శ్రీకళా పి. విజయన్

భాషపై మక్కువ ఎంతపనైనా చేయిస్తుందనుకుంటా. పేరుకి సైన్స్ టీచర్ అయినా ఆంగ్ల భాషపై అధికారం సాధించి పూర్తి పధ్ధతిగా, ఎండ్ రైంస్ తో రాయటమే కాకుండా పదునైన ప్రతీకలతో, అలంకారాలతో కవిత్వాన్ని ఆస్వాదించిమరీ రాస్తుంటారు శ్రీమతి శ్రీకళా పి. విజయన్. ఆమె కవిత్వాన్ని చదవటం అంటే చిన్నప్పుడు స్కూల్లో మనం నేర్చుకున్న రైంస్ ని మళ్ళీ పునరావలోకనం చేసుకున్నట్లే.

మరొక మళయాళీ కవయిత్రిని మీకివాళ పరిచయం చేస్తున్నాను.కేరళలో పుట్టిపెరిగి బెంగ్లూరులో స్థిరనివాసం ఏర్పరుచుకున్న కవయిత్రి శ్రీమతి శ్రీకళా పి. విజయన్. పదేళ్ళవయసులోనే తనమొదటి కవితని రాసి టీచర్స్ మెప్పుపొందారు. ఆశువుగా అప్పటికప్పుడు కవిత రాసేనేర్పరితనానికి గానూ ఆమెను “నిమిషకవి” అని పిల్చేవారట స్కూల్లో.ఆమె ద్విభాషా కవయిత్రి. ఆంగ్లంలోనూ మళయాళంలోను రాస్తున్నా ఎక్కువగా ఆంగ్లంలో రాయటానికే మక్కువ చూపిస్తారు శ్రీకళ.

ఎంతోపని వత్తిడిలో కూడా విరివిగా రాస్తున్నా కవితా శిల్పంలోకానీ కవితావస్తువులోకానీ ఎక్కడా రాజీపడని మనస్తత్వం శ్రీకళది. బెంగ్లూరులో సౌందర్య సెంట్రల్ స్కూల్‌లో మేథ్స్ టీచర్‌గా పనిచేస్తూనె సాహితీపరమైన సమూహాల్లో వివిధపదవులు నిర్వహిస్తూ ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. Soul in Whole మరియు Amorous Musings ఆమె వెలువరించిన రెండు కవితా సంపుటాలు ప్రాచుర్యంపొందాయి.

Order of Shakespeare Medal, Golden Badge లాంటి ప్రతిష్టాత్మక పురస్కారాలతోపాటు గుజరాత్ సాహిత్యేకాడెమి ఎవార్డుకూడా దక్కించుకున్న కవయిత్రి శ్రీకళ.

ఆమెతో నెరపిన ముఖాముఖి నుంచి కొన్ని భాగాలు ఇక్కడ మీకోసం:

  • మీరు ఆంగ్లంలోనూ మళయాళంలోనూ రాస్తున్నా ఏ భాషలో ఎక్కువ రాస్తుంటారు, ఎందుకు? రెండుభాషలలోను కవయిత్రిగా మీ అనుభవం?

నేను ఆంగ్లంలోనే ఎక్కువ రాయటానికి ఇష్టపడతాను. మళయాళంకంటే అంగ్లంలోనే నాకు సౌకర్యంగా అనిపిస్తుంది.అదే కాకుండా వేర్వేరు భాషల్లో రాస్తున్నప్పుడు వేర్వేరు కవులుగా నన్ను నేను పరిగణించుకుంటాను. మళయాళంలో నేను ఎంచుకున్న కవితా వస్తువు ఆంగ్ల కవితావస్తువుకంటే చాలా భిన్నంగా ఉంటుంది.ఆంగ్లంలో కవితా వస్తువుకంటే కవితాశిల్పానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను.నా మాతృభాషలో రాస్తున్నప్పుడు జీవితం నుంచేఎక్కువ విషయాలను ఎంచుకుంటాను. దీనికి ప్రత్యేకమైన కారణాలంటూ ఏమీ లేవు కానీ ప్రధానంగా ఆంగ్లంలో రాసే కవితలు ఎక్కువమందికి చేరతాయనే అభిప్రాయం ముఖ్యమైన కారణం కావొచ్చు.

  • మీ ఆంగ్లకవితలెప్పుడూ ఎండ్ రైంస్‌లో ఉంటాయి. దీనికి ప్రధాన కారణం?

