్‌లో నలుగురు నుంచి ఏడుగురిని ఇరికించే పరిస్థితి. ప్రతి ఆసుపత్రి తీవ్రంగా వలసలు వచ్చే వాళ్ళతో గాయపడ్డ వాళ్ళతో, రోజూ వచ్చే కొత్త రోగులతో కిక్కిరిసి పోయి వున్నాయి. ముఖ్యంగా తీవ్ర గాయాలతో వచ్చే వాళ్ళకి చోటు లేని విధంగా కాజువాలిటీ వార్డులు కూడా నిండిపోయి ఉంటున్నాయి. మేం ఈ గాజా మారణకాండని, అమెరికన్ చట్టాలు, అమెరికన్ ఆయుధాలను విదేశాల్లో వాడకాన్ని, అంతర్జాతీయ మానవతాపూర్వక చట్టాన్ని ఉల్లంఘించడం అనే ముఖ్యమైన నియమాన్ని పరిశీలనాత్మక సాక్ష్యంగా భావిస్తున్నాం. ఇజ్రాయిల్‌తో కలిసి మన అమెరికా దేశం భాగస్వామిగా ఉంటూ పాలస్తీనా దేశ ప్రజల మీద చేస్తున్న ఈ క్రూరాతి క్రూరమైన మారణకాండను మేం ఎన్నటికీ మరిచిపోలేము,క్షమించలేము కూడా.
మేం గాజాలోని మా ఆరోగ్య సేవా సంస్థలో ఉన్న ఇతర ఉద్యోగస్తులను గమనించినప్పుడు వాళ్ళంతా తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడ్డమే కాదు మానసికంగా శారీరకంగా పూర్తిగా కృంగి కృశించి ఉన్నారు. ముఖ్యంగా పాలస్తీనా ఆరోగ్య కార్యకర్తలు గాజాలో బాగా గాయపడ్డ వాళ్ళు బహుశా ప్రపంచంలోనే ఉండరేమో? వాస్తవానికి గాజాలోని పౌరులు చాలా మంది వాళ్ళ కుటుంబ సభ్యులను, ఇళ్ళనూ సమస్తాన్ని కోల్పోయారు. చాలా మంది హాస్పిటల్ లోపలా, బయటా చాలా దుర్భరమైన స్థితిలో బతుకుతున్నారు. అయినప్పటికీ అలాంటి ఊహించలేని భయంకర పరిస్థితిల్లో కూడా వాళ్ళు బాధితుల కోసం పని చేసారు. వాళ్ళెవరికీ అక్టోబర్ 7 నుంచి జీతాల్లేవు. పైగా ఇజ్రాయిల్ వీళ్ళని టార్గెట్ చేసింది. ఇజ్రాయిల్ సైన్యం ధ్వంసం చేసిన ఆసుపత్రులలో పని చేసిన ఆరోగ్య కార్యకర్తలను కలిసాము. ఆ ఆసుపత్రులన్నీ దారుణంగా బాంబుదాడుల్లో ధ్వంసం అయిపోయాయి.
వాళ్ళంతా మేం అక్కడ తెలుసుకున్న వాస్తవాల కంటే కొంచం భిన్నంగా అక్కడి దారుణాలను మాకు చెప్పారు. నిర్బంధంలో వాళ్ళకు సరైన ఆహారం పెట్టలేదు. మానసికంగా, శారీరంకంగా నిరంతరం వేధించారు. వేధించి నఘ్నంగా రోడ్డు పక్కన వదిలేసారు. చాలా మందిని సామూహికంగా ఒక్క సారే చంపేసారు. దాంతో పాటు చనిపోయేముందు చిత్రహింసలు పెట్టారు. చాలా మంది ఎంత నిరాశ నిస్పృహతో ఉన్నారంటే “మేం చావు కోసం ఎదురు చూస్తున్నాం” అన్నారు.
ఈ లేఖలో సంతకం చేసిన 99 మందిలో గాజాలో అతిపెద్ద హాస్పిటల్స్‌లో, క్లినిక్‌లో 254 వారాలు పని చేసాము. అక్కడ మేం ఒక్కసారి కూడా పాలస్తీనియన్ పౌరులు ఒక్కరు కూడా సైనిక చర్యకు బాంబు దాడులకు పూనుకోగా చూడలేదు. అక్కడి హాస్పిటల్స్‌ని, ఇతర ఆరోగ్య సేవా సంస్థలనూ నాశనం చేయ లేదు.
