వనరుల భాగ్యసీమ అయిన భారతదేశపు ఆదివాసీ ప్రాంతాలలో జరుగుతున్న చట్ట వ్యతిరేక హత్యలను, రాజ్య సైనికీకరణను ఆపివేయాలని ప్రపంచవ్యాపిత సంఘీభావ పిలుపు.
2025 నవంబర్ 18న భారత ప్రభుత్వం మూలవాసీ ఆదివాసీ కార్యకర్త, నక్సలైట్ నాయకుడైన హిడ్మా హత్యను విజయగర్వంతో ప్రకటించింది. ఆయనతోపాటు ఆయన జీవిత సహచరి కామ్రేడ్ మడకం రాజే, 11మంది ఇతరుల హత్య కూడా జరిగింది. భారతదేశంలో నక్సలైట్ ఉద్యమాన్ని 2026 మార్చి 31నాటికి తుదకంటా నిర్మూలిస్తానని కేంద్ర హోంశాఖా మంత్రి చేసిన ప్రకటనకు అనుగుణంగా తమ ప్రభుత్వం విజయవంతంగా పయనిస్తోందని ఈ సైనికపరపమైన “విజయం సందర్భంగా భాజపా ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఈ ప్రకటన ఆదివాసీలు, దళితులు, ముస్లింలు, క్రైస్తవులు ఇతర – సమూహాలను లక్ష్యంగా పెట్టుకుని భాజపా ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత విధానాలలో భాగమే. ప్రభుత్వానికి సన్నిహితంగా వున్న పెట్టుబడిదారులు భూమిని, సహజవనరులను స్వాధీనం చేసుకునే అవకాశాన్ని కల్పించడం కోసమే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తూంది.
ఈ ప్రకటనపై సంతకాలు చేసిన మేం ఆదివాసీ గ్రామీణ ప్రజలు, మానవ హక్కుల పరిరక్షకులు, భారత పౌరసమాజం పక్షాన నిర్ద్వంద్వంగా నిలబడతాం. హిడ్మాను, ఇతరులను వారు నిరాయుధులుగా వుండగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లాలో మారేడుమిల్లి అడవులలోకి తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళను చిత్రహింసలకు గురిచేసి, వాళ్ళను రెండు బృందాలుగా విడదీసి రెండురోజుల క్రమంలో చట్టవిరుద్ధంగా హత్య చేశారు. దీనికి కొద్దిగా ముందు చత్తీస్ ఘర్ ఉపముఖ్యమంత్రి మరియు హోం శాఖా మంత్రి బస్తర్ డివిజన్లోని సుక్మా జిల్లాలో హిడ్మా నివాసం వుండే పువర్తి గ్రామాన్ని ‘సందర్శించాడు. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా నాటకాలు ఆడడంలో భాగంగా వాళ్ళు హిడ్మా తల్లి మాడ్వి పొజ్జీ తో కలిసి భోజనం చేసి హిడ్మాను లొంగిపోవల్సిందిగా వత్తిడి చేయవల్సిందని ఆమెను కోరారు.
2024 జనవరి నుండి ప్రభుత్వం ఆదివాసీ ప్రజానీకాన్ని చట్ట వ్యతిరేకంగా హత్య చేస్తోంది. హత్య చేయబడుతున్నవాళ్ళలో నక్సలైట్ కార్యకర్తలతోపాటు సాధారణ ప్రజలు కూడా వున్నారు. ఇలా హత్యలు చేసినందుకు పారామిలటరీ పోలీసులకు ప్రభుత్వం బహుమతులు ప్రకటించింది. ఈ హత్యలు జరగడానికి ముందు వాళ్ళను నిర్బంధించి, చిత్రహింసలు పెట్టి వీటిని ఎదురుకాల్పుల సంఘటనలుగా ప్రభుత్వం చిత్రీకరిస్తోందని గ్రామస్తులు, పౌరసమాజం అనేక పర్యాయాలు గుర్తించాయి. సెప్టెంబర్ 2025వరకు హత్య చేయబడిన 550మంది పైగా ప్రజలలో గణనీయమైన సంఖ్యలో చనిపోయినవారు పర్యావరణానికి అనుకూలమైన, జీవ వైవిధ్యమున్న ఖనిజ వనరులున్న దక్షిణ చత్తీసఘర్ రాష్ట్రంలోని బస్తర్ డివిజన్లో అడవులతో కూడిన కొండ ప్రాంతాలకు చెందిన వాళ్ళు. ఈ ప్రాంతాలలో గోండులు, మరియాలు వంటి అనేక మూలవాసీ ఆదివాసీ సమూహాలు నివాసం వుంటున్నాయి.
