మనమెప్పుడూ
నిశ్శబ్దంగానే
మాట్లాడుకుందాం
మౌనాన్ని
రెండు పెదవులతో బంధించి
కంటినిండా మాటలు నింపుకుని
చూపులతో
నిశ్శబ్దాన్ని పంచుకుందాం
ఇప్పుడు
మౌనమొక్కటే మాట్లాడగలదు
మౌనం పంచే
నిశ్శబ్దం ఒక్కటే
అర్థవంతమైన సంభాషణ కాగలదు
యే ఊపిరి
పలకని పలుకౌతుందో
యే కదలిక
సగంలో ఆగిపోయిన వాక్యమౌతుందో
యే స్పర్శ
అసంపూర్ణ సంభాషణ అవుతుందో
మాటల గరళాన్ని
మౌనంగా కంఠంలో ధరించిన వాడికే తెలుసు
బలవంతంగా నోరుమూయబడి
చీకటి వూచల్లో బంధించబడ్డవాడికే తెలుసు
మౌనమెంత ఆగ్రహంగా
విస్ఫోటనమౌతుందో
యే క్షణాలు విచ్ఛిన్నమై
కొత్త సమయాలెట్లా ఉద్భవిస్తాయో –
నిశ్శబ్దమే ఉనికైన వాళ్ళు
మాత్రమే చెప్పగలరు
కాలం జన్మరహస్యాలను
పోయమ్ బాగుంది సర్..💐💐
Thank you Harish
చాలా అర్ధవంతంగా ఈరోజు ఉన్న కష్టకాలం బగచెప్పారు గురూ.
“నిశ్శబ్దమే ఉనికైన వాళ్ళు
మాత్రమే చెప్పగలరు
కాలం జన్మరహస్యాలను
Thank you Guroojee
నిశ్శబ్దమే ఉనికైన వాళ్ళు
మాత్రమే చెప్పగలరు
కాలం జన్మరహస్యాలను
👍
భావాలన్నీ బలంగా చెప్పగలిగారు. కానీ అన్నీ కలగాపులగంగా కనిపించాయి. అదే భావ కవిత్వం అంటే 😐
Thank you
కవిత బాగుంది స్వామి
Thank you Vimalakka
చాల బావుంది సర్…
Thank you sir
Excellent anna
Thank you Anna
అంతే…
Thank you
Thank you for a powerful call to recognise the power of silence. Little do they realise that which they sought to stifle will one day explode.
Thank you Ambika