ఎక్కిళ్ల శబ్దం

చీకటిని నింపుకున్న రాత్రి
మృత్యు కుహరంలా
శవాల వాసన
నెత్తురు వాసన

కరుణ లేని
చీకటి స్పర్శ

పౌర్ణమిని మింగిన చీకటి
నిరాశా దర్పణంలా ప్రతిబింబిస్తూ
ఉద్వేగాల ఎక్కిళ్ల శబ్దం

భయాల బలహీనతల
విశ్వరూపం
మృత్యువు వాసనతో..
**
ప్రతిసారి
ఆ పాదుల్లో
నా మనసు ఇరుక్కున్నప్పుడంతా
పచ్చపచ్చని నీ చేతులను
ప్రేమగా చాపుతావు, తెల్లగా నవ్వుతూ..

ఎంత బావుంటాయో కదూ
ఇష్టమైన ఆ క్షణాలన్నీ
పచ్చని, తెల్లని రంగులలో..

అయినా
అప్పుడప్పుడూ
కొంత నొప్పి
ఒక్కొక్క ఆకు, పువ్వు రాలుతూ
మూగగా చూస్తుంటే..

విడిపోతున్న ప్రతిసారి
కన్నీళ్ళు,
చీకటిని కప్పుకుంటుంటాయి.

నివాస ప్రాంతం కర్నూలు. కవయిత్రి, కథా రచయిత. వివిధ పత్రికల్లో కవిత్వం, కథలు ప్రచురితమయ్యాయి. రచనలు: 'రెప్పచాటు రాగం'(మొదటి కవితా సంపుటి).

4 thoughts on “ఎక్కిళ్ల శబ్దం

  1. ఒక్కొక్క ఆకు, పువ్వు రాలుతుంటే మూగగా చూస్తుంటే

  2. విడిపోతున్న ప్రతిసారి
    కన్నీళ్ళు,
    చీకటిని కప్పుకుంటుంటాయి. very nice expression…

Leave a Reply