అనువాదం : ఉదయమిత్ర
గాజాలో
ఏదీ జీవితం లా ఉండదు
చితికిన కలల మీద
సూర్యుడుదయిస్తాడు
సైరన్ల శబ్ధాలతో
మనుషులు మేల్కొంటారు
నిన్న టి చితాభస్మాలమీద
రేపటి భవనాలను నిర్మిస్తాం
లోపల వొణికి పోతూనె
బైటికి నిబ్బరంగా కనిపిస్తాం
లోపల భయం తిష్ట వేసినా
చిర్నవ్వుతో తుఫాన్ ను ఎదుర్కుంటాం
గాయాలెన్నయినా
మాత్రు భూమిని ప్రేమిస్తాం
జీవితం వంచించినా
దానిని ముద్దాడుతాం
పిల్లల నోట్ పుస్తకాలో
ఆశల్ని దాచుకుంటాం
కిటికీలు లేని గోడల మీద
భవిష్యత్తును చిత్రీక రిస్తాం
ఇక్కడ
చిన్న చిన్న ఆనందాలు సైతం
వాయిదా వేయ బడుతుంటాయి
కలలు
బైట విరిగిన గేటుకు వేలాడ బడుతుంటాయి
మేం బ్యాగుల్లో ఆకాంక్ష లు దాచుకు
ఆకాశంమీద
“మేం వొస్తాం” ..అని రాసుకుంటాం
బాధల నెదుర్కొంటూనే
శాంతికై ప్రార్థిస్తాం
సగం జీవితమే జీవిస్తాం
తక్కిన సగభాగం
ఓ అమరుడు,ఓ ఖైదీ,ఓ దూరపు కల
ఐనా సరే
మేం బతుకుతాం,ప్రేమిస్తాం ,కొనసాగుతాం
మేం గాజా వాసులం
ఇక్కడేదీ జీవితం లా ఉండదు