మేము మిమ్మల్ని కోరేది ఒక్కటే. దయచేసి ఇజ్రాయిల్ చాలా పకడ్బందీగా, గాయపడ్డ పాలస్తీనియుల మరణమే లక్ష్యంగా కావాలని గాజాలోని మొత్తం ఆరోగ్య సేవా సంస్థలను సర్వనాశనం చేస్తుంది. అలాగే గాజాలో మా తోటి ఉద్యోగస్తులని చిత్రహింసల పాలు చేసి, హత్యలు చేయడం దాంతో పాటు మనుషులను మాయం చేయడం చేస్తున్నారు.
***
అధ్యక్షులైన బైడెన్ & ఉపాధ్యక్షులు హారీస్, ఈ భయంకరమైన పరిస్థితిని అంతం చెయ్యడానికి ఒకే ఒక పరిష్కారం మీరు కాల్పుల విరమణకి పిలుపునివ్వడం. హమాస్‌కి- ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మీద పని చేస్తున్నందుకు అభినందనలు. కానీ మీరొక చేదు వాస్తవాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అదేమిటంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు (USA) యుద్ధం చేసే దేశాల మీద కాల్పుల విరమణకు పని చేయడానికి బదులు ఇజ్రాయిల్‌కే ఆయుధాల సరఫరా ఎందుకు చేస్తున్నారు? ఇది మానెయ్యాలి. అలాగే అంతర్జాతీయ ఆయుధ నిషేధంలో ఇజ్రాయిల్ తో సహాయ అన్ని పాలస్తీనా ఆయుధ సంస్థలకు సపోర్ట్ ఇవ్వాలి. గత ఏడాది నించే చాలా మంది మీరు చెప్పిన విషయాన్నే మేమూ పునరుక్తి చేస్తున్నాం. అమెరికన్ చట్టం ఈ విషయంలో చాలా స్పష్టతతో ఉంది. అదేమిటంటే ఇజ్రాయిల్‌కి అమెరికా ఆయుధ సరఫరా చేయడం పూర్తిగా చట్ట విరుద్ధం!
అధ్యక్షులు బైడెన్ & ఉపాధ్యక్షులు హారీస్.. మేం మిమ్మల్ని కోరేది ఏమిటంటే ఇజ్రాయిల్‌కి తక్షణమే మిలిటరీ, ఆర్థిక మద్దతు ఉపసంహరించాలని అంతర్జాతీయ ఆయుధ నిషేధ ఒప్పందం ఇజ్రాయిల్ – పాలస్తీనా ఆయుధ సంస్థలు కాల్పుల విరమణ శాశ్వతంగా చేసే దాకా భాగస్వామ్యం కావాలి.
***
అలాగే ఇజ్రాయిల్ – పాలస్తీనా యుద్ధ ఖైదీలందరినీ విడుదల చేయాలి. ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధానికి సంబంధించి రెండు పార్టీల మధ్య శాశ్వత పరిష్కారం దొరికే వరకూ పని చేయాలి.
ఉపాధ్యక్షులు హారిస్… కాబోయే అమెరికా అధ్యక్షులుగా మీరు బహిరంగంగా కాల్పుల విరమణ, ఆయుధ సరఫరా నిలిపివేతకు మద్ధతును బహిరంగంగా ప్రకటించాలి. మీకు రాజకీయంగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ అమెరికా ఫెడరల్ చట్టాలని అమలు చేయాలి.