ఒక్క 2024లోనే రిపోర్టు చేయబడిన “ఎన్ కౌంటర్లు 2023లో 68 జరగగా, 2024లో 121 జరిగాయనీ. హత్యలు 20 నుండి 217కు పెరిగాయనీ, అంటే 10% పెరుగుదల. ఈ వాస్తవాన్ని బస్తర్ పోలీస్ చర్యలు, మరియు ఫలితాల నివేదిక 2024-2025 వెల్లడి చేసింది. చాలా సందర్భాలలో తాము హత్యచేసిన ప్రజల శవాలను సైనిక బలగాలు అక్కడే పడవేసిన ఫలితంగా అవి కుళ్లి పురుగులమయంగా మారాయి. ఫలితంగా వాళ్ళ కుటుంబ సభ్యులు గుర్తించడం కూడా అసాధ్యమయ్యేది. కొన్ని సందర్భాలలో తాము నిర్బంధించి చిత్రహింసలు చేసామనే వాస్తవానికి సాక్ష్యం లేకుండా చేయడానికి, ఆ కామ్రేడ్ల అంతిమ యాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు రాకుండా అరికట్టడానికి బలగాలు కొన్ని శవాలను అక్కడే బలవంతంగా తగలబెట్టేవి. మాడ్వి హిడ్మా, మడకం రాజేల భౌతిక కాయాలను హిడ్మా స్వగ్రామమైన సుక్మా జిల్లాలోని పూర్వాటి గ్రామానికి అప్పచెప్పారు. అయితే చిత్రహింసల ఆధారాలను కనపడకుండా చేయడానికి వారిద్దరి భౌతికకాయాలను వెంటనే దహనం చేయాలని షరతు పెట్టారు. అయినా ఆ వీరుల పట్ల తమ గౌరవాన్ని ప్రకటించడానికి వేలాదిమంది ఆదివాసీలు హజరయ్యారు.
ప్రభుత్వం దేశంలోని నక్సలైట్లను రాజ్యేతర సాయుధ వ్యక్తులుగా పరిగణిస్తుంది. తాను చేస్తున్న విప్లవ ప్రతీఘాతుక చర్యలను అంతర్జాతీయ మానవతావాద చట్టానికి అనుగుణంగా వున్నదీ లేనిదీ ప్రకటించడం లేదు. ఈ విధంగా భారతదేశం జెనీవా కన్వెన్షైన్లోని 3వ నిబంధన మరియు అదనపు ప్రోటోకాల్ 2 ప్రకారం తనకున్న బాధ్యతల నుండి తప్పించుకుంటోంది. దీనికి బదులు నక్సలైట్లను బేషరతుగా లొంగిపోయేటట్లు చేయడానికి, వాళ్ళను తిరిగి వాళ్ళ సమూహంలో సమ్మిళితం చేయడానికి సంబంధించిన ఆంతరంగిక విధానాన్ని అనుసరిస్తున్నది. అందులో భాగంగా లొంగిపోయిన నక్సలైట్లను జిల్లా రిజర్వు గార్డ్ అనే పేరుతో బహిరంగంగానే సాయుధల్ని చేస్తోంది.
