కవిత్వానికి హద్దులూ సరిహద్దులూ లేవు: స్వప్నా బెహ్రా

కొంతమంది ఉబుసుపోక కవిత్వం రాస్తారు, కొంతమంది సామాజిక స్పృహతో రాస్తారు. మరికొంతమంది కవిత్వంకోసం కవిత్వం రాస్తారు. కానీ కవుల్లో కొద్దిమంది మాత్రమే అన్నిరకాల కవితావస్తువులతో రాస్తూ తాము ఆస్వాదిస్తూ పాఠకులని ఆస్వాదింపచేస్తారు. వారిలో ఒడియా కవయిత్రి స్వప్నా బెహ్రా ఒకరు. స్వప్న కవిత్వం చదవటమంటే ప్రపంచాన్ని దగ్గరనుంచి చూడటం. స్వప్నని చదవటమంటే మన భారతీయాంగ్లకవులు ప్రపంచంలో ఏ స్థాయిలో ఉన్నారో అర్ధంచేసుకోవటం.

టాగోర్‌కి ముందూ, తర్వాతకూడా మన ఆంగ్లకవులని, మన సాహిత్యకారులని ప్రపంచం పక్కనబెట్టింది. కానీ ఈమధ్యకాలంలో భారతీయాంగ్ల కవులకి సముచిత స్థానమే ఇవ్వటం జరుగుతోంది. ఏ అంతర్జాతీయ వేదిక చూసినా మన దేశంనుంచి కనీసం ముగ్గురో నలుగురో కవులుంటున్నారు. వీరు తమ వాణిని గర్వంగా, గట్టిగా వినిపిస్తున్నారు. ఈ రోజు పలుదేశాలు మనకవులని సన్మానించటం వారినివారు గౌరవించుకోవటంగా భావిస్తున్నారు.

స్వప్నా బెహ్రా సమకాలీన త్రిభాషా కవయిత్రి, రచయిత్రి, అనువాదకురాలు. ఈమె జన్మస్థలం ఒడిషా. విశ్రాంత ఉపాధ్యాయురాలు. ఆంగ్లంలో, ఒరియాలో మరియు హిందీలో ఈమె చేసిన రచనలు పలు జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితం. ఈమె కవితలు అత్యధికంగా వివిధ విదేశీ భాషల్లోకి అనువదించబడ్డాయంటే అతిశయోక్తి కాదేమో! ఇప్పటివరకూ వివిధ సాహిత్యప్రక్రియల్లో పలు అంశాలపై ఆరు సంపుటాలను వెలువరించారు.

ఇప్పటివరకూ ఈమె అందుకున్న వివిధ పురస్కారాలు, గౌరవబిరుదులు:
కర్ణాటక తెలుగురచయితల సమాఖ్య ద్వారా మాతృభాషాదినోత్సవ పురస్కారం (2019),
గుజరాత్ సాహిత్య అకాడెమీ పురస్కారం (2019),
ప్రతిష్టాత్మక అంతర్జాతీయ భారత్ పురస్కారం (2015),
సాహిత్య శిరోమణి పురస్కారం (2016),
అటల్ బిహారి వాజ్‌పేయీ పురస్కారం (2016) : ఇవి భారతదేశంలో ఆమె అందుకున్న పురస్కారాల్లో కొన్ని మాత్రమే.

ఇక అంతర్జాతీయ వేదికలపై ఆమెని సన్మానించుకున్నవి ఇలా–
The Enchanting Muse Award in India World Poetree Festival (2017),
World Icon of Peace Award (2017),
The Pentasi B World Fellow Poet (2017)
Global Literature Guardian Award,
International Life Time Achievement Award,
Master of Creative Impulse Award

ఇవేకాక సెషెల్స్ ప్రభుత్వం ఈమెని భారతదేశపు ప్రతిభాశీలుర రచయిత్రిగా గౌరవ పురస్కారం, అల్జీరియా, మొరాకో, ఖజకిస్తాన్ దేశాలనుంచీ గౌరవ ప్రతిభాపురస్కారాలు ఆమె కవితా పాఠవాలకు నిదర్శనం. స్వప్నా బెహ్రా ఒడిషా ప్రభుత్వ పర్యావరణ సమాజంలో జీవితకాల సభ్యురాలు. “కన్నీళ్ళని వినండి” అనే ధర్మసూత్రంగ పనిచేసే ఈమె ఒక సామాజిక కార్యకర్త. ఇలా చెప్పుకుంటూపోతే ఈ కాలం అంతా ఆమె అందుకున్న అవార్డులూ రివార్డులతోనే నిండే అవకాశం ఉంది.

