మూలం: మౌమితా ఆలం
మీరు బాబ్రీని ధ్వంసం చేసిన రోజు,
మీరేమీ ఒక ఙ్ఞానుడైన హకీమ్ ని చంపలేదు!
ఒక అద్భుతమైన, చారిత్రాత్మకమైన భవన నిర్మాణాన్ని కూడా కూల్చలేదు.
కనీసం ఒక భూమిని, ఒక జాతిని, ఒక దేశాన్ని చంపలేదు.
మీరు చంపింది మీ అమ్మనిరా కొడుకుల్లారా!
***
మేధో సంపన్నుడైన ఒక దళిత యువకుడు రాజ్యాంగం రచించినప్పుడు, ఒక తెలివైన ముస్లిం స్కూల్ పుస్తకాలు రాసినప్పుడు, మీ అమ్మ గర్వంగా, ఊపిరిలా శ్వాసించిన ఆత్మ విశ్వాసాన్ని, ప్రేమను చంపేసారు మీరు!
***
ఇక కుల, మత సంకెళ్లను చేధిస్తూ ఇద్దరి ఆత్మలు ప్రేమించుకున్నప్పుడు,
వారి ప్రేమపూర్వకమైన ముద్దుల్ని కదా మీరు చెరిపేసింది?
మీరు చేసేది ఇదే కదా?
***
‘అతను’ లేదా ‘ఆమే’ ‘వాళ్లు’గా మారినప్పుడు
మీ అమ్మ కళ్లలోని గొప్ప గర్వాన్ని, సంత్రుప్తిని
కదా మీరు చంపింది?
ఇక ఎప్పుడూ మందిర్ లేదా మస్జిద్ లలో మీరు ఓట్లు అడుక్కుంటునప్పుడల్లా
మీరు మీ అమ్మని హత్య చేసినట్లే!
***
అయినా ఆమెని చంపడం ఎప్పుడు ఆపారని అసలు? పైగా తరగతి గదుల్లో ఆమె కొడుకులని టెర్రరిస్ట్ అని పిలిచిన ప్రతీ సారీ మీరు ఆమెని చంపుతూనే ఉన్నారు!
***
డిసెంబర్ 6, 1992 న మాత్రమేనా ?
ప్రతీ రోజూ మీరు భరతమాతని హత్యచేస్తూనే ఉన్నారు.
ఎప్పుడురా మీరు ఈ మారణ హోమాన్ని ఆపేది?
ఎన్ని సార్లు చంపుతారు మీ అమ్మని?
భరతమాతని?
Excellent