బస్తర్లోని నక్సలైట్ ఉద్యమం పునాదులు ఆ ప్రాంతంలోని మూలవాసీ ప్రజలపైన అమలవుతున్న సాంఘిక, రాజకీయ దోపిడీలో వున్నప్పటికీ ప్రభుత్వం రాజకీయ పరిష్కారాన్ని దాటవేస్తోంది. దేశంలోని మైనింగ్, పారిశ్రామిక కార్పొరేట్లు ను వనరుల వెలికితీతకు సంబంధించిన ప్రాంతంగా పరిగణిస్తున్నారు.
బస్తర్లోని నక్సలైట్ ఉద్యమం పునాదులు ఆ ప్రాంతంలోని మూలవాసీ ప్రజలపైన అమలవుతున్న సాంఘిక, రాజకీయ దోపిడీలో వున్నప్పటికీ ప్రభుత్వం రాజకీయ పరిష్కారాన్ని దాటవేస్తోంది. దేశంలోని మైనింగ్, పారిశ్రామిక కార్పొరేట్లు బస్తీర్ను వనరుల వెలికితీతకు సంబంధించిన ప్రాంతంగా పరిగణిస్తున్నారు. వాళ్ళ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరించదలచుకున్న ప్రభుత్వం, నక్సలైట్ల సమస్యను సామాజిక, ఆర్థిక సమస్యగా పరిగణిస్తే దానికి పరిష్కారంగా సామాజిక న్యాయాన్ని అమలుజరపాల్సి వస్తుంది కాబట్టి దాన్నుండి తప్పించుకోవడానికి ప్రభుత్వం ఇలా ప్రయత్నిస్తోంది. అలా చేయడానికి బదులు అది అనుసరిస్తున్న ‘బేషరతు లొంగుబాటు’’ లేదా ‘చంపబడడానికి సిద్ధంగా వుండడండి’ అనే బెదిరింపులు ఆదివాసీ సమూహం మీద మొత్తంగానే అమలుచేస్తోంది. కార్పొరేట్ల ప్రవేశాన్ని ప్రతిఘటిస్తున్న ఆ ఉద్యమానికున్న ప్రజా మద్ధతును తగ్గించి దానిని ఏకాకి చేయడమనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ పనిచేస్తోంది.
బస్తర్లోని ఆదివాసీల జీవన పార్శ్వాలన్నింటినీ, వాళ్ళ జీవికను, సాయుధీకరణ చిన్నాభిన్నం చేస్తాం. నిరంతర నిఘా, కదలికలపై పరిమితులు, నిర్విచక్షణగా నిర్బంధిస్తామనే బెదిరింపులు, చట్ట విరుద్ధమైన హత్యలు, లైంగిక హింసల రూపంలో ఇది కొనసాగుతోంది. సాయుధ సైనిక బలగాలు చేస్తున్న మానవహక్కుల ఉల్లంఘనకు తోడు ప్రభుత్వంలోని కార్యనిర్వాహక వర్గం, శాసనసభ, న్యాయవ్యవస్థ కూడా వాటిని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం శాంతిని నెలకొల్పుతామని ప్రజలకు ఎప్పటికప్పుడు వాగ్ధానాలు చేస్తున్నప్పటికీ ఆ శాంతి ఎండమావిలాగా వున్నది.
గత రెండు దశాబ్దాలలో అనేక కార్పొరేట్లు చత్తీస్గర్ ప్రభుత్వంతో ఒడంబడికలు చేసుకొన్నాయి. దానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియలో రాజ్యాంగం, చట్టాలు కల్పించిన రక్షణలను ఉల్లంఘిస్తున్నాయి. అంతేకాక అంతర్జాతీయంగా వున్న ఎఫ్.పి.ఐ.సి ప్రమాణాలకు వ్యతిరేకంగా వున్నాయి. షియోనాథ్ వంటి నదులను కూడా ప్రైవేటు కంపెనీలకు అమ్మివేశారు. 2022–2023లో చత్తీసఘర్ ప్రభుత్వానికి గనుల ద్వారా 12,941కోట్లు ఆదాయం లభించింది. ఇందులో దాదాపు సగభాగం బస్తర్లోని దంతెవాడ జిల్లా నుండి వచ్చింది. అయినా, చత్తీస్గర్లోని ఆదివాసీలు భారత ప్రజలలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నారు. బస్తర్లోని ఏడు జిల్లాలోనూ అక్షరాస్యత, ఆరోగ్యంతో సహా అన్ని మానవ అభివృద్ధి సూచికలు దేశంలో అత్యంత కనిష్ఠంగా వున్నాయి.