ఈమె ఆంగ్లంలో రాసిన ఓ కవిత “A Night in the Refugee Camp” 65 భాషల్లోకి అనువదింపబడిందంటే ఆ కవిత ప్రపంచాన్ని ఎంతలా కదిలించిందో అర్ధంచేసుకోగలగాలి. ఆ అనువాదాలన్నింటితో ఆమె ఒక సంపుటిని తీసుకొచ్చారు. ఈ సంపుటికి నేను ముందుమాట రాయటం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈమె కవితలని చదివేముందు వీరితో జరిపిన ఇంటర్వ్యూ చూద్దాం.

  1. మీరెందుకు రాయాలనుకున్నారు? రాయటానికి ప్రేరణ?

ఊపిరితీయాలన్న కోర్కె ఎంత బలమైనదో రాయాలన్న ఆవేశం కూడా అంతే. నేను ఒంటరిగా ఉన్నప్పుడో, ట్రాఫిక్ జాం లో ఇరుక్కున్నప్పుడో పదాలు నాపై వర్షంలా కురుస్తాయి. అంతర్లీనంగా నాలో ఉన్న భావావేశాలని అవి పైకితెస్తాయి. ఉపాధ్యాయ వృత్తినుంచి నేను రిటైర్ అయ్యాకనే నేను ఫేస్‌బుక్ వేదికగా రాయటం మొదలుపెట్టాను. అదీ 2015 లో. 2016 లో “The Heritage of the Lord” అన్న శీర్షికతో ఆంగ్లంలో ఓ కవిత రాసాను. అదేరోజు అమెరికాకు చెందిన ప్రముఖ కవీ, కళాకారుడు, సంగీతకారుడు ఆ కవిత చదివి వెంటనే నన్ను సంప్రదించి త్వరలో తను ప్రచురించబోయే కవితా సంకలనం “Tomb of Words” ప్రచురణకు అనుమతించాల్సిందిగ కోరారు. అదే నా జీవితంలో టర్నింగ్ పాయింట్. మన జీవితంలో జరిగే ప్రతీది దైవసంకల్పితమని నా నమ్మకం.

  1. కవిత్వం ద్వారా సమాజానికి ఒరిగే ప్రయోజనలేమైనా ఉన్నాయా?

సమాజానికి ప్రత్యక్షంగా ఒనగూడే ఉపయోగాలకంటే పరోక్షంగా చాలా మంచే జరుగుతుందని నా నమ్మకం. కవిత్వానికి హద్దులూ సరిహద్దులూ లేవు. అది జాతి, మత, కుల వర్ణ వివక్షలకతీతంగా ప్రయాణిస్తుంది. అది కోటానుకోట్ల భావప్రకటనల భాండాగారం. కవిత్వం గాలిలో ఎగిరే పుప్పొడిరేణువుల్లాంటిది. అప్పుడే పుట్టిన పాపాయికి తల్లిపాలలాంటిది. రైతుకి తొలకరి జల్లులాంటిది. దేహానికి పైన చెప్పిన కొన్ని అవసరాలు ఎంత తృప్తి నిస్తాయో కవిత్వం మనసుకి అంతే అవసరం. కాబట్టి కవిత్వం మాత్రమే భౌగోళిక హద్దులని చెరిపేసే సాధనం. ఈ విధంగా కవిత్వానికి తప్పకుండా సామాజిక ప్రయోజనం చాలానే ఉంది.

  1. మీరు మీ మనసుకు నచ్చినట్టుగా రాస్తారా లేక పాఠకులకి ఏం నచ్చుతుందో అది మాత్రమే రాయటానికి ఇష్టపడతారా?

కవిత్వం కానీ కథ కానీ రాయటం ఓ అప్రయత్నసిధ్ధ పరిక్రమ నాకు. పాఠకులకోసమో మరిదేనికోసమో రాయటం జరగదు. నా రాతలు పూర్తిగా స్వతంత్రం. సామాజిక అంశాలైన మానభంగం, త్రాగునీటిలేమి, పేదరికం, హింస, దౌర్జన్యం నన్ను కదిలించే విషయాలు. ఈ సందర్భాలలో నా అంతర్ఘోషకి అక్షరరూపం కల్పించటమే నా ధ్యేయం. నేను ఈ సమాజపు మనిషిని. సమాజం పట్ల నా బాధ్యత మాత్రమే నాచేత రాయిస్తుంది.

