కవిత్వం ఆత్మజ్ఞానానికి మార్గంగా అనిపిస్తుంది: సీనా శ్రీవల్సన్

కేరళ రాష్ట్రం కేవలం అక్షరాస్యతకు మాత్రమే ప్రసిధ్ధి కాదు. కవులకీ, కళాకారులకీ కూడా పేరెన్నికగన్నదే. ఈ రోజు ఒక ప్రముఖ వ్యక్తి గురించి తెల్సుకుందాం. గుంటూరులో జరిగిన అంతర్జాతీయ కవిసమ్మేళనంలో నాతో పాటు పాల్గొని కవితాపఠనంలో నా ముందు తన కవిత చదివి వినిపించారు శ్రీమతి సీనా శ్రీవల్సన్. ఆమె చదివిన కవిత విని ఆనందిస్తుండగానే ఆమె మళ్ళీ వేదికపై ప్రత్యక్షమయ్యారు. ఈసారి కవిత చదవటానికి కాదు. కేరళ శాస్త్రీయ నాట్యప్రదర్శనకు గానూ ఆమె పేరు ప్రకటించారు. ఒక గంటసేపు ప్రేక్షకులని తన నాట్యంతో మంత్రముగ్ధులని చేసారు సీనా. సీనా ద్విభాషా కవయిత్రి, అనువాదకురాలు, సంపాదకురాలు. వీరి కవితలు దేశంలోను, విదేశాల్లోని అన్ని ప్రముఖ పత్రీకల్లోను ప్రచురితం. ఆమె రెండు అంతర్జాతీయ కవితాసంకలనాలకు సంపాదకత్వం వహించి ప్రచురించారు. 2019 మరియు 2020 లో రెండు పొయిట్రీ ఫెస్టివల్స్‌ను నిర్వహించారు. వీరు మళయాళంలో ప్రచురించిన తొలి సంకలనానికే ‘పూంతనం యువ సాహిత్య పురస్కారం’ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె కేరళలోని జీపీ కాలేజీలో ఆంగ్లభాషలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

సీనా తో జరిపిన ఇంటర్వ్యూలోని కొంతభాగం…

రాయటం మిమ్మల్ని ఉత్తేజితులని చేస్తుందా లేక రాస్తున్నప్పుడు ఓ స్థితిలో నిస్సత్తువగా అనిపిస్తుందా?

కవిత్వం కానీ ప్రక్రియ ఏదైనా రాస్తున్నప్పుడు నన్నెప్పుడూ తీవ్రంగా ఉత్తేజితులను చేస్తుంది. ఇంకా రాయాలనే ఉంటుంది. విపరీతమైన మానసిక ఒత్తిడికి గురైనప్పుడల్లా కవిత్వంలో సేదతీరుతున్నట్లుగా ఉంటుంది. నా మూడ్ స్వింగ్స్ నుంచి నన్ను బయటపడేసేది కవిత్వమే.

మిమ్మల్ని విపరీతంగా ప్రభావితం చేసిన మొదటిపుస్తకం?

ఒకటని చెప్పలేను. చాలా ప్రభావితం చేసాయి. కానీ నేను తొమ్మిదోతరగతి చదువుతున్నప్పుడు మా సిలబస్‌లో ఉన్న ఊర్మిళ కావ్యం నన్ను తీవ్రంగా కదిలించింది. అయోధ్యలోని ఊర్మిళ ఒంటరితనం నన్ను చాలా ఆలోచింపచేసింది. ఆమె మనోభావాలు, సున్నిత భావోద్రేకాలని వర్ణించిన తీరు, ఆ భాషా నన్ను ఎక్కువగా చదివింపచేసాయి. నాకిప్పటికీ ఆ కావ్యంలోని వాక్యాలు జ్ఞాపకమే.

మీ అనుభవంలో రచనా వ్యాసంగం ఎలాంటి కార్యం అనిపిస్తుంది?