రాజ్యం, కార్పొరేట్ల సంపద ఎప్పటికప్పుడు పెరిగిపోతూ మూలవాసీల ఉనికే ప్రమాదంలో పడిన ఈ నేపథ్యంలో బస్తర్ ఏజెన్సీ ప్రాంతం ఆదివాసీలు జరుపుతున్న సాంఘిక రాజకీయ పోరాటాలలో ప్రధాన కార్యక్షేత్రం అయింది. వాళ్ళు హింసతో కూడిన అభివృద్ధి అనే ప్రభుత్వ నమూనాను వ్యతిరేకిస్తున్నారు. ఆ నమూనా ఫలితంగా వాళ్ళకు న్యాయంమీద ఆధారపడిన శాంతిని కలిగించే అవకాశం లేదని వాళ్ళు తెలుసుకున్నారు. ఆ నమూనాలో భాగంగా ప్రభుత్వం తమ రాజ్యాంగబద్ధ హక్కుల అమలును నిర్లక్ష్యం చేసి, ఆ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా పోరాడుతున్న యువతను పనిగట్టుకుని ప్రత్యక్ష కార్యాచరణ నుండి దూరం చేస్తున్నారు. టెర్రరిస్టులనే ముద్రవేసి ఆదివాసీ యువ నాయకులను, కార్యకర్తలను నిర్విచక్షణగా నిర్బంధిస్తున్నారు. ఆదివాసీ ప్రాంతాలన్నింటా పెద్ద ఎత్తున సైన్యాన్ని కేంద్రీకరించారు.
ఈ విధంగా భారత ప్రభుత్వం ఒక పథకం ప్రకారం పెట్టుబడిదారీ ప్రయోజనాలకు అనుగుణంగా ఆదివాసీల భూమి హక్కును, మానవ, పౌర, రాజకీయ హక్కులను తుడిచిపెడుతోంది. భారత రాజ్యాంగంలోని 21వ నిబంధన మరియు భారత ప్రభుత్వం ఆమోదించిన అంతర్జాతీయ న్యాయానికి, చట్టాలకు భిన్నంగా గత రెండు దశాబ్దాలలో ఆ ప్రాంతంలో వున్న ప్రతి ప్రభుత్వం ఆదివాసీల జీవిస్తున్న హక్కును ఉల్లంఘిస్తూనే వున్నాయి.
భారత ప్రభుత్వం ఈ దిగువున పేర్కొన్న డిమాండ్లను తక్షణం అమలుపరిచేటట్లు పిలుపునివ్వాలని మేం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కోరుతున్నాం.
1. చట్ట వ్యతిరేక హ్యతలు, విచక్షణా రహితమైన నిర్బంధాలూ, చిత్రహింసలను మరియు బస్తర్లో సైనిక కేంద్రీకరణను నిలిపివేయాలి.
2. ఆపరేషన్ కగార్ పేరుతో మాడ్వి హిడ్మా, మడకం రాజేల హత్యతో సహా అన్ని చట్ట వ్యతిరేక హత్యలపైన స్వతంత్ర న్యాయ విచారణను ప్రారంభించాలి. వారుచేసిన చర్యలకు ప్రభుత్వ బలగాలను బాధ్యులను చేయాలి.
3. ఆదివాసీ సమూహాలతో రాజకీయ సంభాషణ జరపడానికి చొరవతీసుకోవాలి. రాజ్యాంగం వాళ్ళకు గ్యారంటీ చేసిన స్వయంప్రతిపత్తిని, భూమిపై హక్కులను, ప్రకృతి వనరులపై హక్కులను కాపాడడానికి సంబంధించిన డిమాండ్లపై చిత్తుశుద్ధితో చర్యలు తీసుకోవాలి.