A Night in the Refugee Camp

In the refugee camp of Afghanistan
Scorching days of ‘No Water’
Desperate queue of hours hue
Only a bucket per a tent

Lusty eyes of the guard
Craving gesture of all horror
Precondition placed by him
An extra bucket; come for a night

Never a night but explosive fight
Never comes the dawn or peeps the Sun
Shahnaz a girl of fourteen
Awake whole night in a fix
in her tent a bucket for six!
Those five days she needs water more

Restless Shahnaj makes a deal
Better to be the Begum of the guard
Instead of burning every second
Can bathe and wash all her parts

Monthly these days will be stress-free
So what the guard above sixty
Certainly water beyond all needs

Fourteen year Shahnaz chooses the path
Walks to the guard slowly and slowly
“Uncle, will you marry me?”

శరణార్థుల శిబిరంలో ఓ రాత్రి
(ఒడియా మూలం : స్వప్నా బెహెరా
అనువాదం : ఆశుతోష్ పాత్రొ)

ఆఫ్ఘనిస్థాన్‌ శరణార్థుల శిబిరంలో
నీటి ఎద్దడి
ఎపుడు ఉండేదే.
నీటికోసం పొడవాటి లైన్‌లో పడిగాపులు
దొరికే నీళ్ళు డేరాకి ఒక్క బకెట్ మాత్రమే

మీసాల కాపలావాడి కళ్లల్లో సూర్యుడి తాపం
కాల్చి బూడిద చేసేసే కనుసైగ
వాడు పెట్టిన షరతు-
ఓ రాత్రి పక్కలో చేరితే ఓ బాల్టీ నీళ్ళు

అది రాత్రి కాదు, కాలుడి తాపం
ఇంకా తెల్లారలేదు
శరణార్థుల శిబిరంలో అసలు తెల్లారదు
ఋతుక్రమంలో ఉన్న శహనాజ్‌కి మరుగంటూ లేదు
అబ్బూ అమ్మీతో సహా ఆరు ప్రాణాలు ఆ డేరాలో…

శహనాజ్ కంటికి నిదుర లేదు
ప్రతిరోజు కాపలాదారు కళ్లల్లో
రగులుతున్న సెగలో
మాడిపోయే బదులు
వాడికి పెళ్ళామైపోవడం మేలు కదా

రోజూ హమ్మామ్‌లో హాయిగా స్నానమాడొచ్చు
నెలసరి రోజుల్లో ఫికరుండదు
ఒళ్ళు శుభ్రం చేసుకోవొచ్చు
మీసాల కాపలాదారు వయసు అరవై ఐతేనేం…
నీళ్లకన్న జరూరు ఇంకేముంటుంది?

పద్నాలుగేళ్ళ రజస్వల శహనాజ్ పాదాలు
నెమ్మదిగ కదిలాయి కాపలావాడి డేరా వైపుగా…
“చాచా నన్ను పెళ్లిచేసుకుంటావా?”

No Chair is Vacant

the sky is the endless version of a celebration
don’t ever think to tie a horizon in its clouds

the sea is never erased
melodies are canvas
don’t put the hash tag of your name on it

the air is restless in open balconies
the virus peeping here and there

poison spreads in the arteries and veins of the soil
every plant needs oxygen beyond the polythene

someone spreads tears on the fire zone of the pyres
who conspires?
five elements are at stake

you are just a dot in the cosmic range
a dot needs no chair to establish the citizenship
a dot shines, makes the painting

you are just a dot dear
clean the hardware and glaze the dot
for a dot can be a Sun
a sun needs no chair
because it plays no hide and seek

you are a copious dream
reflecting every soul and investing your energy
no chair is vacant
in fact you don’t need a chair to establish yourself
your journey is your identity…
not your chair!

విశాఖలో పుట్టి అక్కడే డాక్టరేట్ వరకూ చదివి ఆపై విదేశాల్లో వివిధ యూనివర్శిటీల్లో పనిచేసి ఇప్పుడు బెంగ్లూరు లో స్థిరపడి ఇక్కడ ఫ్రీలాన్సర్ గా పనిచేస్తున్నారు. రోజంతా పాఠం చెప్పటం... రాత్రైతే ఏదో రాసుకోవటం లాంటివి చేస్తుంటానంటారు. కవిత్వం అంటే ఇష్టం. కవిత్వం గురించిన చర్చలు కూడా ఇష్టమే.

Leave a Reply