భూమినంతా ఒలిచి
బొక్కసాలకెత్తుకున్నా చాలని
అజీర్తి వ్యాధి పీడితుడు వాడు
మట్టిని, మనిషిని
చెట్టునూ, చెలిమెనూ
తరుముతూనే ఉన్నాడు
తొలుస్తూనే ఉన్నాడు
నెత్తుటి ఊటల మీద డోలలూగుతూనే
క్షుద్ర వృద్ధి మంత్రమై
మన విచ్ఛిన్న ఏమరుపాట్లను
ఆవహించ వస్తాడు
నీటిలో నాట్యమాడే చేపలను
పచ్చని వనాల్లో ఎర్రగా పూసే మన కలల్ని
మెత్తని శాంతి మొన మీద వధించినట్టే
క్షణం ఆదమరిచినా
పొలాల్లోకి, గూడాల్లోకి వస్తాడు
భ్రమల గడియల్ని బద్ధలు కొడుతూ
‘ఉరే’నియంతో వస్తాడు….
ఎక్కడికైనా వస్తాడు. తరిమే ద్దాం