ఇప్పుడక్కడ నీళ్ళు లేవు
నీళ్ళు ప్రకృతివరమనీ దాని పై అందరికి హక్కు ఉందని తెలియని వాళ్ళు
దాని ప్రవాహాన్ని ఆపారు
ఇప్పుడక్కడ విద్యుత్తు లేదు
చీకటి ని ప్రేమించి వెలుతురు ను ద్వేషించే వారు
దాని సరఫరాని నిలిపివేసారు
ఇప్పుడక్కడ ఒక గింజ ఆహారం లేదు
మనిషి ఆకలి మీద గౌరవం లేని వారు
పంటలను నాశనం చేశారు
ఇప్పుడక్కడ వైద్యం లేదు
మనిషి ప్రాణం విలువ తెలియని వారు
వైద్యాలయం పై బాంబులు వేశారు
ఇప్పుడక్కడ
నివసించడానికి అవసరమైన
దేశం లేదు!!
దేశ నాశనాన్ని
కోరుకునే యుధ్ధోన్మాదుల సృష్టించిన
స్మశానం తో పాటు
ఇప్పుడు అక్కడ ఆకాశం మాత్రం ఉంది
ఏమీ లేని వారు పంచుకోడానికి!
హా !
అక్కడ బాంబులకు భయపడని
బలమైన ఒక కాంక్ష కూడా ఉంది
శిధిల నిర్మాణాలను
తిరిగి పేర్చి
మళ్ళీ దేశాన్ని నిలబెడుతుంది!
చాలా మంచి పోయెమ్..