ఏ భాషలోనైనా సాహిత్యంలో ఏ ప్రక్రియ ఐనా రచన ఒక పరమార్థికమైన, పరలౌకికమైన చర్యగా అనిపిస్తుంది. రచన ఒక ధ్యానం. ఆత్మజ్ఞానానికి ఒకమార్గంగా అనిపిస్తుంది కూడా. బహుశా ఇంత సహనం అవసరమైన కళారూపం మరొకటి ఉందని అనుకోను. నాట్యకళని అభ్యసించిన వ్యక్తిగా నావి ధృడమైన అభిప్రాయాలు కవిత్వం గురించి.

Poems by Seena Sreevalson

When My Hair Caught Fire

Was it when you scornfully laughed
Or licked with your eyes
I don’t remember
The volcano spouted smoke.

But when I realized your lecherous words,
Those thirsty arms and greedy eyes
Orbiting me
My volcano erupted.
The wounded soul gushed out
Burning flames washed the pain
Tongues of blaze swallowed the inhibitions
Then
You and your words are nothing
But a scar cursed never to fade.

***

Mysterious Journey

What do you know about
The peak of my utmost happiness?
Have you seen my glittering eyes
While seeing the sun lighting Hill top
That spreads fire on the earth?
Have you heard the cymbal beats in my heart
While watching the sparrows sharing their love?
On those starry nights when flowers bloom
Have you noticed
My vibrating fingers
While stringing the flowers?
Have you detected my throbbing breast
While putting my little princess to sleep
With sweet never ending lullaby?
After those seven days of mood swing
When I resurrect and Bloom
I have seen your unbelievable eyes
Longing towards me.
You are immune to my diversity.
The peak of my utmost happiness
Don’t try to drag me into an umbrella
That Shades nothing but your Madness.

***

మార్మిక ప్రయాణం
(అనుసృజన : వాసుదేవ్)

నాకు అత్యంత ఆనందాన్నిచ్చేది
ఏంటో తెల్సా?
పర్వతసానువుల్ని వెలిగించే సూర్యకాంతి భూమండలాన్ని మండిస్తున్నప్పుడు
నా మెరిసేకళ్ళెప్పుడైనా చూసావా?
పిచ్చుకలు తమప్రేమను తమలోతామే పంచుకుంటునప్పుడు
నాగుండె లయల తాళం విన్నావా?
చుక్కలు పరుచుకున్న నిశిరాత్రిలో
పూబంతులను సుతారంగా మీటుతున్న
సన్నగా వణికే నా చేతివ్రేళ్ళనెప్పుడైనా చూసావా?
నాచిన్నారి రాకుమారిని జోలపాటతో
నిద్రపుచ్చుతున్నప్పుడు నాగుండె లబ్‌డబ్‌లెప్పుడైనా విన్నావా?
ఆ ఏడురోజుల నా మానసికావస్థనుంచి నేను పునరుజ్జీవం పొంది వికసించినప్పుడు
నన్ను పొందాలనే
నీ నమ్మలేని చూపులను చూసాను.
నాలోని వైవిధ్యానికి నువ్వు అలవాటుపడ్డావు
అదే నా అత్యంత ఆనందానికి పరాకాష్ట
నీ పిచ్చితనపు గొడుగుకిందకు నన్ను లాగాలని చూడకు.

విశాఖలో పుట్టి అక్కడే డాక్టరేట్ వరకూ చదివి ఆపై విదేశాల్లో వివిధ యూనివర్శిటీల్లో పనిచేసి ఇప్పుడు బెంగ్లూరు లో స్థిరపడి ఇక్కడ ఫ్రీలాన్సర్ గా పనిచేస్తున్నారు. రోజంతా పాఠం చెప్పటం... రాత్రైతే ఏదో రాసుకోవటం లాంటివి చేస్తుంటానంటారు. కవిత్వం అంటే ఇష్టం. కవిత్వం గురించిన చర్చలు కూడా ఇష్టమే.

2 thoughts on “కవిత్వం ఆత్మజ్ఞానానికి మార్గంగా అనిపిస్తుంది: సీనా శ్రీవల్సన్

  1. మంచి ఇంటర్వ్యూ అంతకుమించిన అనువాదం

Leave a Reply