- ఇన్సాఫ్ ఇండియా
- ఫోరమ్ ఎగైనెస్ట్ రిప్రెషన్ – తెలంగాణా
- బ్యాలెన్స్
- ఇండియన్ అలియన్స్, ప్యారిస్
- ఇండియా లేబర్ సాలిడారిటి (యు.కె)
- 12ఉమ్మా.కామ్
- ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ ముస్లిమ్స్, స్విట్జర్లాండ్
- ఇండియన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్, యు.కె.
- ఇండియన్ వర్కర్స్ అసోసియేషన్, గ్రేట్ బ్రిటన్
- ఏ.ఐ, జర్మనీ
- రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫ్రంట్ – వెస్ట్ బెంగాల్, ఇండియా
- సంగ్రామి శ్రామిక్ మంచ్ – వెస్ట్ బెంగాల్, ఇండియా
- సోలిఫాండ్స్, స్విట్జర్లాండ్
- ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్
- ఫ్రండ్స్ ఆఫ్ ఇండియన్ రివల్యూషన్, కెనడా
- తెలంగాణా విద్యావంతుల వేదిక, నార్త్ అమెరికా
- ‘నజరియా’ మ్యాగజైన్, ఇండియా
- బోస్టన్ సౌత్ ఏషియన్ కోయిలేషన్, యుఎస్ఏ
- సంగ్రామి క్రిషక్ మంచ్ – వెస్ట్ బెంగాల్, ఇండియా
- అలియన్స్ ఎగైనెస్ట్ ఇస్లామోపోబియా, ఆస్ట్రేలియా
- సౌత్ ఆసియా సాలిడారిటీ గ్రూప్, యు.కె.
- మద్దూర్ అధికార్ సంఘటన్, కుండ్లీ, సోనీపట్, ఇండియా
- లండన్ కలెక్టివ్ ఫర్ పాలస్తీనా, యు.కె.
- కోయిలేషన్ ఎగైనెస్ట్ ఫాసిజం ఇన్ ఇండియా
- ఇండియన్ నేషనలిస్ట్ మూమెంట్స్, వరంగల్
- ది హ్యూమనిజం ప్రాజెక్ట్, ఆస్ట్రేలియా
- ప్రోగ్రెసివ్ సౌత్ ఆసియా కలెక్టివ్ – పర్డ్యూ యూనివర్శిటీ, అమెరికా
- అదర్ ఇండియాస్
- రెసిస్ట్ యు.ఎస్. లెడ్ వార్, శాన్ ఫ్రాన్సిస్కో
- సౌత్ ఏషియన్ డయాస్పోరిక్ యాక్షన్ కలెక్టివ్, కెనడా
- ఇన్సూర్ అవర్ సర్వైవల్, యు.కె.
- ట్రాన్స్ఫారమ్ సౌత్ ఏషియా, ఇండియా
- మనీ రెబిలియన్, యు.కె.
- పాజిబుల్ ఫ్యూచర్స్, ఫిలిప్పీన్స్ / బ్రెజిల్
- సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ కన్సెన్స్, ఫిలిప్పీన్స్
- అమన్ మలుకు, ఇండోనేషియా
- రేషనల్ మెడిసిన్ నెట్వర్క్, ఇండియా
- విరసం
- యాక్షన్ ఆన్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్, కలకత్తా
- లాండ్ ఫోరమ్ ఇండియా
- ఇంటర్నేషనల్ ఇండీజినస్ పీపుల్స్ మూవ్మెంట్ ఫర్ సెల్ఫ్ డిటర్మినేషన్ అండ్ లిబరేషన్
- క్యాంపెయిన్ టు డిఫెండ్ నేచర్ అండ్ పీపుల్, ఇండియా
- నేషనల్ ఇండీజినస్ ఉమెన్ ఫోరమ్
- రాట్ కలెక్టివ్, యు.కె.
- జస్టిస్ ఫర్ ఆల్, కెనడా
- భగత్ సింగ్ ఛాత్ర ఏక్తామంచ్, ఢిల్లీ
- ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎడ్వకసీ ఆఫ్ బోర్నియా, ఇండోనేషియా
- కార్నర్ హౌస్, యు.కె.