అధ్యక్షులు బైడెన్ & ఉపాధ్యక్షులు హారీస్.. మేము 99 అమెరికన్ డాక్టర్స్ గా ఫిజీషియన్స్‌గా, నర్సులుగా. ఇతర వైద్య విభాగాల పేరా మెడికల్ నిపుణులుగా మేము గాజా యుద్ధంలో దారుణమైన నేరాలను కళ్ళారా చూసాము. అందుకే మీరు ఈ నేరాలు మరింతగా కొనసాగే దిశలో ఇజ్రాయిల్‌కు మద్దతు ఇవ్వద్దని కోరుతున్నాం. రండి… మేం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మమ్మల్ని కలవండి… మేం ఏ చూసామో తెలుసుకోండి… మేం అమెరికా వైద్యులం అయి ఉండి కూడా ఎందుకు మిడిల్ ఈస్ట్‌లో అమెరికా ఇజ్రాయిల్ కి చేస్తున్న ఆయుధ సరఫరాను వెంటనే రద్దు చేయాలని కోరుతున్నామో తెలుసుకోండి.
అదే సమయంలో మేం 25 జూలై, 2024 న రాసిన లేఖలో రాసింది మళ్ళీ పునరుక్తి చేస్తున్నాం.
గాజా & ఈజిప్ట్ మధ్య ఉన్న రఫా క్రాసింగ్ ని వెంటనే మళ్ళీ తెరవాలి. అంతే కాదు అంతర్జాతీయ మానవతా సంస్థల ద్వారా గుర్తింపు పొందిన సంస్థల ద్వారా పాలస్తీనాకి అపరిమిత సహాయ సరఫరాలని అనుమతించాలి. వీళ్ళని స్వతంత్ర సంస్థలు మాత్రమే తనిఖీ చేయాలి. ఇజ్రాయిల్ సైనిక సంస్థల తనిఖీ నిలిపి వేయాలి.
***
ఇట్లు,
ఈ లేఖపై సంతకం చేసిన అమెరికా డాక్టర్లు, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు :
****
- ఫిరోజ్ సిద్వా, MD, MPH, FACS, FICS, నార్త్ కరోలినా
- మార్క్ పెర్ల్, MD, FAAOS, FICS, రాకీ మౌంట్ నార్త్ కరోలినా
- థాలియా పశియాన్నకిస్, MD, FACOG Obstetrician and Gynecologist, సౌత్ బెండ్, ఇండియానా
- మోనికా జాన్స్ టన్, RN, BSN, CCRN Adult and Pediatric Critical Care, పోర్ట్ ల్యాండ్, ఓరెగాన్
- ఆడమ్ హమావై, MD Plastic and Reconstructive Surgeon, ప్రిన్స్ టన్, న్యూ జెర్సీ
- లారా స్వోబోడా, DNP, APNP, FNP-C, FNP-BC, CWOCN-AP, మిల్ వాకీ, విస్కాన్సిన్
- బింగ్ లి, MD Emergency Medicine Physician, పెరిడాట్, ఆరిజోనా
- మెర్రీల్ టైడింగ్స్, BSN, RN, CEN Flight, Emergency, and Critical Care Nurse, శాంటా ఫే, న్యూ మెక్సికో
- మైక్ ఎం మల్లా, MD Trauma, Acute Care, Critical Care, and General Surgeon, చార్లెస్టన్, సౌత్ కరోలినా
- మార్గరెట్ ఆగ్డెన్, MPH, RN, CCRN Critical Care, Emergency, and Trauma Nurse, సియాటిల్, వాషింగ్టన్
- జాన్ కాహ్లర్, MD, FAAP Pediatrician, షికాగో, ఇల్లినాయిస్
- స్టీవ్ విటిలే, MD Emergency medicine physician, సొనోమా, కాలిఫోర్నియా
- బ్రెండా జె మాల్డోనాడో, RN Emergency Nurse, వాంకోవర్, వాషింగ్టన్
- నీనా ఎన్జి, MSN, RN Emergency Nurse, న్యూయార్క్ నగరం, న్యూయార్క్
- విల్హెల్మిమాసే, BSN, BA-Ed, TNCC Critical Care and Trauma Nurse, ఓమహా, నెబ్రాస్కా
- డెబోరా వీడ్నర్, MD, MBA General, Child, and Adolescent Psychiatrist, హార్ట్ ఫోర్డ్, కనెక్టికట్
- తాన్యా హజ్ హసన్, BM BCh, MSc Pediatric Intensivist, ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా
