ఆకుపచ్చని స్తనం

మట్టిరేణువుల మధ్యన
ముఖం దాచుకున్నది
చల్లని చూపుల చేతులతో
మన పొట్ట తడమాలని
పాకులాడుతున్నది
రేపటి వెలుగు ఆశలు నేస్తూ
నేడు అక్కడ
నిశ్శబ్దంగా నిదురిస్తోంది
ఒక్క తడిపిలుపు కోసం
ఆత్రంగా వేచిచూస్తోంది
ఎవరూ తలుపు తట్టరే
ఒక్కరూ కనీసం
యధాలాపంగానైనా తొంగిచూడరే
ఎర్రకిరణాలవాడు రోజూ
పైపైన నడిచిపోతాడు
తెల్లజాబిలమ్మ ఎప్పట్లాగే
రాత్రులలో గస్తీ తిరుగుతుంటుంది
నిశ్శబ్దంగా దినాలు
దిగంతాలలోకి జారిపోతున్నాయి
ఎవరో నడిచిన పాదశబ్దాలను
మౌనంగా వింటూనే ఉంది
తన గురించి అసలు పట్టించుకోని
నేటిస్ధితిని కంటూనే ఉంది
తనువంతా మన కోసం
మొలకకలలను అద్దుకుంటూ
జాలిగా అడుగుతోంది
‘మేఘమా
నువ్వైనా చినుకుదేహమై
నన్ను కౌగిలించవా
పురిటికేక పెట్టి బాలింతనై
యావత్ ప్రపంచానికి
పాలుతాగించే
ఆకుపచ్చని స్తనాన్నవుతాను’

ఊరు విశాఖపట్నం. కవయిత్రి. కథలు, కవిత్వం, నవలలు చదవడం ఇష్టం. కవిత్వమంటే మరింత మక్కువ. వివిధ పత్రికల్లో కవిత్వం ప్రచురితమైంది. త్వరలో ఓ కవిత సంకలనం రానుంది.

8 thoughts on “ఆకుపచ్చని స్తనం

  1. మొలక కలలను అద్దుకుంటూ

    1. ధన్యవాదాలు సర్

  2. సృష్టి లో అన్నీ వాటంతట అవే జరిగిపోతూంటయి. కొంచెందృష్టి, కల్పన, భాష లాంటివి జోడిస్తే అవి పద్మావతి గారి కవితలవుతాయి. ఈ మొలక అగ్గిపుల్ల, సబ్బుబిళ్లా లాటివాటికి తీసిపోదు…..సుబ్రహ్మణ్యం.

    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు

    1. ధన్యవాదాలు సర్

    1. ధన్యవాదాలు సర్

Leave a Reply