స్త్రీల అందాల పోటీయా? సాహసాలు లూఠీయా?

ఈ హైద్రాబాదు నగరమందు అందాల పోటీయా
వీరనారి ఐలమ్మల సాహసాల లూఠీయా
అడుగుదాం ఆడమగలు అంతా ఒక్కటై
ఆపుదాం అపరాదపు చీకటిపై నిప్పులై
ఆడదంటె అలుసని
అంగడీ బొమ్మని
మాతృస్వామ్య విలువనీ
పితృస్వామ్య బలిమిని
అమ్ముతున్నావా అందాల పోటీలో
అర్ధనగ్న శరీరాలు వేలం పాటలో
అనుపల్లవి : Dont need Miss World
Why not Merit world
Dont make commodity
Show first humanity

  1. కాకిపిల్ల కాకికే ముద్దనే
    లోకరీతినిక్కడ మార్చివేస్తరా
    శ్రమైక్య జీవుల జీవుల సౌందర్యము
    అందాల పోటీలో ఖూనీ చేస్తరా?
    పాలిచ్చి పెంచే తల్లికే వెలగడ్తావా?
    జన్మనిచ్చినందుకిలా పగబడ్తవా?

అనుపల్లవి : ఏదిరా అందమూ
ఎవరికి సంబంధమూ
ఆడమగ కూడితేనె
అందాల ప్రపంచమూ
||Dont need Miss World||

  1. రంగురూపు ఒక్కటే కాదని
    తెల్సికూడ మూసబోసి పోతబోస్తరా
    సంకెళ్లు తెంచుకున్న వనితను
    అంతరిక్షమెళ్లినా అందాలు చూస్తరా
    ధారబోసిన చెమటకీడ పేరేలేదా
    వీరత్వం శూరత్వం పనికేరాదా

అనుపల్లవి : ఏదిరా అందమూ
ఎవరికి సంబంధమూ
కోట్లు తగులబెడ్తమూ
పాట్లు బడుతుంటమూ
||Dont need Miss World||

  1. తరతరాల ల చరిత్రను
    అందాలలోన బంధించే పోటీ ఎవరికి
    కాస్మొటిక్ రంగుల మార్కెట్టును
    వాటాలు పంచుకునే లాభమెవరికి
    నిలదీసి అడుగుదాము ప్రపంచమెవరిదో
    ఆకలిని జయించగా అందాలు ఎందుకో

అనుపల్లవి : ఏదిరా అందమూ
ఎవరికి సంబంధమూ
శ్రమజీవులకేమో
మనుగడ పోరాటమూ
Dont need Miss World
Why not Merit world
Dont make commodity
Show first humanity

ఆడదంటె అలుసా అబలకాదు తెలుసా?
ఆపుదాం అందాల పోటీని
చాటుదాం మహిళా శక్తిని

**

పుట్టింది కరీంనగర్ జిల్లా వేములవాడ. కవి, రచయిత, గాయకుడు. విప్లవోద్యమ నాయకుడు. అసలు పేరు కూర దేవేందర్. కలం పేరు మిత్ర. అమర్ పేరుతో సీపీఐ(ఎం.ఎల్.) జనశక్తి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. రచనలు : 1. మిత్ర తెలంగాణ పాటలు, 2. పొదుగు, 3. వరుపు, 4. మిత్ర జనం పాటల సవ్వడి (పాటలు); 5. చితాభస్మంలోంచి...(కవిత్వం); 6. తెలంగాణ డప్పు దరువు, 7. తెలంగాణ ధూం ధాం, 8. తెలంగాణ కోలాటం పాట, 9. ముంబై తెలంగాణం, 10. బహుజన బతుకమ్మ, 11. వీరతెలంగాణ (నృత్యరూప గానాలు).

One thought on “స్త్రీల అందాల పోటీయా? సాహసాలు లూఠీయా?

Leave a Reply