- బ్రిడ్జెట్ రోచియోస్, RN, MSN, CNM, WHNP Midwife and Reproductive Health Nurse, శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా
- నర్హీన్ అహ్మద్, MD, MPH Pulmonary and Critical Care Intensivist, ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా
- వనితా గుప్తా, MD Critical Care Intensivist, వైట్ ప్లెయిన్స్, న్యూయార్క్
- గమాల్ మారే, MD, FACS, FACC General and Cardiothoracic Surgeon, స్టాక్ టన్, కాలిఫోర్నియా
- తలాల్ ఖాన్, MD, FACP, FASN, FRCP Nephrologist, ఓక్లాహామా నగరం, ఓక్లాహామా
- సారా బద్రన్, MD, MACM, FPICCS, FSCAI Pediatric Cardiologist, గ్రాండ్ రాపిడ్, మిషిగాన్
- ఆస్మా ఏ తాహా, PhD, RN, CPNP-PC/AC, FAAN Pediatric Nurse Practitioner, పోర్ట్ ల్యాండ్, ఓరెగాన్
- విక్టోరియా అవిసాన్, MD General Surgeon, న్యూయార్క్ నగరం, న్యూయార్క్
- ఇమాద్ తమీమి, DMD Oral and Maxillofacial Surgeon, క్లిఫ్ టన్, న్యూజెర్సీ
- తాయర్ అహ్మద్, MD Emergency Medicine Physician, షికాగో, ఇల్లినాయిస్
- చంద్ర హాసన్, MD, FACS, FRCS General, Bariatric, Minimally Invasive, and Robotic Surgeon, షికాగో, ఇల్లినాయిస్
- అబీరా మొహమ్మద్, MSN, RN, CEN Emergency and Critical Care Nurse, డాలస్, టెక్సాస్
- హాని ఎల్ ఓమ్రాని, MD Obstetric and Regional Anesthesiologist, సియాటిల్, వాషింగ్టన్
- ఐమాన్ అబ్దుల్ ఘని, MD, FACS, FRCS Cardiothoracic Surgeon, హొనోలులు, హవాయ్
- జహీర్ సాలౌల్, MD, FCCP Pulmonary and Critical Care Intensivist, షికాగో, ఇల్లినాయిస్
- లానా అబూ ఘర్బిచ్ , BSN, RN, CEN Trauma, Operating Room, and Emergency Nurse, ఆష్ బర్న్, వర్జీనియా
- మొహమ్మద్ ఎల్ఫర్, MD, MSc, FACS, FCCM Plastic and Reconstructive Surgeon, న్యూయార్క్ నగరం, న్యూయార్క్
- తారిక్ గౌడ, RN, AACN Critical Care Nurse, శాన్ డియాగో, కాలిఫోర్నియా
- హిషం ఖందీల్, MD Cardiothoracic Surgeon, లాన్సింగ్, మిషిగాన్
- హీనా సయ్యద్, MD Internal Medicine and Geriatric Medicine physician, కాలేజ్ పార్క్, మేరీ ల్యాండ్
- అమ్మార్ ఘానెం, MD, FCCP Pulmonary and Critical Care Intensivist, లాన్సింగ్, మిషిగాన్
- అమన్ ఓడె, MBBS, FAAP Pediatrician, ఆస్టిన్, టెక్సాస్
- తాహెర్ డైఫల్లా, DDS, FACS Oral and Maxillofacial Surgeon, కాన్సాస్ నగరం, మిసోరి
- ఎం ఉమర్ బర్నీ, MD, MBA, FAAOS Orthopedic Surgeon, డాలస్, టెక్సాస్
- తామీ అబుఘనియం, MD Emergency Medicine Physician, షికాగో, ఇల్లినాయిస్
- యూసుఫ్ ఖెల్ఫా, MD, FACP Hematologist and Oncologist, సొనొరా, కాలిఫోర్నియా
- ధియా దావూద్, MD, MSC, FACEP Emergency Medicine Physician, ఇండియన్ రివర్, ఫ్లోరిడా
- జేనా సలేహ్, MD General Surgery Resident, క్యామ్డెన్, న్యూజెర్సీ
- బిలాల్ హుసేన్ పిరాచా, MD, MS Emergency Medicine Physician, డాలస్, టెక్సాస్
- కరీం ఫిర్కీ, MD Anesthesiologist and Critical Care Intensivist, బర్లింగ్టన్, మసాచుసెట్స్
