పల్లవి:
అందెశ్రీ అల్లిన
అక్షరాల పూలమాల
తెలంగాణ తల్లి మెడలోవేసి
పాడేము జయజయ హేళ
అందెశ్రీ కి జోహారులంటూ
తెలంగాణ తల్లికి జేజేలంటూ
||అందెశ్రీ||
చరణం 1)
సంక్షోభ సమరాల వేళా
సరిగమలు శాంతినిచ్చేలా
ఎండిన తెలంగాణ నేలా
సాహిత్య జగతి నేలేలా
నిప్పుల వాగొకటి నీ హృదయ జ్వాలా
పంటలై పండేల వెలుగులై నిండేలా
జోహారులంటూ పాడేమో నీకు
జయ జయ గీతాల వీడ్కోలు నీకు
||అందెశ్రీ||
చరణం 2)
పశువులను కాసిన వేళా
కాపరనుకుందామా నీలా
నాగలి దున్నేటి రైతులా
సేద్యగాడిని మరిచేలా
దుంకినా మత్తడిలో అక్షర గలగలలు
బింక మెరుగని మది వేస్తున్న చిందులు
జోహారులంటూ పాడేము నీకు
అరుణోదయాన వీడ్కోలు నీకు
అందెశ్రీ నీవెంట
జనకవుల సేన
మాయమే కాలేని
కళవైన తావునా
తెలంగాణ చరితలో తేజస్సువైనావు
జనమాగాణాల్లో మొలకలై పుడతావు