చిన్నప్పుడు స్కూల్లో చదివిన రైంస్ కి అర్ధం కంటే కవిత చదవటమే ప్రధానంగా ఉండటం, ఇంటికొచ్చాక కూడా వాటిని వల్లెవేస్తూ ఉండటం నన్ను ఆవిధమైన కవితలవవైపు ఆకర్షించింది. కవిత కేవలం ఏదో బలమైన లేదా బరువైన పదాలతో నింపి ఏ పెద్ద తత్త్వవేత్త కావాలనే ఉద్దేశ్యం కంటే కవిత రీడబుల్‌గా ఒకటికి రెండు సార్లు చదివే విధంగా ఉండాలనే ఫిలాసఫి నాది.

అంతె కాకుండా నా మెంటార్ శ్రీ షిజు పల్లెథాజేత్. మోటివేషనల్ స్ట్రిప్స్ అని ఓ వెబ్ పోర్టల్‌కి ఆయన వ్యవస్థాపక అధ్యక్షులు. వారు కేవలం ఈ రకంగా ఎండ్ రైంస్ పద్ధతిలోనే రాస్తుంటారు. వారితో చర్చించాక నేను కూడా ఆవిధంగా రాయటం  అలవాటు చేసుకున్న్నాను .

  • ఇన్ని వందల కవితలను దాదాపు అన్నిటినీ ఎండ్ రైమ్మ్ తో రాయటం దాదాపు అసాధ్యమైన పని.మీరు కవితని ఎలా రూపొందిస్తారు? మీకవితలల్లో ప్రధానంశాలేమిటి?

నాకు కవిత్వం చాలా ఇష్టమైన పనే కానీ  కవిత్వం రాసే ప్రక్రియను సీరియస్ గా తీసుకోను. ఏదో స్కూల్ సిలబస్‌లో నా కవిత్వం ఉండాలనో లేక పురస్కారాలకోసమో రాయను. చాలా సహజంగా నా కవిత్వం ప్రవహిస్తుంది. ఇన్ని లైన్లు మాత్రమే ఉండాలనో లేక ఫలానా నియమనిబంధనలతో రాయాలనో అనుకోను. కేవలం పాఠకులకోసమే రాస్తాను. ఎప్పట్నుంచో రాస్తున్నా ఈ మధ్య మాత్రమే నా మొదటి కవితా సంపుటి తీసుకొచ్చాను.

శ్రీకళ రాసిన కవితల నుంచి రెండు కవితలు మీకోసం:

POEM 1

 SECRET SANTA

Unboxing of an aura of extreme passion and happiness,

Neither words are sufficient nor the expressions for the fullness.

Sparkles of intense emotions reciprocates,

River of love is not the one that suffocates.

Her eyes glittered in the celestial feel of ecstacy ,

To witness the day of highest degree of intimacy.

Adorned herself with a honest smile,

In the wintry night, she stood near the window for a while.

The cool breeze with the scent of romance,

Hugged mightily around her waist, tempting her to dance.

Addicted to those hot whispers, she danced to his tune,

Jingles sang merrily while their breaths turned hot, till the next noon.

Secret Santa taught her the lessons of love,

Every moves he whispered in her ears, this is how I love.

Twists and turns , beneath and above,

Happens in love, resulting in WOW!

Did the secret Santa bring such a surprise to you too,

Where you were left behind without any clue?

Signature of love, that my secret Santa gifted, turned me into a happy woman,

What did you receive as a gift, to be the most humble human?

©️Sreekala P Vijayan

POEM 2

 TOKEN ACCEPTED

The testament of affection, in all its tingling colour,

Flew among the clouds with wings of infinite confirmation brimming with amor,

Revolts,were the testimonial, never that all time to be under rumor,

Time heals the soreness of chicaneries that spread like a tumor.

The token is accepted, as a breeze whispered, be together forever,

Maiden love rooted and grounded, finds strength , won’t be broken ever.

The veil of protection, caring and suggestion,kept the soul in love’s armour,

North and South poles can never be isolated, is the rule of magnetic power.

©️Sreekala P Vijayan

విశాఖలో పుట్టి అక్కడే డాక్టరేట్ వరకూ చదివి ఆపై విదేశాల్లో వివిధ యూనివర్శిటీల్లో పనిచేసి ఇప్పుడు బెంగ్లూరు లో స్థిరపడి ఇక్కడ ఫ్రీలాన్సర్ గా పనిచేస్తున్నారు. రోజంతా పాఠం చెప్పటం... రాత్రైతే ఏదో రాసుకోవటం లాంటివి చేస్తుంటానంటారు. కవిత్వం అంటే ఇష్టం. కవిత్వం గురించిన చర్చలు కూడా ఇష్టమే.

Leave a Reply