- రామిన్ పిరౌజ్, MD, JD Pulmonary and Critical Care Intensivist, ఫ్రెడెరిక్, మేరీ ల్యాండ్
- ఖాలిద్ జె సలేహ్, MD, MPH, MHCM, FRCS, CPE, FAAOS Orthopedic Surgeon, డెట్రాయిట్, మిషిగాన్
- యాసర్ ఆరైన్, MD, FAAP Neonatologist, డాలస్, టెక్సాస్
- ఉస్మాన్ షా, MD Pulmonary and Critical Care Intensivist, ఆరెంజ్ కంట్రి, కాలిఫోర్నియా
- ఆమేర్ అఫానే, MD, FACS Trauma, Acute Care, Critical Care, and General Surgeon, టోలేడో, ఒహాయో
- మొహమ్మద్ సుబేహ్, MD, MS Emergency Medicine Physician and Ultrasound Specialist, మౌంట్ వ్యూ, కాలిఫోర్నియా
- ఒమర్ ఇస్మాయిల్, MD, FACS Trauma, Acute Care, Critical Care, and General Surgeon, డెస్ మొయినెస్, ఐయోవా
- మోహమద్ జి సభా, MD Family Medicine and Wound Care Physician, డాలస్, టెక్సాస్
- అబ్దల్ రహమాన్ అల్జెండి, MD Anesthesiologist, టోలేడో, ఒహాయో
- అహమద్ హస్సబెల్ నబీ, DO Emergency Medicine Physician, ఓర్లాండో, ఫ్లోరిడా
- మొహమ్మద్ అబ్దెల్ ఫతాహ్, MD Pulmonary and Critical Care Intensivist, లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియా
- ఇర్ఫాన్ గలారియా, MD, MBA Plastic and Reconstructive Surgeon, చాంటిలి, వర్జీనియా
- మొహమ్మద్ జె అల్ జగ్బీర్, MD, FCCP Pulmonary and Critical Care Intensivist, క్లీవ్ ల్యాండ్, ఒహాయో
- మొహమ్మద్ ఖలీల్, MD, MS Orthopedic and Spine Surgeon, ఫోర్ట్ వర్త్, టెక్సాస్
- వలీద్ సయీదామద్, MD, PhD Anesthesiologist, పార్క్ ల్యాండ్, ఫ్లోరిడా
- సల్మాన్ దస్తి, MD Anesthesiologist and Interventional Pain Specialist, సాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా
- బషర్ అల్ జి ఘౌల్, MD, FCCP Pulmonary and Critical Care Intensivist, గయిన్స్ విల్లె, ఫ్లోరిడా
- జొమాన అల్ హింటి, MD Neurologist and Movement Disorders Specialist, టోలేడో, ఒహాయో
- ఎన్దల్ ఫరా, MD Anesthesiologist, టోలేడో, ఒహాయో
- హలేహ్ షేక్ హొలెస్లామి, MD, FAAFP Family Medicine Physician and Integrative Medicine Specialist, మౌంట్ వ్యూ, కాలిఫోర్నియా
- తామెర్ హుసేన్, BSN Trauma and Emergency Nurse, బెడ్ ఫోర్డ్, మసాచుసెట్స్
- ఆలియా కట్టన్, MD Anesthesiologist and Critical Care Intensivist, న్యూపోర్ట్ బీచ్, కాలిఫోర్నియా
- అహమద్ యూసుఫ్, MD, MBA Internal Medicine Physician and Pediatrician, లిటిల్ రాక్, అర్కాన్సాస్
- సమీర్ ఖాన్, Cardiac Anesthesiologist and Critical Care Intensivist, న్యూపోర్ట్ బీచ్, కాలిఫోర్నియా
- అహమద్ ఎబీద్, MD Anesthesiologist and Pain Specialist, పోర్ట్ ల్యాండ్, ఓరెగాన్
- రసూల్ అబు నువార్, MD, FACS, FASMBS General, Advanced GI, Bariatric, Foregut Surgeon, and Surgical Endoscopist, బోస్టన్, మసాచుసెట్స్
