అవును
ఆమె చేతుల్లో ఏదో ఉంది
మాలిన్యం తెలియని మంచితనం కావచ్చు,
మనసు తెలిసి మసలుకునే లాలిత్యం కావచ్చు,
ప్రేమ తప్ప మరేమీ తెలియని అమాయకత్వం కావచ్చు!
చచ్చిపోతున్న మనిషిని బ్రతికించే పరసువేది ఆమె!
పెద్ద వృక్షం కనపడుతుంది కానీ దాని తాలూకు మూలమైన
ఆ చిన్న విత్తనం ఎప్పుడూ ఎవరికీ కనపడనట్లు..
నిటారుగా నిర్భీతిగా, చైతన్య సమూహంలా కదిలే
అతడి వెనుక కనపడని అంతర్భాగం,
జీవ క్షేత్రం ఆమె!
పెళ్లికి ముందు కానీ,
పెళ్లి తర్వాత కానీ
సరిగ్గా చూడనైనా లేదు విస్తారంగా మాట్లాడనైనా లేదు.
తెలిసినా తెలియనట్లు తెలియకపోయినా తెలిసినట్లు కొంచెం తెలిసి,
కొంచెం తెలియనట్లు
కొంచెం తెలిసి,
చాలా తెలియనట్లు
అంతా తెలిసినట్లు,
అసలేమీ తెలియనట్లు
ఎప్పటికీ తెలుసుకోలేని
ప్రకృతి ఆమె.
ప్రేమ సంపూర్ణ స్వరూపం
ఆమె!
ఆమెను ప్రేమించడం అంటే ఆమెను గౌరవించటం.
ఆమెను ప్రేమించడం అంటే ఆమెతో కలిసి పనిచేయటం.
పడకగదిలో సర్వస్వం తానే అనుకునే మగాడు
వంటింట్లో సగం కాకూడదని
ఏ ధర్మం చెబుతోంది?
ఏ చట్టం చెబుతోంది?
కాసింత ప్రేమ
కళ్ళల్లో కనపడాలంటే ప్రపంచంలోకెల్లా మధురమైన రుచి కలిగించే ముద్దు ఒకటి ఇష్టంగా ఇవ్వాలంటే
రాత్రే కాదు,
పగలు కూడా అతడు
ఆమెతో ఉండాలి.
ఇచ్చినా తీసుకున్నా
ఇస్తూ తీసుకున్నా
తీసుకుంటూ ఇచ్చినా, ఎప్పుడూ మురిపెంగానే ఉండే ముద్దు ఆమె!
రాత్రెప్పుడో పడుకొని
తెల్లారక ముందే
ఆమె లేస్తున్నప్పుడు
ఆమె కన్నా ముందో,
ఆమెతోబాటో …
నిద్ర లేవడమే ప్రేమ.
కొన్ని ఇళ్లలో ప్రేమలు
తెల్లార గట్లా…
అట్లా… వంటింట్లో నుంచే మొదలవుతాయి.
నిజమైన ప్రేమకు అద్భుతమైన నిర్వచనం..!!👌🏼👌🏼👌🏼