- ఇంటర్నేషనల్ లీగ్ ఆఫ్ పీపుల్స్ స్ట్రగుల్, యు.కె.
- ఆర్.జె. వర్కింగ్, యు.కె.
- ఆక్స్ఫర్డ్ సౌత్ ఏషియన్ అంబేద్కర్ ఫోరమ్, యు.కె.
- ప్రిజనర్స్ వాయిస్ ప్లాట్ఫారమ్
- యునైటెడ్ ఫర్ క్లైమేట్ జస్టీస్, బ్రస్సెల్స్
- సైంటిస్ట్ రెబిలియన్, పెరూ
- సైంటిస్ట్ రెబిలియన్, ఇండియా
- యంగ్ స్ట్రగుల్, యూరప్
- ఎ.టి.యస్.హెచ్.ఇ.ఓ. – ఆస్ట్రేలియా
- కలికాసన్ పీపుల్స్ నెట్వర్క్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫిలిప్పీన్స్
- పీపుల్స్ రైజింగ్ ఫర్ క్లైమేట్ జస్టీస్
- ది ఆర్.వై.యస్.ఇ., యు.కె.
- మావోయిస్ట్ ఇంటర్నేషనల్ స్టడీ గ్రూప్, షెఫీల్డ్
- ఇండీజినస్ పీపుల్స్ రైట్స్ ఇంటర్నేషనల్, ఫిలిప్పీన్స్
- వాల్సాల్ కోబర్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్, యు.కె.
- కింగ్స్ హెల్త్ యునైటెడ్ ఎగైనెస్ట్ రేసిజమ్, బర్మింగ్‌హామ్, యు.కె.
- సౌత్ ఏషియా జస్టిస్ క్యాంపెయిన్
- సలామ్ (సౌత్ ఏసియన్ లెఫ్ట్), న్యూయార్క్ సిటీ, యు.ఎస్.ఏ.
- ఫుడ్ నాట్ కాప్స్, బర్మింగ్‌హామ్, యు.కె.
- హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్, యు.కె.
- యూరోపియన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ అప్రెస్డ్ మైగ్రెంట్స్ (యూరప్-బేస్డ్ మైగ్రెంట్ ఆర్గనైజేషన్స్)
- పీపుల్స్ కోయిలేషన్ ఆన్ ఫుడ్ సావరెంటీ, గ్లోబల్
- పి.సి.ఆర్., ఉరూగ్వే
- సదరన్ ఇల్లినాయిస్ డెమోక్రటిక్ సోసలిస్ట్స్ ఆఫ్ అమెరికా
- గ్లోబల్ మెజారిటీ కాప్వాచ్
- యూనియన్ ప్రోలెటేరియన్ మార్క్సిస్ట్-లెనినిస్ట్, ఫ్రాన్స్
- ప్రోలెట్ కల్ట్, వెస్ట్ మిడ్లాండ్స్, యు.కె.
- పి.సి.యం.ఎల్. రిపబ్లిక్, డొమినికానా
- బర్మింగ్హమ్ క్వీర్స్ ఫర్ పాలస్తీనా
- యాంటీ ఇంపీరియలిస్టు ఫ్రంట్ – బ్రిటన్
- జె.సి.ఎ–నెట్ జపాన్
- వెల్‌బీయింగ్ ఎకనామిక్స్, బ్రైటన్, యునైటెడ్ కింగ్‌డమ్
- యునైటెడ్ ఫ్రంట్ అలయన్స్, యు.కె.
- అంబేద్కర్ బౌద్ధ ఆర్గనైజేషన్, బర్మింగ్హామ్, యు.కె.
- స్టోక్ పాలస్తీన్ సాలిడారిటీ క్యాంపెయిన్
- శ్రీ గురు రవిదాస్ సభ, డెర్బీ
- డాక్టర్ అంబేద్కర్ కమ్యూనిటీ సెంటర్, డెర్బీ