- నదియా యూసుఫ్, MD Nephrologist, మోడెస్టో, కాలిఫోర్నియా
- అజీమ్ ఇలాహీ, MD Pulmonary and Critical Care Intensivist, చార్లొట్టే, నార్త్ కరోలినా
- హీనా చీమా, MD Obstetrician and Gynecologist, డాలస్, టెక్సాస్
- ఆసిఫ్ కాజీ, MD Otolaryngologist and Head and Neck Surgeon, లోమా లిండా, కాలిఫోర్నియా
- రాయిద్ ఒటూమ్, MSN, BSN, RN, CES-A ECMO and Vascular Access Nurse Specialist, వాషింగ్టన్ డి సి
- ఖ్వాజా నిమ్ర్ ఇక్రం, DO Orthopedic Surgeon, డాలస్, టెక్సాస్
- హసీబ్ ఖ్వాజా, MD Internal Medicine Physician, డెట్రాయిట్, మిషిగాన్
- కన్వల్ చౌదరి, MD Emergency Medicine Physician, న్యూయార్క్ నగరం, న్యూయార్క్
- మొహమ్మద్ హిషం నజీ, MD, FACS Anesthesiologist, వియన్నా, వర్జీనియా
- సయ్యద్ ఇర్ఫాన్ ఖాసిం అలీ, MD Anesthesiologist and Interventional Pain Specialist, డాలస్, టెక్సాస్
- జావద్ ఎ ఖాన్, MD, MPH Hand and Upper Extremity Surgeon, లేక్ ఫారెస్ట్, కాలిఫోర్నియా
- నబీల్ రాణా, MD General and Vascular Surgeon, చార్లొట్టే, నార్త్ కరోలినా
- అహరం అలీ, MD, MS Pediatric Critical Care intensivist, లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియా
- అబ్దల్లా అబు సలేహ్, RN, BSN Critical Care and Trauma Nurse, డెట్రాయిట్, మిషిగాన్
- అబ్దుల్లా బ్రౌన్, MD Anesthesiologist, హర్న్ డన్, వర్జీనియా
- సయ్యద్ ఎం సయీద్, MD, FACS Plastic and Reconstructive Surgeon, న్యూయార్క్ నగరం, న్యూయార్క్
- అబ్దుల్లా ఘలీ, MD Orthopedic Surgery Resident, హ్యూస్టన్, టెక్సాస్
- ఆయాజ్ పఠాన్, MD, MBA, FACEP Emergency Medicine Physician, రాలే, నార్త్ కరోలినా
- మహామూదా సయ్యద్, DO, MBA, FACEP Emergency Medicine Physician, సియాటిల్, వాషింగ్టన్
- మొహమ్మద్ జెడ్ రహమాన్, RN Critical Care Nurse, లాంగ్ వుడ్, ఫ్లోరిడా
- అమీర్ అబ్దెల్ గవాద్, MD, MBA Pediatric and Trauma Orthopedic Surgeon, బ్రూక్లిన్, న్యూయార్క్
- జియాబ్ సులైమాన్, DO, MS Orthopedic Surgeon, డెట్రాయిట్, మిషిగాన్\
- అలీ ఇలాయది, MD Orthopedic and Spine Surgeon, డాలస్, టెక్సాస్
- అహమద్ హుసేన్, MD, FACS Vascular Surgeon, లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియా
- బరా జుహైలి, MD, MPH, FACS, DFSVS, RPVI Vascular Surgeon, ఫ్లింట్, మిషిగాన్
***
- ఈ లేఖ ప్రతులను ఈ కింది వారికి పంపడమైనది :
- జాక్ సుల్లివాన్, జాతీయ భద్రతా సలహాదారు
- ఆంథోనీ బ్లింకేన్, Secretary of State
- సమంతా పవర్, Administrator, USAID
- సెనేటర్ బెంజమిన్ కార్డిన్, Chair, Senate Foreign Relations Committee
- సెనేటర్ జేమ్స్ రీస్చ్, Ranking Member, Senator Foreign Relations Committee
- కాంగ్రెస్ సభ్యులు మైకేల్ మాకౌల్, Chair, House Foreign Affairs Committee
- కాంగ్రెస్ సభ్యులు గ్రేగరి మీక్స్, Ranking Member, House Foreign Affairs Committee